For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కరోనా వ్యాక్సిన్ కేంద్రానికి వెళ్లాలనుకుంటున్నారా? మీ సిటీలోని వ్యాక్సిన్ సెంటర్ల పూర్తి వివరాలు ఇక్కడున్నాయి.

కరోనా వైరస్ వ్యాక్సినేషన్ సెంటర్ల గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

|

ఇటీవలే కరోనా వ్యాక్సిన్ రెండో దశ ఎవరెవరికి ఇవ్వనుందో ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. మొదటి దశలో పారిశుద్ధ్య కార్మికులకు, ఆరోగ్య కార్యకర్తలకు కరోనా టీకాలను అందజేసింది.

COVID-19 vaccinations in Hyderabad : Full list of government, private hospitals in Telugu

తొలి దశలో దాదాపు 1.43 కోట్ల మోతాదులో కోవిషీల్డ్ మరియు కోవాక్సిన్లను అందజేశారు. ఇప్పుడు రెండో దశలో భాగంగా 45-60 ఏళ్ల వారు సులభంగా ఇంటినుండే రిజిస్టర్ చేసుకునే అవకాశం కూడా కల్పించింది.

COVID-19 vaccinations in Hyderabad : Full list of government, private hospitals in Telugu

రెండో దశలో మార్చి 1వ తేదీ నుండి ప్రధానంగా ఎనిమిది రాష్ట్రాలను ఎంపిక చేసింది. అందులో కేరళ, మహారాష్ట్ర, పంజాబ్, గుజరాత్, ఛత్తీస్ ఘడ్, పశ్చిమ బెంగాల్, జమ్మూ, కాశ్మీర్ మరియు మధ్య ప్రదేశ్ లో ఆందోళనకర స్థాయిలో కేసులున్నాయని గుర్తించింది. గత రెండు వారాల్లో ఈ రాష్ట్రాల్లో రోజువారీ కేసుల్లో పెరుగుదల కనిపిస్తోందని వివరించింది.

COVID-19 vaccinations in Hyderabad : Full list of government, private hospitals in Telugu

ఈ సందర్భంగా దేశంలోని అన్ని రాష్ట్రాలకు కోవిద్-19 టీకాను అందజేయాలని నిర్ణయించింది. ఈ సందర్భంగా కరోనా వ్యాక్సిన్ సెంటర్లు మీ నగరంలో ఎక్కడెక్కడున్నాయో పూర్తి వివరాలను ప్రకటించింది. అందులో ప్రభుత్వ మీ నగరంలోని ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన(ABPMJ)పథకం కింద ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగానే కరోనా వ్యాక్సిన్ పొందొచ్చు. అయితే ప్రైవేట్ ఆస్పత్రిలో మాత్రం 250 రూపాయల ధరను నిర్ణయించింది. ఈ సందర్భంగా మీ నగరంలో ఏయే ఆస్పత్రులలో ఈ టీకాలు అందుబాటులో ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Covid-19 Vaccination: ఇంటి నుండే కరోనా వ్యాక్సిన్ కోసం రిజిస్టర్ చేసుకోండిలా...Covid-19 Vaccination: ఇంటి నుండే కరోనా వ్యాక్సిన్ కోసం రిజిస్టర్ చేసుకోండిలా...

హైదరాబాదులో..

హైదరాబాదులో..

తెలంగాణ రాజధాని అయిన హైదరాబాదులోని ప్రముఖ ఆసుపత్రులలో కరోనా టీకాలను అందుబాటులో ఉంచింది. ఆ ఆసుపత్రుల వివరాలు ఇలా ఉన్నాయి.

* గాంధీ ఆసుపత్రి

* ఉస్మానియా జనరల్ హాస్పిటల్

* ఫీవర్ హాస్పిటల్

* ENT హాస్పిటల్

* SD EYE హాస్పిటల్

* డిహెచ్ కింగ్ కోఠి

* ఎ.హెచ్.మలక్ పేట

* ఎ.హెచ్. గోల్కొండ

* ఎ.హెచ్. నాంపల్లి

* షల్దార్ యుపిహెచ్ సి

* నిజాం ఆసుపత్రి

* ESIC మెడికల్ కాలేజీ హాస్పిటల్

ఆంధ్రప్రదేశ్ లో..

