For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  భార్యతో రాత్రి ఆ భంగిమలో పడుకుంటే ఏమవుతుందో తెలుసా?

  |

  రోజంతా ఎంత అలసిపోయినా.. రాత్రి హాయిగా పడుకుంటామనే నమ్మకమే మనిషిని నడిపిస్తుంది. నిద్రాదేవి ఆవహించినపుడు ఒళ్లు మరచి పడుకుంటాం. ఆ నిద్దట్లో ఏ నృత్యరీతులకూ అందని భంగిమలు ప్రదర్శిస్తుంటాం. నిద్రించే శైలి ఆరోగ్యంతో పాటు మానసిక పరిస్థితిపై కూడా ప్రభావం చూపిస్తుందని తేల్చారు పరిశోధకులు.

  పసిపాపలా నిదురపో

  పసిపాపలా నిదురపో

  తీయగా వినిపించే పాట లేకున్నా.. పసిపాపలా ముడుచుకుని పడుకుంటే బంగారంలాంటి నిద్ర ఖాయమని తేలింది. ఇలా పడుకున్న ప్పుడూ నిద్రలో భంగిమలు మార్చడం వల్ల శరీరం ఫ్లెక్సిబిలిటీగా మారుతుంది. అంతేకాదు బుజ్జాయి స్టైల్‌లో బజ్జోవడం వల్ల మానసిక ఒత్తిడి కూడా దూరమవుతుందట. అయితే ఈ పొజిషన్‌లో టైట్‌గా కాకుండా ఫ్రీగా శ్వాస ఆడేలా పడుకోవాలని సూచిస్తున్నారు.

  ఎడమైతే కలత నిదురే

  ఎడమైతే కలత నిదురే

  ‘కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్‌..' సూత్రం ఎక్కడైనా పనికొస్తుందేమో గానీ, నిద్ర దగ్గర మాత్రం పనికిరాదని చెబుతున్నారు స్టడీకారులు. ఎందుకంటే ఎడమవైపు తిరిగి పడుకునేవారిలో కలల అలజడికి నిద్దుర కరువైతుందని తేల్చారు. ఆ వచ్చే కలల్లో పీడకలలే ఎక్కువగా ఉంటాయని విశ్లేషించారు. లెఫ్ట్‌సైడ్‌గా బజ్జునేవారిలో దాదాపు 40.9 శాతం మంది పీడకలలు కనేవారేనని లెక్కలు కట్టి మరీ చెప్పుకొచ్చారు.

  వెల్లకిలా.. వెన్నుభలా..

  వెల్లకిలా.. వెన్నుభలా..

  కడుపు నిండా తిండి ఎలాగో అలా దక్కుతుంది. కానీ, కంటినిండా నిద్ర దక్కాలంటే మాత్రం అదృష్టం చేసుకోవాల్సిందే. ఈ అదృష్టం మీకు దక్కాలంటే వెల్లకిలా పడుకోవడం అలవాటు చేసుకుంటే బెటరని సదరు స్టడీలో తేలింది. ఇలా పడుకోవడం వల్ల వెన్నుముక ఆరోగ్యంగా ఉంటుందని సూచిస్తున్నారు. అంతేకాదు ప్రశాంతమైన నిద్ర గ్యారెంటీ అని చెబుతున్నారు.

  స్వప్నలోకంలోకి..

  స్వప్నలోకంలోకి..

  బోర్లా పడుకుంటే దరిద్రమని పెద్దలు అంటుంటారు. అయితే దిండును గాఢంగా హత్తుకుంటూ ఇలా పడుకునే వారు రాత్రంతా స్వప్నలోకంలో ఎంచక్కా విహరిస్తుంటారట. అక్కడ వీరికి కాస్త రొమాంటిక్‌ కలలు, మనసును ఉల్లాసపరిచే దృశ్యాలు దర్శనమిస్తాయని పరిశోధకులు కనుగొన్నారు. అయితే ఈ పొజిషన్‌లో పడుకోవడం వల్ల శ్వాస సరిగ్గా తీసుకోలేరని ఫలితంగా తలనొప్పి, మెడనొప్పి ఇబ్బంది పెడతాయి.

  బోర్లా పడుకుంటే

  బోర్లా పడుకుంటే

  చాలామందికి బోర్లా పడుకోవడం అలవాటుగా ఉంటుంది. వాళ్లకి అలా పడుకుంటేనే చక్కగా నిద్రపడుతుంది. కానీ ఇలా ఎక్కువసేపు పడుకొంటే.. మెడపై ప్రభావం చూ పుతుంది. అంతే కాదు ఒత్తిడికి కారణమవుతుంది. కాబట్టి ఇలా ఎక్కువసేపు పడుకోకపోవడమే మంచిది.

