For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆల్కహాల్ వాసన వదిలించుకోవడానికి కొన్నిఉత్తమ మార్గాలు ఇక్కడ ఉన్నాయి!

ఆల్కహాల్ వాసన వదిలించుకోవడానికి ఇక్కడ కొన్నిఉత్తమ మార్గాలు ఉన్నాయి!

|

మద్యం సేవించడం చెడ్డ అలవాటు అని అందరికీ తెలుసు. అయితే, నేడు, మద్యం ఫ్యాషన్‌గా మారింది. పార్టీలు, వారాంతాల్లో, చాలామంది స్నేహితులతో కలిసి ఆల్కహాల్ తీసుకుంటుంటారు. పురుషులు మాత్రమే కాదు మహిళలు కూడా ఇప్పుడు మద్యం తాగుతారు. మద్యం సేవించడం సమస్య కాదని అధ్యయనాలు చెబుతున్నాయి. అది చాలా ఎక్కువ అయితే, చాలా తీవ్రమైన సమస్యలు ఉండబోతాయి అని హెచ్చరిస్తున్నారు. చాలా ఇళ్లలో భార్యాభర్తలలో మద్యపానం చేయడం వల్ల కూడా ఇబ్బంది కలిగిస్తుంది. ఈ అభ్యాసానికి ఒకరు బానిసలైతే, దానిని వదలివేయడం కష్టం. కానీ ప్రయత్నించడానికి అసాధ్యం ఏమీ లేదు. కాబట్టి మీకు అతిగా తాగడం అలవాటు ఉంటే, వెంటనే దాన్ని తగ్గించండి.

కొందరు మద్యానికి ఎంతదూరంగా ఉండాలని ప్రయత్నించినా కూడా, వారాంతాల్లో పార్టీల సందర్భంలో అయినా కొన్ని కారణాల దృష్ట్యా మద్యాన్ని స్వీకరిస్తుంటారు. ఎంతోమంది స్వతహాగా, శరీరానికి అవసరంలేని పదార్ధంగా మద్యాన్ని గుర్తించిన కారణాన, ఈ వ్యసనాన్ని వీడుతున్నారు. అయినాకూడా కొందరి ప్రోద్భలం కారణంగా కొద్దో గొప్పో అన్నట్లుగా తీసుకుంటూ ఇబ్బందులకు గురవుతున్నారు అన్నది వాస్తవం. క్రమంగా ఆల్కహాల్ దుర్వాసన కారణంగా ఇంటికి, లేదా కార్యాలయానికి వెళ్ళడం సరైన ఎంపిక కానేరదు. అవునా?

 Brilliant Home Remedies to Get Rid of Alcohol Breath Fast

ఆల్కహాల్ అంత సులభంగా జీర్ణంకానిదిగానే కాకుండా, శరీరంలో విషపదార్ధాలను పెంచడంలో కీలకపాత్ర పోషిస్తుంది. ఇది కాలేయం ద్వారా శోషించబడి, ప్రాసెస్ చేయబడుతుంది. కానీ కాలేయం గంటలో కొంత ద్రావణాన్ని మాత్రమే ప్రాసెస్ చేసేలా జీవక్రియలను జరుపుతుంది. క్రమంగా, నెమ్మదిగా మీ రక్తప్రవాహంలోకి మరియు మీ ఊపిరితిత్తులతో సహా, శరీర కణజాలాలలోనికి ఆల్కహాల్ శోషించబడుతుంది. కానీ శరీరంలో ప్రాసెస్ చేయని ఆల్కహాల్ కూడా పేరుకుంటూ పోతుంది. తద్వారా, దుర్వాసన అధికమవుతుంది. రానురాను, అంతర్గత అవయవాలను దెబ్బతీయడం, వాటి పనితీరు మందగించడం వంటివి కూడా చేస్తుంది.

 Brilliant Home Remedies to Get Rid of Alcohol Breath Fast

ఈ సమస్య అధికంగా మద్యపానం సేవించే వారిలో సర్వసాధారణంగా ఉంటుంది. దుర్వాసన మాత్రమే కాకుండా, మీరు మద్యపానం సేవించని సమయాల్లో కూడా, మీ శరీరంలోని ఆల్కహాల్ అవక్షేపాలు, మరియు అస్థిరమైన ఆల్కహాల్ అణువుల నిక్షేపాల మోతాదులు స్పష్టంగా ఉన్నందున, మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మిమ్ములను తాగుబోతులుగానే భావిస్తారు.

మీరు పచ్చితాగుబోతు కాదు, అని ప్రజలకు తెలియజేయడానికి ఆల్కహాల్ త్యజించడంతో పాటు, దుర్వాసనని వదిలించుకోవడానికి కొన్ని సరళమైన మరియు సులభమైన ఉపాయాలను అనుసరించవలసి ఉంటుంది.

ఈ వ్యాసం మద్యం వాసనను తగ్గించడానికి కొన్ని మార్గాలను సూచిస్తున్నది...

