Latest Updates
-
ప్రకాష్ రాజ్ ఇంట తీవ్ర విషాదం.. కన్నుమూసిన తల్లి సువర్ణలత -
2026 హనుమాన్ జయంతి: ఏప్రిల్ 1నా? 2నా? సరైన తేదీ, పూజా ముహూర్తాల పూర్తి వివరాలు! -
తందూర్, ఓవెన్ లేకుండానే.. ఇంట్లో పెనంపైనే నోరూరించే పనీర్ టిక్కా..మస్త్ టేస్ట్! -
మళ్లీ లాక్ డౌన్ తప్పదా? ప్రపంచాన్ని వణికిస్తున్న కొత్త కరోనా వేరియంట్ సికాడా! -
మందులు వద్దు.. రోజుకో బెల్లం-కొబ్బరి లడ్డూ'తో మీ ఎముకలు ఉక్కులా! -
ఈరోజు రాశి ఫలాలు (30.03.26): సోమవారం నాడు ఈ రాశుల వారికి అదృష్టం వరిస్తుంది! -
బిర్యానీని మించిన రుచితో గుత్తి వంకాయ పులావ్.. ఇలా చేస్తే లొట్టలేసుకుని తింటారు! -
రొటీన్ బ్రేక్ ఫాస్ట్ బోర్ కొట్టిందా? కమ్మటి ఉల్లిపాయ-పల్లీ పరాఠా ట్రై చేయండి..టేస్ట్ లో వేరే లెవెల్! -
ఇంట్లోనే KFC స్టైల్ పాప్ కార్న్ చికెన్..పైకి కరకర, లోపల జ్యూసీ.. -
పెరుగన్నం, పప్పులోకి అమృతంలా ఉండే చల్ల మిరపకాయలు..ఇలా చేస్తే కరకరలాడుతూ ఏడాదంతా నిల్వ!
అల్లాన్ని అలా తీసుకుంటే ఆ సామర్థ్యం పెరుగుతుంది.. శీఘ్రస్కలనం మటాష్..అల్లంతో అదిరిపోయే ప్రయోజనాలు
ఒక స్పూన్ అల్లం రసంలో సగం ఉడికించిన కోడిగుడ్డు, తేనె కలిపి రోజూ రాత్రి పడుకునే ముందు తీసుకుంటే పురుషుల్లో శీఘ్రస్ఖలనం సమస్య తగ్గుతుంది.వీర్యం పోవడం తగ్గి శృంగార సామర్థ్యం పెరుుగుతుంది
అల్లం దీనికి గురించి తెలియని వారు ఉండరేమో ఎందుకంటే మనం నిత్యం తీసుకునే ఆహారంలో ఇది ఒక భాగం. ప్రకృతి ప్రసాదించిన వనమూలికల్లో అల్లం ఒకటి. భారతీయులు దాదాపు 5000 సంవత్సరాల నుంచి అల్లంని వంటల్లోనే కాదు.. అనేక ఔషధాల తయారీల్లో కూడా ఉపయోగిస్తున్నారు. మన పూర్వికులు దాని ప్రాధాన్యత తెలిసే మనం రోజు తినే ఆహారంలో ఏదో ఒక రూపంలో ఇది మన శరీరంలోకి చేరే విధంగా అలవాటు చేసుకున్నారు. ఇప్పుడు అదే అలవాటు మనకు చేశారు.

ఎవరూ ఇష్టపడరు
కానీ రానురాను మనం అల్లం తక్కువ మోతాదులోనే వాడుతున్నాం అనే చెప్పాలి. అయితే అల్లం కాస్త ఘాటుగా ఉండటం వల్ల దాన్ని డైరెక్ట్ గా తీసుకోవడానికి ఎవరూ ఇష్టపడరు. అయితే.. జ్యూస్ రూపంలో అంటే.. ఒక కప్పు అల్లం రసం తీసుకోవడం వల్ల అమోఘమైన ఫలితాలు పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. మరి ఇలా తగినంత జ్యూస్ తీసుకోవడంవలన చాలా ఉపయోగాలు ఉన్నాయి.

