For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చెరుకు రసం కామెర్ల నుంచి క్యాన్సర్ వరకూ తరిమికొట్టగలదు లైంగిక శక్తిని పెంచగలదు..సమ్మర్ లో కుమ్మేయండి

చెరుకు లో గ్లూకోజ్ శాతం ఎక్కువ. శరీరంలో తేమ కోల్పోయినప్పుడు డీహైడ్రేట్ అవుతుంది. చెరుకులో క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఇనుము, మాంగనీసు ఉంటాయి. చెరుకు రసం, చెరకు జ్యూస్, చెరకు.

|

మన దగ్గర చెరుకు రసం ఎప్పుడైనా, ఎక్కడైనా లభిస్తుంది. ప్రధానంగా ఎండాకాలంలో చాలా మంది చిరు వ్యాపారులు దీన్ని విక్ర‌యిస్తారు. ఎండ‌లో బ‌య‌ట తిరిగే వారు ఎక్కువ‌గా చెరుకు ర‌సాన్ని తాగేందుకు ఆస‌క్తి చూపుతారు. అయితే చెరుకు ర‌సం కేవ‌లం మ‌న దాహాన్ని తీర్చ‌డ‌మే కాదు, ఎన్నో పోష‌కాల‌ను అది మ‌న‌కు అందిస్తుంది. దాంట్లో ఎన్నో ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి.

యాంటీ ఆక్సిడెంట్లు

యాంటీ ఆక్సిడెంట్లు

చెరుకు రసంలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఏర్పడే ఫ్రీ ర్యాడికల్స్ ప్రభావాన్ని తగ్గించడమే కాక, కణాలు నాశనం కాకుండా చూస్తాయి. దీంతోపాటు శరీర రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తాయి. ఐరన్, మెగ్నిషియం, కాల్షియం, ఎలక్ట్రోలైట్స్ దీంట్లో అధికంగా ఉంటాయి. ఇవి డీహైడ్రేషన్ సమస్య నుంచి బయటపడేస్తాయి.

లివర్‌ను పటిష్టం చేస్తుంది

లివర్‌ను పటిష్టం చేస్తుంది

ఎండ‌లో తిరిగే వారు చెరుకు ర‌సం తాగితే శ‌రీరంలో ద్ర‌వాలు స‌మ‌తుల్యం అవుతాయి. దీంతో ఎండ దెబ్బ తాక‌కుండా ఉంటుంది. సాధారణ జలుబు, ఇతర ఇన్‌ఫెక్షన్లను తగ్గించడంలో చెరుకు రసం బాగా పనిచేస్తుంది. చెరుకు రసం శరీరంలోని ప్రోటీన్ లెవల్స్‌ను పెంచుతుంది. మూత్రాశయ ఇన్‌ఫెక్షన్ల బారి నుంచి రక్షిస్తుంది. కిడ్నీల పనితనం మెరుగు పడుతుంది. లివర్‌ను పటిష్టం చేస్తుంది. పచ్చకామెర్ల వ్యాధి ఉన్న వారికి చెరుకు రసం మంచి ఔషధంగా పనిచేస్తుందని ఆయుర్వేదం చెబుతోంది.

అలసట తొలగిపోతుంది

అలసట తొలగిపోతుంది

చెరకు రసం అనేక అనారోగ్యాల బారి నుంచి త్వరగా కోలుకునేలా చేస్తుంది. తక్షణ శక్తినిచ్చే కార్బొహైడ్రేట్లు, ప్రోటీన్లు, ఐరన్, పొటాషియం వంటివి ఇందులో అధికంగా ఉన్నాయి. అలసట తొలగిపోతుంది. చెరుకు రసాన్ని తరచూ తీసుకుంటే మలబద్దకం తొలగిపోతుంది. సహజసిద్ధమైన లాక్సేటివ్ గుణాలు దీంట్లో ఉన్నాయి. కడుపులో మంట, అసిడిటీ వంటి సమస్యలను తగ్గిస్తుంది.