  సోల్జర్ స్టైల్

  సోల్జర్ స్టైల్

  నిపుణులు చెబుతున్నదాని ప్రకారం నిద్రించడంలో ఇది పర్‌ఫెక్ట్ స్టైల్ అంటున్నారు. ఈ పొజిషన్‌లో వెల్లకిలా పడుకొని, రెండు చేతులూ చేరోవైపు సమాంతరంగా చాపి ఉంచాలి. ఇది ఆరోగ్యకరమైన నిద్రకు ఉపకరిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఎవరికైనా నిద్రించడానికి ఇదే కరెక్ట్‌ భంగిమ అని చెబుతారు. దీన్ని యోగాలో శవాసనం అంటారు. దీని వల్ల మన వెన్నెముకకు విశ్రాంతి లభిస్తుంది. మెడ, చేతులకు బలం కలుగుతుంది.

  ముఖంపై ముడతలు రావు

  ముఖంపై ముడతలు రావు

  సోల్జర్ పొజిషన్ శరీర భంగిమను మెరుగు పరుస్తుంది. అసిడిటీ తగ్గుతుంది. ఛాతి కరెక్ట్‌ సైజ్‌లో ఉంటుంది. నిద్రలేమి సమస్య దూరమవుతుంది. తలనొప్పి ఉండదు. ముఖంపై ముడతలు రావు. అయితే ఈ భంగిమలో నిద్ర పోవడం వల్ల గురక ఎక్కువగా వస్తుంది. గర్భంతో ఉన్న స్త్రీలకైతే కడుపులోని పిండంపై ప్రభావం చూపుతుంది. వెన్నెముక కింది భాగంలో కొంత మందికి నొప్పి రావచ్చు. అయితే ఈ సమస్యలను నివారించాలంటే తల కింద దిండు లేకుండా నిద్రించాలి.

  గర్భవతులు ఇలా

  గర్భవతులు ఇలా

  కడుపుతో ఉన్నవారు ఎడమవైపు తిరిగి పడుకోవడం ఆరోగ్యకరమని చెబుతున్నారు నిపుణులు. ఇలా పడుకోవడం వల్ల కడుపులోని శిశువుకు మరింత రక్తం, పోషకాలు అందుతాయంటున్నారు.

  వెల్లకిలా నిద్రిస్తే..

  వెల్లకిలా నిద్రిస్తే..

  పొట్ట భాగం పైకి ఉంచేలా, వీపు భాగం భూమిని ఆనేలా పడుకొనే ఈ పద్ధతిలో శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. గురక పెట్టే అలవాటున్న వారిలో ఇది మరింత ఎక్కువే ఉంటుంది. వెన్నుభాగాన్ని ఆధారంగా చేసుకొని పడుకోవడం ద్వారా, శ్వాససంబంధిత ఇబ్బందులు మరింత పెరుగొచ్చు.

  భాగస్వామితో కలిసి

  భాగస్వామితో కలిసి

  ఇక భార్యతో కలిసి నిద్రించేవాళ్లు.. ఒకరినొకరు హత్తుకొని పడుకుంటారు. అది శరీరం ఆక్సిటోసిన్‌ను రిలీజ్ చేసేందుకు ఉపకరిస్తుంది. ఒత్తిడి తగ్గి, బంధాలు, అనుబంధాలు బలపడేందుకు దోహదం చేస్తుంది. ఈ భంగిమ భార్యాభర్తలకు చాలా మంచిది.

  ఒక వైపునకు తిరిగి

  ఒక వైపునకు తిరిగి

  గురకపెట్టే అలవాటు ఉన్నవారు ఒకవైపు తిరిగి పడుకోవడం ఉత్తమం. పెద్దగా గురక పెట్టేవారు నిద్రించే సమయంలో శ్వాససంబంధిత సమస్యలతో ఇబ్బంది పడొచ్చు. ఇది బీపీ, గుండె సంబంధిత వ్యాధులకు దారి తీయవచ్చు. అందుకే ఏదో ఒక వైపునకు తిరిగి పడుకోవడం ఇలాంటి వారికి శ్రేయస్కరం. ఇలా పడుకోవడం ద్వారా వెన్నునొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. రెండు కాళ్ల మధ్యలో మెత్తను పెట్టుకోవడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.

