For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్లాస్టిక్ వాడకం ఆరోగ్యానికే హానికరం

ప్లాస్టిక్ వాడకం ఆరోగ్యానికే హానికరం

|

ప్లాస్టిక్ వాడకం మనందరి జీవితాలతో గాఢంగా పెనవేసుకుపాయింది. ఎటు చూసినా ప్లాస్టిక్. స్టోరేజ్ కంటైనర్లు నుంచి వాటర్ బాటిల్స్ వరకు అన్నీ ప్లాస్టిక్. ప్లాస్టిక్ తో తయారైనవే ప్రిఫర్ చేసి మరీ వాడే వాళ్ళు కూడా ఉన్నారు. ఎలెక్ట్రానిక్ గాడ్జెట్స్ అయిన కంప్యూటర్స్, ల్యాప్ టాప్, మొబైల్ ఫోన్ వంటి టెక్నలాజికల్ అడ్వాన్స్మెంట్స్ కి ప్లాస్టిక్ ఎంతగానో దోహదం చేసిందన్న అంశాన్ని విస్మరించకూడదు. అయితే, ప్లాస్టిక్ ని ఫుడ్ కి సంబంధించిన విషయంలో వాడటం మాత్రం మంచిది కాదు. ఈ ఆర్టికల్ లో ప్లాస్టిక్ ఫుడ్ కంటైనర్లని ఎందుకు అవాయిడ్ చేయాలో వివరించాము.

ప్లాస్టిక్ ఎలా తయారవుతుంది?

బొగ్గు, నేచురల్ గ్యాస్, సెల్యులోస్, సాల్ట్ మరియు క్రూడ్ ఆయిల్ నుంచి ప్లాస్టిక్ తయారవుతుంది. కాటలిస్ట్స్ సమక్షంలో ఇవి పోలీమెరైజేషన్ అనే ప్రక్రియకు గురవుతాయి. తద్వారా, పొలిమెర్స్ అనే పదార్థం తయారవుతుంది. దాన్ని మరింతగా ప్రాసెస్ చేయడం ద్వారా ప్లాస్టిక్ తయారవుతుంది.

why-you-should-avoid-using-plastic-containers

ఫుడ్ మరియు బెవెరేజేస్ లో వాడే ప్లాస్టిక్

ఫుడ్ స్టోరేజ్ కై వాడే ప్లాస్టిక్ లో రకాలు:


1. పోలీయెథీలీన్ ట్రెఫ్తాలట్ ని వాడి ప్లాస్టిక్ బాటిల్స్ , సలాడ్ డ్రెస్సింగ్ బాటిల్స్ మరియు ప్లాస్టిక్ జార్స్ ను తయారుచేస్తారు.

2. హై డెన్సిటీ పోలీయెథీలీన్ ని ఉపయోగించి మిల్క్ జగ్స్, లో డెన్సిటీ పోలీయెథీలీన్ ను వాడి ప్లాస్టిక్ బాగ్స్ మరియు ప్లాస్టిక్ వ్రాప్స్ ను తయారుచేస్తారు.


3. పోలీప్రొఫైలిన్ ను వాడి యోగర్ట్ కంటైనర్లు, బాటిల్ క్యాప్స్ మరియు స్ట్రాస్ ను తయారుచేస్తారు.


4. పోలీస్టైరేన్ ను వాడి ఫుడ్ కంటైనర్లు, డిస్పోజబుల్ ప్లేట్స్, ఫుడ్ ప్యాకేజింగ్ మరియు వెండింగ్ కప్స్ ను తయారుచేస్తారు.


5. పోలీస్తైరెన్ ను వాడి వాటర్ మరియు బేబీ బాటిల్స్, ఫుడ్ స్టోరేజ్ కంటైనర్లు, బెవెరేజ్ కంటైనర్లు మరియు చిన్నపాటి అప్లయన్సెస్ ను తయారుచేస్తారు.


ప్లాస్టిక్ హానికరంగా ఎందుకు మారుతుంది?

నిజానికి, కెమికల్స్ కే ఈ క్రెడిట్ మొత్తం దక్కుతుంది. అయిదు నుంచి ముప్పై రకాల కెమికల్స్ ను ఒక ప్లాస్టిక్ పార్ట్ తయారీలో వాడతారు. బేబీ బాటిల్స్ లో ఎన్నో ప్లాస్టిక్ పార్ట్శ్ ఉంటాయి. అంటే దాదాపు వందకు పైగా కెమికల్స్ ఆ ప్లాస్టిక్ తయారీలో ఉంటాయి.


ప్లాస్టిక్ ఫుడ్ స్టోరేజ్ కంటైనర్లు ను ఎందుకు అవాయిడ్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.