మినరల్స్ ఉంటాయి

మినరల్స్ ఉంటాయి

మధుమేహం ఉన్నవారు కూడా నిరభ్యంతరంగా చెరుకు రసాన్ని తాగవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. ఇది రక్తంలోని చక్కెర స్థాయిలపై ప్రభావం చూపే అవకాశాలు తక్కువగా ఉంటాయని వారు చెబుతున్నారు. నోటి దుర్వాసనను, దంత క్షయాన్ని తగ్గించే అనేక రకాల విటమిన్లు, మినరల్స్ చెరుకు రసంలో ఉన్నాయి.

తక్షణమే శక్తి

తక్షణమే శక్తి

డీహైడ్రేషన్, తక్కువ బ్లడ్ షుగర్ లెవల్స్ ఉండేవారు, నీరసంగా, బద్దకంగా ఉండేవారు రోజూ ఒక గ్లాస్ చెరుకు రసం తాగాలి. దీంతో తక్షణమే శక్తి లభిస్తుంది. యాక్టివ్‌గా ఉంటారు. ఏ పని చేసినా అంత త్వరగా అలసిపోరు. క్రీడాకారులు, వ్యాయామం చేసే వారికి మంచి ఎనర్జీ డ్రింక్‌గా చెరుకు రసం పనికొస్తుంది. కూల్ డ్రింక్స్ తాగే బదులు సహజ సిద్ధమైన చెరుకు రసం తాగితే మంచి ఫలితం కలుగుతుంది.

కిడ్నీ స్టోన్లు పోతాయి

కిడ్నీ స్టోన్లు పోతాయి

రోజూ ఒక గ్లాస్ చెరుకు రసం తాగితే మూత్రాశయ సమస్యలే కాదు, కిడ్నీ స్టోన్లు కూడా ఉండవు. కరిగిపోతాయి. కిడ్నీల పనితీరు మెరుగు పడుతుంది. పచ్చ కామెర్లు వచ్చిన వారు చెరుకు రసం తాగితే ఫలితం ఉంటుందని ఆయుర్వేదం చెబుతోంది. ఎందుకంటే లివర్ పనితీరును మెరుగు పరిచే గుణాలు చెరుకు రసంలో ఉంటాయి. కనుక లివర్ ఆరోగ్యం బాగుపడుతుంది. ఫలితంగా కామెర్లు తగ్గుతాయి. శరీరం కోల్పోయిన ప్రోటీన్‌ను తిరిగి పొందేందుకు చెరుకు రసం పనికొస్తుంది.

ఎముకలను దృఢంగా మారుస్తుంది

ఎముకలను దృఢంగా మారుస్తుంది

చెరుకు రసంలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఇది ఎముకలను దృఢంగా మారుస్తుంది. దంత సమస్యలను పోగొడుతుంది. రోజూ ఒక గ్లాస్ చెరుకు రసం తాగితే చర్మం కాంతివంతంగా, మృదువుగా మారుతుంది. మొటిమలు, మచ్చలు పోతాయి. అయితే చెరుకు రసంలో కొద్దిగా ముల్తానీ మట్టి కలిపి ముఖం, మెడకు రాసి 20 నిమిషాలు ఆగాక కడిగేసినా ముఖం కాంతివంతంగా ఉంటుంది. మచ్చలు పోతాయి.

గర్భిణులకు మంచిది

గర్భిణులకు మంచిది

గర్భిణులకు చెరకు రసం చాలా మంచిది. ఇందులో ఇనుము, ఫొలేట్లు అధికంగా ఉంటాయి. ఇవి హిమోగ్లోబిన్‌ శాతాన్ని పెంచడంలో కీలకపాత్ర పోషిస్తాయి. గర్భస్థ శిశువుకు ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి.ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అవి చర్మాన్ని మృదువుగా ఉంచుతాయి. జుట్టు ఎదుగుదలకు ఎంతో తోడ్పడతాయి. వృద్ధాప్య ఛాయల్నీ అడ్డుకుంటాయి.

