Latest Updates
-
సీతా నవమి రోజున ఈ తప్పులు చేస్తున్నారా? పూజ ఫలితం దక్కాలంటే ఈ నియమాలు తప్పనిసరి! -
సింహ రాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, అదృష్టం మీ వెంటే! -
సింహం, ధనుస్సు, మేష రాశుల వారికి అదృష్ట యోగం.. శని దేవుని ఆశీస్సులు ఎవరికి? - శనివారం, 25 ఏప్రిల్ 2026 -
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు!
సెక్స్ కు సంబంధించి ప్రమాదకరమైన సూచనలు వీటిని నిర్లక్ష్యం చేయకండి
దాదాపు 22 శాతం మహిళలు సెక్స్ లో పాల్గొనేటప్పుడు నొప్పికి గురువుతుంటారు. బాగా బాధపడుతుంటారని ప్రపంచ ఆరోగ్యం సంస్థనే తెలిపింది. సరైన భంగిమల్లో సెక్స్ లో పాల్గొనకపోవడమే ఇందుకు కారణం. సెక్స్ కంటిన్యూ చ
సెక్స్ లో పాల్గొనేటప్పుడు అప్పుడప్పుడు ఆడవారికి జననేంద్రియాల్లో నొప్పి పుడుతుంది. యోనిలో బాగా నొప్పి వస్తూ ఉంటుంది. అలాగే కొందరికి రక్తం వస్తూ ఉంటుంది. ఇంకొందరికి సెక్స్ లో పాల్గొనడం వల్ల ర్యాషెస్ వస్తుంటాయి. ఇలాంటి సమస్యను చాలా మంది మహిళలు ఎదుర్కొంటూ ఉంటారు. ఇవన్నీ కూడా ఆమె ఆరోగ్యం సరిగ్గా లేదనడానికి సంకేతాలు.
కొందరు ఆడవారికి యోని ప్రాంతంలో ఇన్ ఫెక్షన్ కూడా వస్తూ ఉంటుంది. అయితే ఇలాంటి సెక్స్ సంబంధిత సమస్యల్ని ఎప్పుడూ కూడా ఆడవారు నిర్లక్ష్యం చేయకూడదు.హ్యూస్టన్లోని టెక్సాస్ విశ్వవిద్యాలయంలో గైనకాలజీ ప్రొఫెసర్ అయిన మిచెల్ కర్టిస్ తో మరికొందరు ప్రొఫెసర్స్, డాక్టర్స్ ఇందుకు సంబంధించిన కొన్ని వివరాలు చెప్పారు.

1. యోనిలో నుంచి డిశ్చార్జి
సాధారణంగా నెలసరి అప్పుడు యోని నుంచి రక్తస్రావం అవుతూ ఉంటుంది. అయితే కొందరు మహిళలకు పీరియడ్స్ అప్పుడు మాత్రమే కాకుండా మధ్యమధ్యలో కూడా కొన్ని రకాల స్రవాలు యోనిలో ఊరుతుంటాయి. దీనివల్ల మీరు ఇబ్బందులుపడాల్సి వస్తుందని అమెరికా కాంగ్రెస్ గైనాకాలజిస్ట్ సాండ్రా రీడ్ తెలిపారు.

వైట్ డిశ్చార్జి
కొందరు ఆడవారికి యోని నుంచి అప్పుడప్పుడు వైట్ డిశ్చార్జి అవుతూ ఉంటుంది. కాటేజ్ చీజ్ లాంటి తెల్లటి ద్రవం యోని నుంచి వస్తే మాత్రం మీ ఆరోగ్యం సcరిగ్గా లేదని అర్థం. ఈస్ట్ ఇన్ఫెక్షన్ సోకిందని సంకేతం.

కాండిడా అనే ఫంగస్
యోనిలో కాండిడా అనే ఫంగస్ వల్ల ఇలాంటి సమస్య ఏర్పడుతుంది. ఒత్తిడి, అనారోగ్యం వల్ల కొందరిలో ఈ ఫంగస్ ఏర్పడొచ్చు. యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్స్ వంటి మందులను తీసుకోవడం వల్ల అలాగే కొన్నిసార్లు మధుమేహం వల్ల కూడా ఇలా యోని నుంచి డిశ్చార్జి అవుతూ ఉంటుంది.

