For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎక్కువ గంటలు అదే పనిగా కుర్చీలకు అతుక్కుపోయే ఉద్యోగాలు చేస్తున్నారా? అయితే మీ గుండె ప్రమాదంలో ఉందని గుర్తుంచుకోండి.

ఎక్కువ గంటలు అదే పనిగా కుర్చీలకు అతుక్కుపోయే ఉద్యోగాలు చేస్తున్నారా? అయితే మీ గుండె ప్రమాదంలో ఉందని గుర్తుంచుకోండి.

|

దైనందిక జీవితంలో మీరు చేసే తప్పిదాలలో అత్యంత ప్రమాదకరమైన తప్పు, అదే పనిగా కుర్చీలకు అతుక్కుని పోయి పనులు చేయడం. ఇది కేవలం ఆఫీసుకే పరిమితం కాలేదు. గాడ్జెట్లకు అలవాటు పడిన యువత నుండి, కుర్చీలకు అంకితమైపోయి పని చేసే ఉద్యోగుల దాకా అనేకమంది ఈ అంశంలో భాగస్వాములే. కానీ ఈ అలవాటు మీ గుండెసమస్యలను పెంచగలదని ఎప్పుడైనా భావించారా?. నిజం, ఇటువంటి చర్యలు గుండె పనితీరుని దెబ్బతీయగలవని వైద్యులు ధృవీకరిస్తున్నారు. కావున సమస్యలు ఉత్పన్నం కాకముందే జాగ్రత్త పడడం ఉత్తమం.

ఓవర్ టైం డ్యూటీలు, కంప్యూటర్ మరియు మొబైల్ స్క్రీన్లకు కళ్ళు అప్పగించి అదే పనిగా గంటల తరబడి ఉండిపోవడం ముఖ్యంగా ఈ సమస్యకు కేంద్రబిందువులు కాగా, ఒక్కోసారి ఇవి ప్రాణాలను కూడా హరించవచ్చు.

Working Long Hours Is Silently Putting Your Heart In Danger


యూరోపియన్ హార్ట్ జర్నల్ ఇటీవలే ప్రచురించిన అధ్యయనంలోని నివేదిక ప్రకారం, దీర్ఘకాలిక పని గంటలు మీ ధమనులపై తీవ్ర ప్రభావాన్ని చూపగలదని తేల్చింది.

వారు ఇటీవల దాదాపు 85,000 మందిపై చేసిన సర్వేలో, ప్రతి వారం ఎన్ని గంటలు పని చేస్తున్నారో అన్న అంశాన్ని పరిగణనలోనికి తీసుకోవడం జరిగింది. అయితే, వారంలో 55 గంటలు లేదా అంతకన్నా ఎక్కువగా పనిచేసేవారు 42 శాతం ఉండగా, వీరు ధమనుల సంబంధిత సమస్య “ఆట్రియాల్ ఫైబ్రిలేషన్” తో భాదపడుతున్నట్లు గుర్తించారు. మరియు ఈ సమస్య 35 - 40 గంటల మద్య పనిచేసేవారిలో తక్కువగా కనిపించింది.

మరింత భయానకమైన విషయం ఏమనగా! ప్రతి పదిమందిలో 9 మందికి ముందు రోజులలో ఎటువంటి గుండె సంబంధిత ఆరోగ్య సమస్యలు లేవని, పని కారణంగానే సమస్యలు తలెత్తినట్లు తేలింది. కావున దీర్ఘకాలిక పని గంటలు, ఒత్తిడి కారణంగానే ఇటువంటి సమస్యలు తలెత్తినట్లు నిర్ధారణ జరిగింది.