ఆంధ్రప్రదేశ్ లో..

ఆంధ్రదప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ, విశాఖపట్నం నగరాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ను అందజేశారు. వీటితో పాటు 13 జిల్లాల్లో కూడా కరోనా వ్యాక్సిన్లు అందుబాటులో ఉంచారు. అంతేకాదు అన్ని జిల్లాల్లోనూ చాలా మంది ప్రజలు కరోనా వ్యాక్సిన్ కోసం రిజిస్టర్ చేసుకుని టీకాను పొందినట్లు అధికారులు ప్రకటించారు.

బెంగళూరులో..

బెంగళూరులో..

బెంగళూరులో కూడా కరోనా వ్యాక్సిన్ ను ప్రజలకు విరివిగా అందిస్తున్నారు. అందులో ఈ ఆసుపత్రులలో ఎక్కువగా కోవిద్ టీకా లభిస్తోంది.

* కెసి జనరల్ హాస్పిటల్, జయనగర్

* జనరల్ హాస్పిటల్, బెంగళూరు

* మెడికల్ కాలేజీ మరియు హాస్పిటల్

* బౌరింగ్ మెడికల్ కాలేజీ హాస్పిటల్

* సి.వి.రామన్ జనరల్ హాస్పిటల్

ప్రైవేట్ సెంటర్లు..

* విక్రమ్ హాస్పిటల్

* మణిపాల్ హాస్పిటల్

* రాఘవేంద్ర పీపుల్ ట్రీ హాస్పిటల్

* సప్తగిరి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్

* కొలంబియా ఆసియా హాస్పిటల్, యశ్వంతపూర్

* అపొలో హాస్పిటల్, శేషాద్రిపురం

* కొలంబియా ఆసియా హాస్పిటల్, వైట్ ఫీల్డ్

* ఫోర్టిస్ హాస్పిటల్, బన్నెర్ ఘట్ట రోడ్

* అపొలో హాస్పిటల్, బన్నెర్ ఘట్ట రోడ్

* స్పార్ష్ హాస్పిటల్

* రాజరాజేశ్వరి మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్

* కొలంబియా ఆసియా హాస్పిటల్, హెబ్బల్

* అపొలో స్పెషాలిటీ హాస్పిటల్, జయనగర్

* దయానంద్ సాగర్ హాస్పిటల్

* కుమారస్వామి లేఅవుట్:మల్లిగే

* శుశ్రుష హాస్పిటల్

* ఎంఎస్ రామయ్య మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్

ముంబైలో..

ముంబైలో..

* జాస్లోక్ హాస్పిటల్

* హెచ్ ఎన్ రిలయన్స్ హాస్పిటల్

* బ్రీచ్ క్యాండీ హాస్పిటల్

* భాటియా హాస్పిటల్

* కస్తూర్బా హాస్పిటల్

* జెజె హాస్పిటల్

* కెమ్ హాస్పిటల్

* గ్లోబల్ హాస్పిటల్

* హిందూజా హాస్పిటల్

* బార్క్ హాస్పిటల్

* రాజావాడి హాస్పిటల్

* వీర్ సావర్కర్ హాస్పిటల్

* కుర్లా బాబా హాస్పిటల్

* భగవతి హాస్పిటల్ తో పాటు మరికొన్ని ఆసుపత్రులలో కరోనా వ్యాక్సిన్ అందుబాటులో ఉంది.

పూర్తి వివరాలకు ఈ వెబ్ సైట్ (http://cowin.gov.in.)లోకి వెళ్లండి.

English summary

COVID-19 vaccinations in Hyderabad : Full list of government, private hospitals in Telugu

COVID-19 vaccinations in Hyderabad : Here are the Full list of government, private hospitals in Telugu. Take a look
Desktop Bottom Promotion