మంచి ఔషధంగా
మనం నిత్యం వంటల్లో వేసే మసాలాల జాబితాలోకి అల్లం వస్తుంది. వంటలకు రుచినిచ్చే పదార్థంగానే కాక ఇది మనకు కలిగే అనారోగ్య సమస్యలను నయం చేసే ఔషధంగా కూడా పనిచేస్తుంది. మనకు అనేక ఆరోగ్యకర ప్రయోజనాలను అందించే ఎన్నో ఔషధగుణాలు అల్లంలో ఉన్నాయి. ఈ క్రమంలోనే నిత్యం ఉదయాన్నే పరగడుపునే ఒకటి రెండు టీస్పూన్ల అల్లం రసం సేవిస్తే ఎలాంటి అద్భుతమైన లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

మతిమరుపు పోతుంది
వయస్సు మీద పడడం కారణంగా వచ్చే మతిమరుపు, అల్జీమర్స్ వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. మెదడు యాక్టివ్‌గా మారి పనితీరు పెరుగుతుంది. అల్లంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, బయో యాక్టివ్ సమ్మేళనాలు మెదడులో వచ్చే వాపులను తగ్గిస్తాయి. మెదడు పనితీరును మెరుగు పరుస్తాయి.

హార్ట్ ఎటాక్ కు నివారణ
శరీరంలో ఎల్‌డీఎల్ (చెడు) కొలెస్ట్రాల్ పెరిగిపోతే హార్ట్ ఎటాక్‌లు వస్తాయని తెలిసిందే. అయితే నిత్యం అల్లం రసం సేవించడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పోయి మంచి (హెచ్‌డీఎల్) కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దీంతో గుండె జబ్బులు రాకుండా కాపాడుకోవచ్చు.

పరగడుపున అల్లం రసం
చాలా మందికి ఉదయం నిద్రలేవగానే లేదంటే రోజులో ఇతర సందర్భాల్లోనూ వికారంగా ఉంటుంది. దీన్ని నివారించాలంటే ఉదయాన్నే పరగడుపున అల్లం రసం తాగాలి. దీంతో ఫలితం ఉంటుంది. స్త్రీలకు రుతు సమయంలో కలిగే తీవ్ర రక్తస్రావం, కడుపునొప్పి వంటి సమస్యల నుంచి ఉపశమనం కలగాలంటే రోజూ అల్లం రసం తీసుకోవాలి.

అల్లంతోపాటు దాల్చిన చెక్క పొడి
అల్లంలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు కీళ్ల నొప్పులను తగ్గిస్తాయి. అల్లంతోపాటు దాల్చిన చెక్క పొడిని కలిపి వాడితే ఇంకా మెరుగైన ఫలితం ఉంటుంది. జీర్ణ సమస్యలను నయం చేసి జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగు పరిచే గుణాలు అల్లంలో ఉన్నాయి. అజీర్ణం, మలబద్దకం, గ్యాస్ సమస్యలు పోవాలంటే నిత్యం అల్లం రసం సేవించాలి.

విలువైన పోషకాలున్నాయి
నిత్యం అల్లం రసం సేవిస్తే శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. అల్లంలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు కండరాల నొప్పులను కూడా తగ్గిస్తాయి. అల్లం వంటల్లో అద్భుతమైన రుచినే అందిస్తూనే కడుపులోని మంటను కూడా తగ్గిస్తుంది. విటమిన్స్, మాంగనీస్, కాపర్ వంటి విలువైన పోషకాలున్నాయి. అల్లం మంచి యాంటీ ఆక్షిడెంట్ గా పని చేస్తుంది. రక్త శుద్దికి, అలాగే రక్తం రక్త నాళాల లో గడ్డకట్టనీయకుండా సహాయపడుతుంది.

కాన్సర్ ని నివారించడానికి
డయాబెటిస్ తో బాధపడేవాళ్లలో బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ని కంట్రోల్ చేయడంలో అల్లం జ్యూస్ సహాయపడుతుంది. అల్లంలో బయో యాక్టివ్ ఫెనోలిక్స్, నాన్ వొలాటైల్ ఉంటాయి.ఇవి కాన్సర్ ని నివారించడానికి ఉపయోగపడుతాయి. గ్లూకోజ్ లెవెల్స్ పెరగకుండా అలాగే కొలెస్ట్రాల్ లెవెల్స్ ని కూడా ఎఫెక్టివ్ గా తగ్గిస్తుంది.

కీళ్ల నొప్పులకు ఉపశమనం
అల్లం వల్లమోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు.అల్లం వల్ల అల్సరు ఏర్పడదు. నోటి దుర్వాసనను పోగొడుతుంది. దంతాలను ఆరోగ్యముగా ఉండేలా చేస్తుంది.