అసలు ఏమిటీ “ఆట్రియల్ ఫైబ్రిలేషన్” :

అసలు ఏమిటీ “ఆట్రియల్ ఫైబ్రిలేషన్” :

గుండె వేగం విపరీతంగా పెరగడం, లేదా నొప్పి వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారా? మీరు విశ్రాంతిగా ఉన్నప్పుడు కూడా ఈ లక్షణాలు కొనసాగుతున్నాయా? అసాధారణమైన ఈ గుండె దడ సమస్యను "ఆట్రియల్ ఫైబ్రిలేషన్" అని వ్యవహరిస్తారు.

అస్తవ్యస్త హృదయ స్పందనలు లేదా "ఆట్రియల్ ఫైబ్రిలేషన్", గుండెలోని కర్ణిక, జఠరికల మద్య అనుసందానాన్ని తగ్గిస్తుంది. సాధారణంగా, 60 నుండి 100 మద్యలో గుండె స్పందనలు ఉన్న ఎడల, గుండెకు ఎటువంటి నష్టమూ వాటిల్లదు. కానీ దీనికి విరుద్ధంగా, 100 పైన, నిమిషానికి 400 స్పందనల వరకు నమోదు అవుతుంటే, పరిస్థితి చేదాటిపోతుందని అర్ధం.

ఈ క్రమరహితమైన స్పందనలు రక్తపోటుకు దారితీస్తుంది, ఇది క్రమంగా గుండె బలహీనతకి దారితీస్తుంది. సరైన సమయంలో గుర్తించని ఎడల, గుండె వైఫల్యానికి దారితీయడమే కాకుండా, ప్రాణాలకు సైతం హాని కలిగించవచ్చు.

లక్షణాల గురించి పూర్తిగా తెలుసుకోండి:

లక్షణాల గురించి పూర్తిగా తెలుసుకోండి:

పరిశోధకుల నమ్మకం ప్రకారం దీర్ఘకాలిక పని గంటలు, లేదా ఒత్తిడి మీ స్వతంత్ర నాడీవ్యవస్థ పనితీరుని ఆటంకపరుస్తాయి, క్రమంగా ధమనుల పనితీరు దెబ్బతింటుంది. డిప్రెషన్, రక్తపోటు, గుండె స్పందనల రేటు వంటివే కాకుండా క్రమంగా జీవక్రియలు దెబ్బతినడం, హార్మోనుల అసమతుల్యత కూడా జరుగుతుంటుంది.

కావున లక్షణాల గురించిన అవగాహన ఉండడం ద్వారా, పరిస్థితి చేయిదాటకుండా జాగ్రత్త తీసుకోవచ్చు.

ముఖ్యమైన లక్షణాలు:

ముఖ్యమైన లక్షణాలు:

1. హృదయ స్పందనల వేగం పెరగడం లేదా, గుండెదడ అనుభూతికి లోనవడం.

2. ఛాతీ నొప్పి, ఒత్తిడి లేదా అసౌకర్యం

3. శ్వాస కొరత

4. తలనొప్పి

5. అలసట లేదా శక్తి లేకపోవడం

6. వ్యాయామం వైపు అసహనం

ఆట్రియల్ ఫైబ్రిలేషన్ లేదా గుండె దడ సాధారణంగా అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది, ముఖ్యంగా పనిభారం పెరిగినప్పుడు, ఒత్తిడి వంటి సమస్యల కారణంగా. కొన్ని సందర్భాలలో నిమిషాల నుండి గంటల వ్యవధిలో భాదిస్తుంటుంది కూడా. ఒక్కోసారి మైల్డ్ హార్ట్ స్ట్రోక్స్ సమస్యలకు దారితీస్తుంది.

పెద్ద వారిలో “ఆట్రియల్ ఫైబ్రిలేషన్”:

పెద్ద వారిలో “ఆట్రియల్ ఫైబ్రిలేషన్”:

ఈ గుండెదడ సమస్యలు పెద్దవారిలో అధికంగా ఉన్నాయని అనేక నివేదికలలో తేలింది కూడా. సుమారుగా 11 శాతం మంది లేదా 80 పైన వయసు కలిగిన వారిలో గుండెదడకు ప్రభావితమయిన వారి సంఖ్య ఎక్కువగా ఉంది.