  నక్షత్ర చేపలా

  నక్షత్ర చేపలా

  వెన్ను, మెడ నొప్పితో బాధపడేవారు ఈ భంగిమలో పడుకోవాలి. వెల్లకిలా పడుకొని రెండు కాళ్లు, చేతులు దూరంగా విడిదీసి పెట్టాలి. ఇలా చేయడం వల్ల కడుపులో గ్యాస్ట్రిక్ యాసిడ్‌ను నియంత్రించవచ్చు. అంతే కాదు కడుపులోని ఆహారపదార్థాలు అన్నవాహికలో వెళ్లకుండా ఆపొచ్చు. ఇలా పడుకోవడం వల్ల వెన్ను, మెడ నొప్పికి ఉపశమనం లభిస్తుంది.

  స్టార్‌ ఫిష్‌ పొజిషన్‌

  స్టార్‌ ఫిష్‌ పొజిషన్‌

  ఈ భంగిమలో నిద్రించడం వల్ల నిద్రలేమి, తలనొప్పి, గ్యాస్‌, అసిడిటీ, ముఖంపై ముడతలు వంటి సమస్యలు ఉండవు. రావు. కాకపోతే ఈ భంగిమ కూడా గురకను కలిగిస్తుంది. భుజాలు, వెన్నునొప్పి వస్తుంది. కనుక ఈ భంగిమలోనూ తల కింద దిండు లేకుండా నిద్రిస్తే చాలా మంచిది.

  లాగ్‌ పొజిషన్‌

  లాగ్‌ పొజిషన్‌

  ఈ భంగిమలో నిద్రించడం వల్ల వెన్ను నొప్పి, మెడ నొప్పి రావు. గురక సమస్య ఉండదు. గర్భిణీలకు ఇలా నిద్రించడం మంచిది. కానీ ఇలా నిద్రిస్తే తొడల నొప్పి, చర్మంపై ముడతలు రావడం, వక్షోజాలు సాగి పోవడం వంటి సమస్యలు వస్తాయి. ఇవి రాకుండా ఉండాలంటే మెడ కింద పెద్ద తలదిండు పెట్టుకోవాలి. అలాగే నిద్రించేటప్పుడు తొడల మధ్య మరో దిండును పెట్టుకుని నిద్రించాల్సి ఉంటుంది.

  ఈర్నర్‌ పొజిషన్‌

  ఈర్నర్‌ పొజిషన్‌

  ఈ భంగిమలో నిద్రించడం వల్ల మెడ, వెన్ను నొప్పి, గ్యాస్‌, అసిడిటీ, గురక, కడుపులో మంట వంటి సమస్యలు ఉండవు. కానీ ఈ భంగిమ వల్ల భుజాలు, చేతుల నొప్పి, లివర్‌, జీర్ణాశయంపై ఒత్తిడి వంటి సమస్యలు వస్తాయి. వక్షోజాలు సాగిపోవడం, ముఖంపై త్వరగా ముడతలు రావడం జరుగుతుంది. వీటిని నివారించాలంటే ఇలా నిద్రించే వారు తల కింద సాటిన్‌ పిలో కేస్‌ పెట్టుకుని, తొడల మధ్య దిండు ఉంచుకుని నిద్రించాలి.

  ఫీటల్‌ పొజిషన్‌

  ఫీటల్‌ పొజిషన్‌

  ఈ భంగిమలో నిద్రించడం వల్ల గురక తగ్గుతుంది. గర్భిణీలకు మంచి చేస్తుంది. గ్యాస్‌, అసిడిటీ సమస్యలు ఉండవు. కానీ ఈ భంగిమ వల్ల మెడ, వెన్నెముకపై ఒత్తిడి పడుతుందది. అలాగే చర్మంపై త్వరగా ముడతలు వస్తాయి. వక్షోజాలు సాగిపోతాయి. ఇలా జరగకుండా ఉండాలంటే ఈ భంగిమలో నిద్రించేటప్పుడు తల కింద కచ్చితంగా దిండు ఉండాలి. రాత్రి పూట అటు, ఇటు పక్కలకు తిరుగుతూ మారుతూ నిద్రించాలి.

  భుజం నొప్పికి

  భుజం నొప్పికి

  నొప్పి ఉన్న భుజం వైపు తిరిగి పడుకోకూడదు. వెళ్లకిలా పడుకోవడమే అన్ని విధాలా ఉత్తమం. నొప్పి లేని మరో భుజం వైపు తిరిగి కూడా పడుకోవచ్చు. కాకపోతే అలా పడుకున్నప్పుడు ఛాతీ కింద ఒక దిండు పెట్టుకోవాలి. ఒక వ్యక్తి మీద చేయి వేసినట్లు భుజాన్ని కాస్త దూరంగా చాపి పడుకోవాలి.

