పంటినొప్పిని వెంటనే తగ్గించే జామఆకు రసం, ఎలా తయారు చేయాలి, ఎప్పుడు, ఎలా వాడాలి?

పంటినొప్పిని వెంటనే తగ్గించే జామఆకు రసం, ఎలా తయారుచేయాలి, ఎప్పుడు, ఎలా వాడాలి?

పంటినొప్పి మనందరకి వచ్చే సర్వసాధారణ సమస్య. మనందరి జీవితంలో ఏదో ఒక సందర్భంలో దంతాల నొప్పిని అనుభవించే ఉంటాము. ఏదైనా చల్లనివి, వేడి లేదా పుల్లనివి తింటే వెంటనే పంటినొప్పి మరింత తీవ్రం అవుతుంది. పంటి నొప్పి నివారణకు ఎన్నో మందులను వాడి ఉంటాము. అయితే వీటి కంటే న్యాచురల్ రెమెడీస్ మరింత ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. ఇంగ్లీష్ మందుల కంటే ఇవి సురక్షితమైనవి. ప్రభావవంతంగా పనిచేస్తాయి. న్యాచురల్ రెమెడీస్ ఎప్పుడూ సులభంగా అందుబాటులో ఉంటాయి. అటువంటి న్యాచురల్ రెమెడీస్ లో జామ ఆకు ఒకటి. పంటి నొప్పిని నివారించడంలో జామ ఆకు ఏలా పనిచేస్తుందో తెలుసుకుందాం.

Beat a toothache with guava leaves

నోటి పరిశుభ్రత సరిగా పాటించని కారణంగా మరియు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కారణంగా వచ్చే పంటినొప్పిని జామ ఆకులు తగ్గిస్తాయి. ఈ ఆకుల్లో ఉన్న ఫ్లెవనాయిడ్స్ (యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు ) మరియు యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలు పంటినొప్పిని నివారించడంలో ఫర్ఫెక్ట్ గా పనిచేస్తాయి. జామ చెట్టు మన ఇంటి పెరట్లోనే ఉంటాయి కాబట్టి, మనకు అవసరం అయినప్పుడు ఫ్రెష్ గా కట్ చేసుకోవచ్చు. దంత సంరక్షణలో జామ ఆకులు ఏవిధంగా పనిచేస్తాయో చూద్దాం.

పంటినొప్పి ఒక్క సారి వచ్చిందంటే

పంటినొప్పి ఒక్క సారి వచ్చిందంటే

పంటినొప్పి ఒక్క సారి వచ్చిందంటే, ఇక ఆ రాత్రంత నిద్ర పట్టదు. నరకం చూపిస్తుంది. ముఖ్యంగా ఈ సమస్య చలికాలంలో ఎక్కువగా ఉంటుంది. నొప్పి కూడా వర్ణించలేని విధంగా ఉంటుంది. మొదటి సారి పంటినొప్పితో భాదపడే వారు డాక్టర్ వద్దకు వెళ్ళడానికి ముందు జామ ఆకులను నమలడం మరియు సాల్ట్ వాటర్ ను పుక్కిలించి ఊయడం ద్వారా నిజంగా పంటి నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.

పంటి నొప్పికి జామ ఆకులు ఏవిధంగా ప్రయోజనాలను అందిస్తాయి?

పంటి నొప్పికి జామ ఆకులు ఏవిధంగా ప్రయోజనాలను అందిస్తాయి?

జామ ఆకులలో విటమిన్ బి, సి, ఫ్లెవనాయిడ్స్ , క్వర్సిటిన్, టానిన్స్, ఐరన్, లైకోపిన్, పొటాషియం , మెగ్నీషియం, మ్యాంగనీస్ ఉంటాయి. ఈ అంశాలన్నీ కూడా దంతాల నొప్పిని నివారించడంలో ప్రభావంతంగా పనిచేస్తాయి. జామ ఆకుల ద్వారా పంటినొప్పి తగ్గించడంలో మరొకొన్ని ప్రయోజనాలున్నాయి.

