Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
Early Wakeup Cons: ఉదయమే నిద్ర లేస్తున్నారా.. ఈ సమస్యలు తప్పవు జాగ్రత్త
తెల్లవారుజామునే నిద్రలేచే వారికి అల్జీమర్స్ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అధ్యయనం తేల్చింది. ఉదయం వేళ తొందరగా నిద్రలేచే వారిలో అల్జీమర్స్ రెండు రెట్ల జన్యు ప్రమాదం 11 శాతం ఎక్కువగా ఉందని తెలిపారు.
Early Wakeup Cons: ఈ చలికాలంలో చల్లని వాతావరణంలో మంచిగా ముసుగు తన్ని పడుకోవడం చాలా మందికి ఇష్టం. నిద్ర లేవమని ఎంత లేపినా చాలా మంది అస్సలే లేవరు. అయితే తెల్లవారుజామున నిద్ర లేవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని చాలా మంది చెబుతుంటారు.

అయితే తెల్లవారుజామునే నిద్ర లేచే వారిపై లండన్ లోని ఇంపీరియల్ కాలేజీకి చెందిన అధ్యయనకర్తలు చేసిన పరిశోధన షాకింగ్ విషయం బయటపెట్టింది. తెల్లవారుజామునే నిద్రలేచే వారికి అల్జీమర్స్ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అధ్యయనం తేల్చింది. ఉదయం వేళ తొందరగా నిద్రలేచే వారిలో అల్జీమర్స్ రెండు రెట్ల జన్యు ప్రమాదం 11 శాతం ఎక్కువగా ఉందని తెలిపారు.

ప్రొద్దున్నే నిద్రలేవడం వల్ల కలిగే దుష్ప్రభవాలు:
1. నిద్రలేమికి దారితీయవచ్చు
రాత్రుళ్లు ఆలస్యంగా నిద్ర పోయి తెల్లవారుజామునే లేస్తే నిద్రలేమి బాధపెడుతుంది. దీని వల్ల అలసట, ఏకాగ్రత లోపిస్తుంది. మానసిక స్థితి దెబ్బతింటుంది. తెల్లవారుజామునే నిద్ర లేవాలనుకునే వారు రాత్రి వేళ త్వరగా నిద్ర పోవాలి.

2. ఒత్తిడి పెంచుతుంది
కొంతమంది త్వరగా నిద్ర లేస్తే ఒత్తిడి, ఆందోళన ఇతర ఆరోగ్య సమస్యలు కారణం కావొచ్చు. దీని వల్ల సరిగ్గా విశ్రాంతి తీసుకోవడం సాధ్యం కాదు. డి-రెగ్యులేటెడ్ స్పీల్ సైకిల్స్ కు దారి తీస్తుంది.

3. ఉత్పాదకత తగ్గుతుంది
పొద్దున్నే నిద్ర లేవడం వల్ల నిద్ర మత్తుగా అనిపిస్తుంది. పని చేస్తున్నప్పుడు పనిపై శ్రద్ధ పెట్టడం కష్టంగా ఉంటుంది. ఏ పని పైనా దృష్టి పెట్టలేక ఉత్పాదకత తగ్గుతుంది. మనకు మాత్రమే సరిపోయే నిద్ర సైకిల్ ను కనుగొని దానిని ఫాలో కావడం వల్ల అనేక లాభాలు ఉంటాయి.

4. మూడియర్ గా మారుస్తుంది
పొద్దున్నే లేవడం వల్ల మనుషులు మూడీ అవుతారు. నిద్ర లేకపోవడం, ఒత్తిడి స్థాయి పెరగడం వల్ల చాలా సమస్యలు వస్తాయి. దీని మూడ్ స్వింగ్స్ కు దారితీస్తుంది. మూడ్ బాలేకపోతే భాగస్వామిలో, కుటుంబసభ్యులతో మనస్ఫూర్తిగా వ్యవహరించలేరు. ఇది మళ్లీ ఒత్తిడికి దారి తీస్తుంది. ఒత్తిడి వల్ల నిద్ర ఉండదు. నిద్ర లేకపోతే ఒత్తిడిగా అనిపిస్తుంది. ఇలా సర్కిల్ లో తిరగాల్సి వస్తుంది.

5. బయోలాజికల్ క్లాక్
తెల్లవారుజామునే నిద్ర లేవాలనుకుంటే కొన్ని రోజు దానిని అలవాటు చేసుకోవాలి. రాత్రి వేళ త్వరగా నిద్ర పోవాలి. కనీసం 7 నుండి 8 గంటల నిద్ర ఉండేలా చూసుకోవాలి. అలా మెల్లిగా నిద్ర గడియారాన్ని(బయోలాజికల్ క్లాక్) ను ట్యూన్ చేయాలి.



Click it and Unblock the Notifications