  వెన్నునొప్పికి

  వెన్నునొప్పికి

  వెళ్లకిలా పడుకుని, వెన్నుకింద సహజమైన ఒంపు నిలిచేలా ఒక దిండు ఉంచుకోవాలి. మోకాలి మడతల కింద కూడా ఒక దిండు కానీ, లేదా మడచిన టవల్‌ను గానీ ఉంచుకోవాలి. అన్నంటినీ మించి వెన్నునొప్పి సమస్య ఉన్నవాళ్లు వెళ్లకిలా పడుకోవడమే ఉత్తమమని నిపుణులు చెబుతారు. ఏదో ఒక వైపు తిరిగి పడుకున్నప్పుడు అదనపు సపోర్టు కోసం మోకాల మధ్య ఒక దిండు ఉంచుకోవాలి. తుంటి సమస్యలు, మోకాళ్ల సమస్యలు ఉన్నవారికి కూడా ఈ విధానం ఉపశమనకరంగా ఉంటుంది.

  ఒత్తిడి

  ఒత్తిడి

  వెన్నునొప్పి ఉన్నవారు పొట్ట మీద పడుకోవడం వల్ల వెన్ను, మెడ భాగాలు ఒత్తిడి గురవుతాయి. అందువల్ల ఈ భంగిమ వీరికి ఉపయుక్తం కాదు. ఒకవేళ తప్పనిసరి అయితే, పొత్తి కడుపు, తుంటి భాగానికీ మధ్య ఒక దిండు ఉంచుకోవాలి. దీని వల్ల వెన్ను, మెడ భాగాల మీద ఒత్తిడి పడకుండా ఉంటుంది.

  మెడ నొప్పికి

  మెడ నొప్పికి

  ఈ నొప్పి ఉన్నవారు, అటూ ఇటూ పోకుండా మెడను ఒక తటస్థ భంగిమలో ఉంచడం చాలా అవసరం. పొట్టను నేలకు ఆనించి ఎప్పుడూ పడుకోకూడదు. అయితే మెడ కింది ఎక్కువ దిండ్లు పెట్టుకోవడం వల్ల మెడ వంగిపోయే స్థితి ఏర్పడుతుంది. అలా కాకుండా భుజాల కన్నా కొంచెం ఎత్తుకు వచ్చేలా దిండు ఉపయోగించాలి. నిపుణులైతే మడచిన టవల్‌ను మెడకింద పెట్టుకోవడం ఉత్తమం అని చెబుతున్నారు.

  గురక సమస్యకు

  గురక సమస్యకు

  గురక లేదా ‘ఆబ్‌స్ట్రక్టివ్‌ స్లీప్‌ అప్నియా' సమస్యను తగ్గించడానికి ఏదో ఒకవైపు తిరిగి పడుకోవడం గానీ, లేదా పొట్ట మీద పడుకోవాలి. ఇది నాలుక వెనక్కి జరిగి గొంతులో అడ్డుపడి శ్వాసలో అంతరాయం రాకుండా నిరోధిస్తుంది. అలాగే నోట్లోని ఏదైనా కండర కణజాలం అలా అడ్డుపడకుండా కూడా తోడ్పడుతుంది. దీనికి తోడు అరచేతికీ తలకూ కింద ఒక టెన్నిస్‌ బాల్‌ ఉంచుకోవడం వల్ల కొంత ఉపశమనంగా ఉంటుంది.

  ఆసిడ్‌ రిఫ్లెక్స్‌

  ఆసిడ్‌ రిఫ్లెక్స్‌

  కడుపులోని ఆమ్లాలు నోట్లోకి వచ్చే ఆసిడ్‌ రిఫ్లెక్స్‌ (పులి తేన్పులు) సమస్యను నివారించడానికి తల పైకి ఉండేలా దిండులు అమర్చుకోవడం అవసరం. లేదా మంచం తలవైపు భాగం ఎత్తుగా ఉండేలా మంచం కింద ఇటుకలు పెట్టాలి. అదీ కాకపోతే ఏదో ఒక వైపు తిరిగి పడుకోవడం మేలు.

  ప్లాంటార్‌ ఫెసైటిస్‌

  ప్లాంటార్‌ ఫెసైటిస్‌

  కాళ్లల్లో వాపు ఏర్పడే ఫాంటార్‌ ఫెసైటిస్‌ సమస్యకు పాదాలను, మడమలను ఏ మాత్రం ఒత్తిడి పడకుండా విశ్రాంత స్థితిలో ఉంచడం చాలా ముఖ్యం. పాదాలు బిగపట్టినట్టు ఉండే పరిస్థితి లేకుండా చూసుకోవడం కూడా అంతే అవసరం.

  English summary

  which sleep position is healthiest

  which sleep position is healthiest
  Story first published: Friday, May 4, 2018, 15:00 [IST]
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more