పంటి నొప్పికి గల కారణాలు, లక్షణాలు, ప్రయోజనాలు

పంటి నొప్పికి గల కారణాలు, లక్షణాలు, ప్రయోజనాలు

సాధారణంగా ఏదైనా మందులు సూచించే ముందు ఆ నొప్పికి గల కారణాలు ఖచ్చితంగా తెలిసుండాలి. అప్పుడే చికిత్సలో భాగంగా మందులు సూచిస్తుంటారు. పంటి నొప్పి నివారణకు జామ ఆకులు వాడటం మంచిది. పంటి నొప్పికి గల కారణాలు, లక్షణాలు, ప్రయోజనాలు పరిశీలిద్దాం.

పంటినొప్పికి కారణాలు, లక్షణాలు, ప్రయోజనాలు

పంటినొప్పికి కారణాలు, లక్షణాలు, ప్రయోజనాలు

యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు:

ఇన్ఫ్లమేషన్ వల్ల దంతాలు ప్రభావితం అవుతాయి. ఈ ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి, చిగుళ్ళ వాపును నివారించడానికి, పంటినొప్పిని నివారించడానికి, దంత క్షయానికి యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలున్న జామ ఆకులు సహాయపడుతాయి. ఇది నొప్పిని నివారించడంలో ఫ్రెండ్లీ హోం రెమెడీ. నొప్పి నుండి త్వరగా ఉపశమనం కలిగిస్తుంది.

పంటినొప్పికి కారణాలు, లక్షణాలు, ప్రయోజనాలు

పంటినొప్పికి కారణాలు, లక్షణాలు, ప్రయోజనాలు

పంటి నొప్పికి కేవలం ఇన్ఫ్లమేషన్ ఒక్కటే కారణం కాదు, ఇతర కారణాలు కూడా ఉన్నాయి. అయితే ఇన్ఫ్లమేషన్ వల్ల వచ్చే పంటిని నొప్పిని ఈ ఆకు వెంటనే తగ్గిస్తుంది. ఈ ఇన్ఫ్లమేషన్ లక్షణాలతో పాటు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు న్యాచురల్ యాంటీ అనాల్జెసిక్ గుణాలు ఈ ఆకులో ఉన్నాయి. ఇవి పంటి నొప్పిని ప్రభావంతంగా తగ్గిస్తుంది.

మందుల షాపులోని ఫార్మాసూటికల్లో అనాల్జెసిక్ తీసుకోవడానికి బదలుగా ఇలా న్యాచురల్ గా అందుబాటులో ఉండే జామ ఆకులు ఉడికించిన నీటిని అనాల్జెసిక్ గా ఉపయోగించవచ్చు. వీటి వల్ల ఎటువంటి దుష్ప్రభావాలుండవు.

పంటినొప్పికి కారణాలు, లక్షణాలు, ప్రయోజనాలు

పంటినొప్పికి కారణాలు, లక్షణాలు, ప్రయోజనాలు

యాంటీ మైక్రోబయల్ లక్షణాలు:

పంటినొప్పికి ముఖ్య కారణం కంటికి కనబడని మైక్రో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. దీనికి కారణం నోటి పరిశుభ్రతను సరిగా పాటించకపోవడం. ఈ పరిస్థితిలో జామ ఆకులును ఉడికించిన నీటితో నోరు పుక్కలించడం ద్వారా మైక్రోబయల్ యాక్టివిటీస్ తగ్గడంతో పాటు, నోరు పరిశుభ్రంగా ఉంటుంది. జామ ఆకులు ఉడికించిన నీటితో రోజులో రెండు మూడు సార్లు నోటిని పుక్కలిస్తే పంటినొప్పికి కారణమయ్యే బ్యాక్టీరియాను పూర్తిగా నాశనం చేయవచ్చు.