1. ప్లాస్టిక్ లో వాడే కెమికల్స్ వెయిట్ గెయిన్ కి దారితీస్తాయి:


ప్లాస్టిక్ లో బిస్ఫెనాల్ ఏ (BPA) అనే పదార్థం కలదు. ఇది శరీరంలో ఈస్ట్రోజెన్ లా పనిచేస్తుంది. ఈస్ట్రోజెన్ గ్రహకాలను పట్టుకుని ఉంటుంది. ఈ పదార్థం శరీర బరువు నియంత్రణకు అవరోధంగా ఏర్పడుతుంది. బరువును పెంచుతుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ను పెంచుతుంది. అనేక అధ్యయనాల ప్రకారం బీపీఏ బారిన పడటం వలన ఒబెసిటీతో పాటు వెయిట్ గెయిన్ సమస్య ఎదురవుతుంది. అటువంటి ఒక అధ్యయనం జర్నల్ ఆఫ్ లిపిడ్ రీసెర్చ్ లో పబ్లిష్ అయింది. ఈ స్టడీ అనేది బీపీఏకి ఎక్స్పోస్ అవడం వలన శరీరంలో ఫ్యాట్ సెల్స్ సంఖ్య పెరుగుతుందని స్పష్టం చేస్తోంది.


2. హానికర పదార్థాలు ఆహారంలోకి ప్రవేశిస్తాయి:


ఆహారాన్ని ప్లాస్టిక్ కంటైనర్ లో మైక్రోవేవ్ చేయడం వలన అనేక రోగాల బారిన పడే ప్రమాదం ఉందన్న సంగతి మీకు తెలుసా? వేడి చేసిన తరువాత ప్లాస్టిక్ అనేది వివిధ కెమికల్స్ ను విడుదల చేస్తుంది. శరీరంలోని ఈస్ట్రోజెన్ హార్మోన్స్ తో ప్లాస్టిక్ అనేది కాంటాక్ట్ లోకి వస్తే గుండె వ్యాధులు, డయాబెటీస్, న్యూరాలజికల్ డిజార్డర్స్, క్యాన్సర్, థైరాయిడ్ డిస్ఫంక్షన్, జెనిటల్ మాల్ ఫార్మేషన్స్ తో పాటు మరెన్నో ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది.


3. ఫెర్టిలిటీ మరియు రీప్రొడక్టివ్ సమస్యలు ఎదురవుతాయి:


ఫ్తాలేట్ అనే మరొక్క హానికర కెమికల్ . ప్లాస్టిక్ ను సాఫ్ట్ గా అలాగే ఫ్లెక్సిబుల్ గా చేసేందుకు ఈ కెమికల్ ను వినియోగిస్తారు. ఇది ఎక్కువగా ఫుడ్ కంటైనర్లు, బ్యూటీ ప్రోడక్ట్స్, టాయ్స్, పెయింట్స్ మరియు షవర్ కర్టెయిన్స్ తయారీలో ఉంటుంది. ఈ టాక్సిక్ కెమికల్ అనేది రోగనిరోధక శక్తిపై దుష్ప్రభావం చూపిస్తుంది. అలాగే హార్మోన్స్ పై కూడా దుష్ప్రభావం చూపిస్తుంది. తద్వారా, ఫెర్టిలిటీ దెబ్బతింటుంది.


అంతేకాక, బీపీఏ అనేది మిస్ క్యారేజ్ కి దారి తీస్తుంది. గర్భం దాల్చే ప్రక్రియను కష్టతరం చేస్తుంది. అధ్యయనాల ప్రకారం ప్లాస్టిక్ లో లభించే టాక్సిన్స్ వలన పుట్టుకతో లోపాలు అలాగే పిల్లల ఎదుగుదలలో సమస్యలు తలెత్తుతాయి.


ప్లాస్టిక్ ఎక్స్పోజర్ కి గురయ్యే రిస్క్ ను తగ్గించుకోవడమెలా?


ఈ కొద్దిపాటి ఛేంజెస్ పై దృష్టి పెడితే ప్లాస్టిక్ వాడకాన్ని కొంతవరకు నిరోధించవచ్చు.


షాపింగ్ కి వెళ్ళేటప్పుడు ఇంటి వద్ద నుంచి జూట్ లేదా కాటన్ బ్యాగ్ ను మీతో తీసుకెళ్లండి.


ఎండలో ప్లాస్టిక్ కంటైనర్లను ఉంచకండి. చల్లని ప్రదేశాల్లోనే ప్లాస్టిక్ కంటైనర్లు ను ఉంచండి.


ప్లాస్టిక్ ఫుడ్ మరియు బెవెరేజ్ కంటైనర్ల ఉపయోగాన్ని తగ్గించుకోండి. ప్లాస్టిక్ బదులు ఎకో ఫ్రెండ్లీ ఆల్టర్నేటివ్స్ ను పరిగణలోకి తీసుకోండి.


ప్లాస్టిక్ బాటిల్స్ బదులు గ్లాస్ బాటిల్స్ ను వినియోగించండి.

English summary

why-you-should-avoid-using-plastic-containers

Plastic is made from natural products like coal, natural gas, cellulose, salt and crude oil which undergo a process called polymerization in the presence of catalysts. Plastic poses several health hazards. Avoiding using plastic food storage containers as it causes weight gain, fertility and reproductive problems, and harmful chemicals enters the food.
Story first published:Thursday, August 23, 2018, 18:00 [IST]
Desktop Bottom Promotion