షుగర్ నియంత్రణకు అల్లం
షుగర్ జబ్బు నియంత్రణ చేయగలిగిన శక్తివంతమైన ఔషధం అల్లం అని సిడ్నీవిశ్వవిద్యాలయం పరిశోధనల్లో వెల్లడయ్యింది. అల్లము నుంది తీసిన రసాన్ని , అల్లం ముద్దగా నూరి అందించిన వారిలో రక్తములోని చెక్కెరలు కండరాలకు చేరే ప్రక్రియ వేగవంతం అవడము గమనించారు . ఇటుంటి ప్రక్రియ శరీరములో సహజము గా జరగాలంటే ఇన్సులిన్ అనే హార్మోను అవసరం. ఇన్సులిన్ లేకున్నా అల్లం రసము రక్తము లో చెక్కెరలను కండరాలకు చేర్చడం గమనించిన పరిశోదకులు అల్లం ఎలా పనిచేస్తుందో వివరించే పనిలో పడ్డారు .

అజీర్తి బాధపడే వారు
అజీర్తితో బాధపడుతున్న వారు అల్లం సేవిస్తే ఉపశమనం కలుగుతుంది. ఉదరంలో గ్యాస్ ఏర్పడితే అల్లం దివ్యౌషధంలా పని చేస్తుంది. దగ్గు, జలుబు, కఫం మొదలైన వాటికి అల్లం అమృతంలా పని చేస్తుందనడంలో సందేహం లేదు. ఉబ్బసపు వ్యాధితో బాధపడే వారు అల్లం రసంలో తేనెను కలుపుకుని సేవిస్తే ఉబ్బసం నుంచి ఉపశమనం కలగడమే కాకుండా ఆకలి బాగా వేస్తుంది. జీర్ణక్రియ సాఫీగా జరిగేలా అల్లం ఉపయోగపడుతుంది.

ధనియాల రసం
గ్లాసు నీటిలో ఒక నిమ్మకాయను పిండి దాని రసం, రెండు స్పూన్ల అల్లం రసం, రెండు స్పూన్ల తేనె, రెండు స్పూన్ల ధనియాల రసం కలిపి ఉదయం పూట తీసుకోవడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. అంతేకాకుండా గుండె దడ, తల తిప్పడం, తలనొప్పి, అలసట తగ్గుతాయి.

రోజూ రెండు మూడుసార్లు తీసుకుంటే
రెండు స్పూన్ల అల్లం రసంలో ఒక స్పూన్ తేనె కలిపి ఉదయం, సాయంత్రం తాగుతుంటే శరీరంపై వచ్చే దద్దుర్లు, తరచుగా జలుబు, తుమ్ములు రావడం, దగ్గు, ఆయాసం నెమ్మదిస్తాయి. పులి తేన్పులు తగ్గి జీర్ణశక్తి మెరుగవుతుంది. అల్లం, బెల్లం సమానంగా కలిపి నూరి రోజూ రెండు మూడుసార్లు తీసుకుంటే అరికాళ్లు, చేతుల్లో పొట్టు ఊడటం తగ్గుతుంది. రాత్రి పడుకునే ముందు తీసుకుంటే మలబద్దకం లేకుండా సుఖ విరేచనం అవుతుంది.

శీఘ్రస్ఖలనం తగ్గుతుంది
ఒక స్పూన్ అల్లం రసంలో సగం ఉడికించిన కోడిగుడ్డు, కొద్దిగా తేనె కలిపి రోజూ రాత్రి పడుకునే ముందు తీసుకుంటే పురుషుల్లో శీఘ్రస్ఖలనం సమస్య తగ్గుతుంది. అలాగే అప్రయత్నంగా వీర్యం పోవడం తగ్గి శృంగార సామర్థ్యం పెరుగుతుంది. తులసి ఆకులు, పసుపు, అల్లం రసంతో నూరి దద్దుర్లు, దురద, మచ్చలు, మొటిమలు మొదలైనవాటిపై రాస్తుంటే అవి త్వరగా తగ్గుతాయి. ఆముదంలో అల్లపు రసం కలిపి చర్మానికి పూస్తే వివిధ చర్మ వ్యాధులు తగ్గుతాయి.



Click it and Unblock the Notifications