2. బాగా దురదగా ఉండడం
కొందరికి జననేంద్రియాల దగ్గర బాగా దురదగా ఉంటుంది. ఆ ప్రాంతం మొత్తం ఎర్రగా మారుతుంది. ఇలాంటి సెక్స్ వల్ ప్రాబ్లమ్ ను కూడా నిర్లక్ష్యం చేయకండి. కొందరు ఆడవారు సెక్స్ లో పాల్గొన్న తర్వాత యోని దగ్గర ర్యాషెస్ వస్తుంటాయి.

కండోమ్స్ ఆయిల్స్
సెక్స్ పాల్గొనడానికి ఉపయోగించే కండోమ్స్, ఆయిల్స్, స్పెర్మిసైడ్ క్రీమ్స్ వల్ల ఇలాంటి అలెర్జీలు వస్తాయని డాక్టర్ కర్టిస్ చెప్పారు. అలాగే సెక్స్ చేస్తున్నప్పుడు భాగస్వామి చెమట లేదంటే వీర్యం యోని దగ్గర అంటుకోవడం వల్ల కూడా ర్యాషెస్ ఏర్పడొచ్చు.

ఎర్రటి గుల్లలు
చిన్నచిన్న తెల్ల,ఎర్రటి గుల్లలు యోని దగ్గర వస్తుంటాయి. దాదాపు 16 శాతం మంది ఆడవారు ఇలాంటి సమస్య బారినపడుతుంటారు. అయితే 80 శాతం మంది ఆడవారు ఈ సమస్యను అస్సలు గుర్తించలేరు. ర్యాషెస్ చాలా చిన్నగా ఉండడం వల్ల ఏమీ కావులే అనుకుంటూ ఉంటారని డాక్టర్ మేన చెప్పారు.

హెర్పెస్
ఇలా జననేంద్రియాల వద్ద ర్యాషెస్ రావడాన్ని హెర్పెస్ అంటారు. ఇలాంటి లక్షణాలు ఒకవేళ మగ లేదంటే ఆడవారిలో కనిపిస్తే కొన్నాళ్లు సంభోగానికి దూరంగా ఉండడం మంచిది. అలాగే వెంటనే డాక్టర్ని సంప్రదించి ట్రీట్ మెంట్ తీసుకోవాలి.
హెర్పెస్ వల్ల జననేంద్రియాల్లో చర్మం మొత్తం రంగు మారిపోతుంది. అందువల్ల ఈ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండడం మంచిది.

3. బర్నింగ్ సెన్సేషన్
కొందరికి మూత్రా నాళాల్లో బాగా నొప్పిగా ఉంటుంది. సెక్స్ లో పాల్గొన్న తర్వాత ఈ నొప్పి కాస్త ఎక్కువవుతూ ఉంటుంది. ఇలాంటి వారు ఆ సమస్యను నిర్లక్ష్యం చేస్తూ అలాగే సెక్స్ లో పాల్గొంటూ ఉంటే మాత్రం మరింత ఇబ్బందులుపడాల్సి వస్తుందని డాక్టర్ కర్టిస్ చెప్పాడు.
సమస్యను నిర్లక్ష్యం చేసి సెక్స్ కంటిన్యూ చేస్తే దాని వల్ల సిస్టిటిస్ అనే వ్యాధి బారినపడతారు.

4. కండరాల నొప్పి
సెక్స్ పాల్గొనాలనుకునే సమయంలో మీ జననేంద్రియాలను తాకితే నొప్పి వస్తుందా? యోనిలో కండరాలు నొప్పికి గురికావడమే ఇందుకు కారణమని
డాక్టర్ రీడ్ తెలిపారు. సెక్స్ లో పాల్గొంటే కూడా ఇలాంటి కండరాల నొప్పి వస్తూ ఉంటుంది.