రోగనిరోధకశక్తి పెరుగుతుంది

రోగనిరోధకశక్తి పెరుగుతుంది

చెరకు రసంతో రోగనిరోధకశక్తి పెరుగుతుంది. వ్యాధులకు దూరంగా ఉంటాం. కాలేయం శుభ్రపడి.. దాని పని తీరు మెరుగుపడుతుంది. పొట్టలో కూడా ఇన్‌ఫెక్షన్లు దరిచేరవు. జీర్ణవ్యవస్థ చక్కగా పనిచేస్తుంది

చెరకు రసం తాగితే నోటి దుర్వాసనలు రావు. దుర్వాసనలు లేకుండా చూస్తుంది. ఈ రసంలో ఖనిజాలు ఎక్కువ. గోళ్ల ఎదుగుదలా బావుంటుంది.

ప్రొటీన్లు వెంటనే అందుతాయి

ప్రొటీన్లు వెంటనే అందుతాయి

గొంతు మంట, ఇన్‌ఫెక్షన్‌ ఉన్నవారు చెరకు రసం ఎంత తాగితే అంత మంచిది. ఇందులోని సహజ చక్కెరలు సమస్యని దూరం చేస్తాయి. జ్వరం వల్ల శరీరం ప్రొటీన్లు కోల్పోతుంది. అలాంటి వారు చెరకు రసం తాగడం వల్ల కావాల్సిన ప్రొటీన్లు వెంటనే అంది... నీరసం తగ్గుతుంది.

డీహైడ్రేషన్ బారిన పడ్డప్పుడు

డీహైడ్రేషన్ బారిన పడ్డప్పుడు

చెరుకు రసం స్పోర్ట్స్ డ్రింక్‌గా కూడా ఉపయోగపడుతుంది. అలసటను దూరం చేసే మెగ్నీషియం, పొటాషియం, ఫాస్పరస్ కాల్షియం చెరుకు రసంలో ఉంటాయి.చెరుకు రసంలో సుక్రోజ్ రూపంలో ఉండే చక్కెరను శరీరం తేలికగా జీర్ణం చేసుకుంటుంది. కాబట్టి చెరుకు రసం తాగగానే తక్షణ శక్తి చేకూరుతుంది. డీహైడ్రేషన్ బారిన పడ్డప్పుడు చెరుకు రసం తాగితే త్వరగా కోలుకుంటారు.

మధుమేహం ఉన్నవారు తాగొచ్చు

మధుమేహం ఉన్నవారు తాగొచ్చు

చెరుకు రసంలో గ్లైసెమిక్ ఇండెక్స్ చాల తక్కువ. కాబట్టి మధుమేహం ఉన్నవారు కూడా చెరుకు రసం తాగొచ్చు. దీనిలోని సుక్రోజ్ దంత క్షయాన్ని కూడా నివారిస్తుంది. క్యాన్సర్ రాకుండా నియంత్రించే ప్లేవనాయిడ్స్ చెరుకు రసంలో ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాలు విస్తరించకుండా చేయడంతో పాటు వాటితో పోరాడి నాశనం చేస్తాయి. చెరుకు రసంలోని ఫ్లేవనాల్ ఒంట్లోని ఫ్రీ ర్యాడికల్స్‌ని పారదోలి కాలేయ వ్యాధులు, కామెర్ల నుంచి కాలేయానికి రక్షణ కల్పిస్తాయి.

కామెర్లను నయం చేస్తుంది

కామెర్లను నయం చేస్తుంది

చెరకు రసం కామెర్లను సహజంగా నయం చేసే ఔషధం. కాలేయ పనితీరు సరిగా లేకపోవడం, పిత్తాశయ వాహికలు మూసుకుపోవడం వల్ల కామెర్లకు దారి తీస్తుంది. దీని నుంచి బయటపడటానికి గ్లాసు చెరకు రసానికికొద్దిగానిమ్మరసం,ఉప్పు కలిపి ప్రతిరోజూ తీసుకోవాలి.

కాన్సర్‌ను నిరోధిస్తుంది

కాన్సర్‌ను నిరోధిస్తుంది

ఇందులో ఆల్కలీన్‌ ఉండటం వల్ల ముఖ్యంగా ప్రోస్ట్రేట్‌, ఊపిరితిత్తులు, రొమ్ము కాన్సర్‌, కాన్సర్‌ కారకాలను నిరోధిస్తుంది. శరీరంలో నీటిని నిల్వ చేయడానికి చెరకు రసం బాగా సహాయపడుతుంది.వేసవి కాలంలో ఎండా తీవ్రత వల్ల చర్మం కమిలిపోయి చాలా డ్రై గా మారుతుంది.చెరుకు రసంలో ఆల్ఫా హైడ్రాక్సీ అనే యాసిడ్స్ ఉన్నాయి.ఇది మీ చర్మానికి తగినంత తేమ ను అందించి చర్మం పొడి బారే సమస్యను తగ్గించి,చర్మాన్ని ఆరోగ్యంతో ఉండేలా చేస్తుంది.