సమర్థవంతమైన ఇంటి నివారణ

సమర్థవంతమైన ఇంటి నివారణ

కొన్ని సందర్భాల్లో మరీ వేడివి , చల్లనివి లేదా స్వీట్స్ లేదా కూల్ డ్రింక్స్ తాగిన వెంటనే తీవ్రమైన పంటినొప్పి భాదిస్తుంది. అటువంటప్పుడు ఒకేసారి మనం నొప్పిని తగ్గించుకోవడం కొంచెం కష్టమైన పనే . అలాంటి సందర్భంలో ఏది తిన్నా.. తాగినా పరిస్థితి మరింత తీవ్రం అవుతుంది. దీనికి ప్రథమచికిత్స జామ ఆకులను ఉపయోగించవచ్చు. పంటినొప్పి నివారించడంలో ప్రభావితమైన న్యాచురల్ హోం రెమెడీ.

ఖనిజాల కొరతకు ప్రత్యామ్నాయం:

ఖనిజాల కొరతకు ప్రత్యామ్నాయం:

పంటినొప్పికి కారణాలు అనేకం.ఖనిజలవణాలు లేకపోవడం వల్ల కూడా నొప్పి భాదిస్తుంది. కాబట్టి, దంతాలు బలంగా ఉండాలంటే మినిరల్స్ చాలా అవసరం. చికిత్స చేయించుకోకపోవడం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు దంతాలు పాడవకుండా మినిరల్ లేయర్స్ చాలా అవసరం.

మినిరల్ లేయర్స్ లోపం వల్ల దంతాలపై ఉన్న ఎనామిల్ దెబ్బతింటుంది. ముఖ్యంగా దీని ద్వారానే చిగుళ్ళ వాపు, ఇన్ఫెక్షన్ కారణంగా నొప్పి వస్తుంది. ఈ పరిస్థితిలో జామ ఆకులో ఉన్న ఐరన్, మరియు క్యాల్షియం వంటివి తగినన్ని మినిరల్స్ అందించి , పంటి ఎనామిల్ ను బలోపేతం చేస్తుంది.

పంటి నొప్పికి జామా ఆకులు ఉపయోగించే పద్దతి:

పంటి నొప్పికి జామా ఆకులు ఉపయోగించే పద్దతి:

తాజాగా ఉన్న జామ ఆకులను తీసుకోవాలి. వీటిని బాగా నీటితో కడిగి ఒకటి రెండు, నోట్లో వేసుకుని నమలాలి. నొప్పి ఉన్న ప్రదేశంలో ఈ రసం చేరేట్లు చూసుకోవాలి. ప్రభావితమైన దంతాలపై ఈ రసం చాలా బాగా పనిచేస్తుంది. జామ ఆకులను ఉపయోగించి డయోరియా సమస్యను కూడా తగ్గించుకోవచ్చు.

పంటి నొప్పికి జామా ఆకులు ఉపయోగించే పద్దతి:

పంటి నొప్పికి జామా ఆకులు ఉపయోగించే పద్దతి:

మరో పద్దతిలో హోం మేడ్ గార్గిలింగ్ వాటర్ తయారు చేయడం. డీప్ పాన్ లో కొద్దిగా నీళ్ళు పోసి బాగా మరిగించాలి. తాజా జామ ఆకులను నాలుగు తీసుకుని శుభ్రంగా కడిగి మరిగే నీటిలో వేసి మరిగించాలి. నీటి రంగు మారే వరకు అలాగే ఉంచాలి.

రోజుకు రెండు మూడు సార్లు

రోజుకు రెండు మూడు సార్లు

ఇది చూడటానికి ఆల్కహాల్ రంగులో మారుతుంది. ఈ ద్రవాన్ని గోరువెచ్చగా చల్లబడనివ్వాలి. ఈ ద్రవాన్ని గోరువెచ్చగా ఉన్నప్పుడు రోజుకు రెండు మూడు సార్లు నోట్లో పోసుకుని గార్గిలింగ్ చేయాలి. దీనికి కొద్దిగా ఉప్పు జోడిస్తే ఫలితం మరింత ప్రభావంతంగా ఉంటుంది. తెలుసుకున్నారుగా పంటి నొప్పికి తక్షణ ఉపశమనం కలిగించే ఈ హోం రెమెడీని మీరు కూడా ప్రయత్నిస్తారుగా..

Desktop Bottom Promotion