మౌత్ వాష్

మౌత్ వాష్

నోటి నుండి మద్యం వాసనను తొలగించడానికి మౌత్ వాష్ ఒక సాధారణ మార్గం. పుదీనా లేదా పండ్ల వాసన గల ద్రవం యొక్క మౌత్ వాష్ నోటిలో పోసుకుని 30 సెకన్ల పాటు అలాగే ఉండాలి. తర్వాత బయటకు ఉమ్మివేయాలి. అలాగే నాలుకను శుభ్రపరచడానికి టంగ్ క్లీనర్‌ సహాయంతో నాలుకను శుభ్రపరచండి.

చూయింగ్ గమ్

చూయింగ్ గమ్

చూయింగ్ గమ్ అనేది మద్యపానం చేసేవారు వాసన రాకుండా దాచడానికి సాధారణంగా ఉపయోగించే పదార్థం. తీపి చూయింగ్ గమ్ వాడటానికి బదులుగా, మీరు సోర్-స్వీట్ చూయింగ్ గమ్ ఉపయోగిస్తే, నోరు మరింత స్రవిస్తుంది మరియు ఆల్కహాల్ వాసన రాకుండా చేస్తుంది.

వెల్లుల్లి

వెల్లుల్లి

వెల్లుల్లి ఒక బలమైన వాసన కలిగిన పదార్ధం. నోటి నుండి గుప్పున వచ్చే మద్యం వాసనను తగ్గించడానికి ఇది సహాయపడుతుంది. కాబట్టి వైన్ తాగేటప్పుడు, వెల్లుల్లి రుచి కలిగిన ఆహారాన్ని తినండి. లేకపోతే, వైన్ తాగిన తరువాత, మీ నోటిలో వెల్లుల్లి పాయ ఒకటి ఉంచండి.

ఉల్లిపాయలు

ఉల్లిపాయలు

సాధారణంగా మీరు విందు కోసం ఒక హోటల్‌కు వెళితే, వారికి వినెగార్‌తో ఎర్ర ఉల్లిపాయలు వడ్డిస్తారు. ఇది మద్యం వాసనను బయటకు రానివ్వకుండా దాచడానికి సహాయపడుతుందని మీకు తెలుసా? ఎర్ర ఉల్లిపాయ యొక్క బలమైన వాసన చాలా గంటలు నోటిలో ఉంటుంది. కాబట్టి వైన్ తాగిన తరువాత, ఆ వాసన రాకుండా కొద్దిగా ఎర్ర ఉల్లిపాయ తినండి.

కాఫీ

కాఫీ

కాఫీకి బలమైన వాసన ఉంది మరియు ఇది స్కాచ్ మరియు విస్కీ వాసన కలిగిస్తుంది. కాబట్టి మీరు మద్యం వాసనను దాచాలనుకుంటే, వెల్లుల్లి మరియు ఉల్లిపాయలకు బదులుగా ఒక కప్పు కాఫీ తాగండి.

వేరుశెనగ వెన్న

వేరుశెనగ వెన్న

వేరుశెనగ వెన్న మంచి బలమైన వేరుశెనగ రుచిని కలిగి ఉంటుంది. మరియు ఇది రుచిగా కూడా ఉంటుంది. కాబట్టి మీరు మీ ఇంట్లో ఆల్కహాల్ తాగితే, వేరుశెనగ వెన్నను కొద్దిగా నోటిలో వేసుకోండి.

నిమ్మకాయ

నిమ్మకాయ

నిమ్మకాయలోని ఆమ్లం నోటిలో బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధిస్తుంది మరియు సిట్రస్ వాసన నోటి వాసన లేదా మద్యం వాసన నుండి ఉపశమనం పొందటానికి సహాయపడుతుంది. నీటిలో నిమ్మరసం వేసి, అలాగే కొంచెం ఉప్పు వేసి బాగా మిక్స్ చేసి, నోట్లో పోసుకుని 30 సెకన్ల పాటు అలాగే ఉంచుకోండి, తర్వాత ఉమ్మివేయండి. రెండు, మూడు సార్లు ఇలా చేస్తే వాసన తొలగిపోతుంది.

జామ

జామ

మీరు సాధారణంగా మద్యం తాగితే, దాని వాసనను దాచడానికి జామకాయ లేదా జామ ఆకులను తినవచ్చని అంటుంటారు. కానీ చాలా మందికి జామ కాయ లేదా జామ ఆకు తినాలా అన్న దానికి చాలా సందేహాలుంటాయి. కానీ మీరు వీటిలో ఏమి తిన్నా, దాని బలమైన వాసన ఆల్కహాల్ వాసనను దాచిపెడుతుంది.

టొమాటో జ్యూస్

టొమాటో జ్యూస్

టమోటా రసం మద్యం యొక్క వాసనను దాచగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి టమోటా తినండి లేదా అల్పాహారం వద్ద టంబ్లర్ టమోటా రసం త్రాగాలి. ఆ విధంగా మునుపటి రోజు తాగడం వల్ల వాసన రాకుండా పూర్తిగా నివారించబడుతుంది.

English summary

Brilliant Home Remedies to Get Rid of Alcohol Breath Fast

Here are some simple and natural home remedies that can effectively get rid of alcohol breath fast, either by eliminating or by camouflaging the smell of alcohol on breath.
Story first published:Friday, November 22, 2019, 15:44 [IST]
Desktop Bottom Promotion