అధిక సందర్భాలలో, గుండె దడ లక్షణాలు కనిపించని కారణంగా, మొదటి గుండె పోటు వచ్చే వరకూ సమస్య బహిర్గతం కాదని తేలింది. కావున తరచూ నెలలో లేదా మూడు నెలలకు ఒక సారైనా వైద్య పరీక్షలకు పూనుకోవడం ఉత్తమం అని వైద్యులు సూచిస్తున్నారు.

గుండెదడ కలిగిన వారు రక్తపోటు, మధుమేహం, మూత్రపిండాల సమస్యలు, హార్ట్ ఫైల్యూర్ సమస్యలను, లేదా ఇతర హార్మోను సంబంధిత సమస్యలను కలిగి ఉన్న ఎడల సమస్య తీవ్రతరం అయ్యే అవకాశాలు అధికంగా ఉంటాయి.

 యువతలో కూడా ఆట్రియల్ ఫైబ్రిల్లెషన్:

యువతలో కూడా ఆట్రియల్ ఫైబ్రిల్లెషన్:

యువతలో కూడా గుండెదడ లక్షణాలు అధికంగా కనిపించడం కాస్త భాదాకరమైన విషయం. పనిభారం, ఒత్తిడి వంటి అంశాలే కాకుండా, ప్రేమ వైఫల్యాలు, చదువు సంబంధిత ఒత్తిడులు, డిప్రెషన్, మద్యపానం, ధూమపానం ఇతరత్రా వ్యసనాలు, సరైన వ్యాయామ ప్రణాళికలు లేకపోవుట, అసంబద్ద ఆహారపు అలవాట్లు, కుటుంబ సమస్యలు, "గాడ్జెట్ ఫ్రీక్స్"గా మారడం, ఆటలు, చాటింగ్ తదితర అంశాలకు గంటల సమయం కేటాయించడం, నిద్రలేమి, కాలుష్య కోరల జీవన విధానాలు, రేసింగ్, ధ్వనికి అధికంగా గురవడం మొదలైన అనేక సమస్యల కారణంగా జీవక్రియలు మందగించడం, క్రమంగా హార్మోనుల అసమతుల్యం, ఆరోగ్య సమస్యల కారణంగా గుండెదడ అనేది యుక్త వయసు పిల్లలలో కూడా పెరుగుతూ ఉందని అనేక నివేదికలు తేల్చాయి. ఏ సమస్యా లేకపోయినా, ఒక చిన్న వ్యసనానికి అలవాటుపడి జీవితాన్ని నాశనం చేసుకుంటున్న అనేకమంది మన చుట్టూతా కోకొల్లలు. క్రమంగా వయసుతో సంబంధం లేకుండా వ్యాధులు తమ తమ ప్రభావాలను చూపిస్తూ, భవిష్యత్తును సైతం అంధకారం చేస్తున్నాయి.

ఏదిఏమైనా సరైన జీవనశైలి, వ్యాయామం, ఆహార-ఆరోగ్య ప్రణాళిక, పనియందు ప్రణాళికలు, పరిసరాల మార్పులు, ప్రియమైన వారితో సాన్నిహిత్యం వంటివి కొంతమేర సమస్యలను దూరం చేయగలదని వైద్యులు సూచిస్తున్నారు.

ఈవ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర అంశాలు, జీవనశైలి, ఆరోగ్య, ఆహార, ఆధ్యాత్మిక తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కీ పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

Working Long Hours Is Silently Putting Your Heart In Danger

You're spending way too much time at office. And thus, without realising, you are just working yourself to death. That's what European Heart Journal has to say. And the study also suggests that this problem even stands a chance to pop up even if you've never had any heart issues before.Effects Of Working Long Hours On Health
Story first published:Tuesday, July 24, 2018, 10:47 [IST]
Desktop Bottom Promotion