జీర్ణ సమస్యలను నివారిస్తుంది

జీర్ణ సమస్యలను నివారిస్తుంది

చెరుకులో ఉండే పొటాషియం మీ జీర్ణ సమస్యలను నివారిస్తుంది.తాజా చెరుకు రసాన్ని తరుచుగా తీ సుకోవడం వలన కడుపులో ఏర్పడే ఇన్ఫెక్షన్లు తగ్గుముఖం పడతాయి. చెరుకు రసాన్ని తాగడం వల్ల అలసటను దూరం చేసి శరీరంలో ని వేడిని తగ్గిస్తుంది.శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచి తరుచుగా వచ్చే జ్వరాలను నివారిస్తుంది.

లైంగిక సామర్థ్యం పెంపొందుతుంది

లైంగిక సామర్థ్యం పెంపొందుతుంది

ఆయుర్వేద శాస్త్రం లో చెరకు రసం వాడకం అత్యంత ప్రాధాన్యత వహించింది. ఒక స్పూన్ చెరకురసంలో 4 నుంచి 5 గ్రాముల వరకూ కార్బోహైడ్రేట్లు, కాల్షియం దండిగా మెండుగా వున్నాయి.

బెల్లం తయారీ చెరకుసం నుండే సిద్ధమవుతుంది. బెల్లం వాడకం ప్రాముఖ్యత ఆయుర్వేదంలో ఉపయోగించబడే కొన్ని లేహ్యాలలో సైతం చెరకు రసం నుంచి తీసే బెల్లం ఉపయోగిస్తున్నారు.

చలవ చేసే గుణం కలది. అలాగే చెరుకు రసం లైంగిక సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది.

మోతాదు మించి తాగరాదు

మోతాదు మించి తాగరాదు

అరికాళ్లు మంటగా వున్నా, మూత్రం మంటగా వున్నా గ్లాసు చెరకురసంతో ఎంతో ఉపశమనం. శరీరానికి శక్తినిచ్చే గుణం కలది. చాలా లావుగా వున్నవాళ్ళు చెరకు రసం మోతాదు మించి తాగరాదు. కండరాలకు, మేధస్సుకు అద్భుత శక్తినిచ్చే దివ్య ఔషధం. చెరకు రసం తాగేవారు నిమ్మరసం, అల్లంముక్క కలుపుకుని సాయంత్రం వేళలో తీసుకోవడం ప్రయోజనకరం.

ప్రోటీన్ల శాతం ఎక్కువే

ప్రోటీన్ల శాతం ఎక్కువే

చెరుకు లో గ్లూకోజ్ శాతం ఎక్కువ. శరీరంలో తేమ కోల్పోయినప్పుడు డీహైడ్రేట్ అవుతుంది. చెరుకులో క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఇనుము, మాంగనీసు ఉంటాయి. దీనిలో ప్రోటీన్ల శాతం కూడా ఎక్కువే. గ్లాసు చెరుకు రసంలో కొద్దిగా నిమ్మరసం, కొబ్బరి నీళ్లూ కలిపి తీసుకోవడం మంచిది. చెరకులో ఆరోగ్యానికి ఉపయోగపడే మినిరల్స్, విటమిన్స్, యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. అందువల్లే చెరకు రసం తక్షణ శక్తినందిస్తుంది. అంతే కాకుండా కొన్ని ప్రత్యేకమైన జబ్బులను ఇది నివారిస్తుంది. అయితే చెరుకు రసాన్ని మోతాదుకు మించి తాగడం మంచిది కాదు.

English summary

top 30 benefits of sugarcane juice

top 30 benefits of sugarcane juice
Story first published:Thursday, May 3, 2018, 9:54 [IST]
Desktop Bottom Promotion