కాస్త ర్యాష్ గా
గతంలో జనేనింద్రియాల వద్ద గాయాలు కావడం లేదంటే సెక్స్ లో పాల్గొనేటప్పుడు కాస్త ర్యాష్ గా మీ భాగస్వామి ప్రవర్తించినా దాని తాలుకా నొప్పి అలాగే ఉండిపోతుంది. ఇలాంటి సమస్య ఉన్న ఆడవారు వెంటనే డాక్టర్ని సంప్రదిస్తే మంచిది. వజినల్ డిలాటోర్స్ లేదంటే ఫిజికల్ థెరపీ వల్ల ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవవచ్చు.

5. దుర్వాసన
కొందరు అమ్మాయిలకు యోని దగ్గర దుర్వాసన వెదజల్లుతూ ఉంటుంది. ఇది బ్యాక్టీరియల్ వాగ్జోనిసిస్ (బీవీ) అనే దానికి సంకేతం. "ధూమపానం, తరచూ సెక్స్ లో పాల్గొని శుభ్రం చేసుకోకపోవడం వల్ల బీవీ వచ్చే అవకాశం ఉంది. " అని డాక్టర్ కర్టిస్ అన్నాడు.
సాధారణంగా సెక్స్ లో పాల్గొన్న తర్వాతగానీ లేదంటే పీరియడ్స్ వచ్చినప్పుడుగానీ యోని నుంచి దుర్వాసన వస్తుంటుంది.

నిర్లక్ష్యం చేస్తే
ఒకవేళ దీన్ని నిర్లక్ష్యం చేస్తే టాక్సిక్ షాక్ సిండ్రోమ్ (స్టాప్ బ్యాక్టీరియ వలన కలిగే ఒక తీవ్రమైన వ్యాధి)కి గురయ్యే అవకాశం ఉంటుంది. కొందరు పీరియడ్స్ సమయంలో టాంపోన్ యోనిలో అమర్చుకుంటూ ఉంటారు. రక్తస్రావం అయితే ఉంటే అదంతా కూడా అందులోకి పోతూ ఉంటుంది. అయితే ఆరు గంటలకంటే ఎక్కువ సేపు టాంపోన్ యోనిలో పెట్టుకోవడం మంచిది కాదు. అలా చేస్తే యోని నుంచి దుర్వాసన వచ్చే అవకాశం ఉంటుంది.

6. రక్తస్రావం
కొందరికి యోని నుంచి రక్తస్రావం అవుతూ ఉంటుంది.
అయితే దీనికి చాలా కారణాలుంటాయి. వయస్సు, ఆరోగ్యం కూడా ఇందుకు కారణాలుగా ఉంటాయి. మోనోపాజ్ వల్ల కూడా ఇలాంటి సమస్య రావొచ్చు.
ఒకవేళ కేవలం సెక్స్ లో పాల్గొన్న తర్వాత మాత్రం యోని నుంచి రక్త వస్తుంటే అందుకు సర్విక్స్ కారణం కావొచ్చు అని డాక్టర్. కర్టిస్ తెలిపారు.

దానికి సంకేతం
గర్భాశయంలో సమస్య వల్ల కూడా ఇలాంటి సమస్య తలెత్తొచ్చు. ఒక వేళ గర్భిణీగా ఉన్నప్పుడు ఇలా రక్తస్రావం అయితే అది గర్భస్రావానికి సంకేతం కావొచ్చు అని డాక్టర్ రీడ్ తెలిపారు.

7. సెక్స్ పాల్గొన్నప్పుడు నొప్పి
దాదాపు 22 శాతం మహిళలు సెక్స్ లో పాల్గొనేటప్పుడు నొప్పికి గురువుతుంటారు. బాగా బాధపడుతుంటారని ప్రపంచ ఆరోగ్యం సంస్థనే తెలిపింది. సరైన భంగిమల్లో సెక్స్ లో పాల్గొనకపోవడమే ఇందుకు కారణం.

సెక్స్ కంటిన్యూ చేస్తే
ఇలా నొప్పి తరుచుగా వస్తుంటే వెంటనే డాక్టర్ని సంప్రదించడం మేలు. అలా చేయకుండా సెక్స్ కంటిన్యూ చేస్తే మాత్రం భవిష్యత్తులో చాలా ఇబ్బందులుపడాల్సి వస్తుందని డాక్టర్ కర్టిస్ తెలిపారు.



Click it and Unblock the Notifications