For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వారంలో 3 సార్లు కంటే ఎక్కువ మష్రుమ్ తినే పురుషుల్లో ప్రొస్టేట్ క్యాన్సర్ రాదు

వారంలో 3 సార్లు కంటె ఎక్కువ మష్రుమ్ తినే పురుషుల్లో ప్రొస్టేట్ క్యాన్సర్ రాదు

|

మష్రుమ్ (పుట్టగొడుగు)లు శాకాహార పదార్థం. కానీ ఇది మీకు మాంసాహార రుచిని ఇస్తుంది. ఇది చాలా మందికి ఇష్టమైన ఆహార పదార్థం. పుట్టగొడుగులలో కేలరీలు తక్కువగా ఉంటాయి మరియు ఫైబర్ మరియు ప్రోటీన్ అధికంగా ఉంటాయి. బి విటమిన్లు, సెలీనియం, పొటాషియం, ఐరన్ మరియు విటమిన్ డి వంటి ముఖ్యమైన పోషకాలు కూడా ఇందులో ఉన్నాయి.

పండ్లు, కూరగాయలలో ఉండేటటువంటి యాంటీ ఆక్సిడెంట్లు పుట్టగొడుగులలో పుష్కలంగా ఉన్నాయి. పుట్టగొడుగులు అధిక పోషకాంశాలను కలిగి ఉండటం వల్ల ఆరోగ్య ప్రయోజనాలను కూడా అధికంగా అందిస్తాయి.

Eating Mushrooms 3 Times A Week Cuts Risk Of Prostate Cancer: Study

పుట్టగొడుగులు తినని పురుషుల కంటే పుట్టగొడుగులను ఎక్కువగా తినే పురుషులలో ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం తక్కువగా ఉందని తాజా అధ్యయనం పేర్కొంది.

ప్రోస్టేట్ గ్రంథి

ప్రోస్టేట్ గ్రంథి

ప్రోస్టేట్ గ్రంథి మగ పునరుత్పత్తి అవయవం. మూత్రాశయం మరియు పురుషాంగం మధ్య ఉన్న ఒక చిన్న గ్రంథి. ఈ గ్రంథి పురుషుడి అంగంలో స్పెర్మ్‌ను ఉత్పత్తి చేసి సేకరించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. 50 ఏళ్లు పైబడిన పురుషులకు ప్రోస్టేట్ గ్రంధి సమస్యలు వస్తుంటాయి. అయితే లక్షణాలు మంటను కలిగి ఉంటాయి.

ప్రోస్టేట్ క్యాన్సర్

ప్రోస్టేట్ క్యాన్సర్

మగవారిలో ప్రొస్టేట్ క్యాన్సర్ ప్రాబల్యం ఎక్కువగా ఉంది. ప్రోస్టేట్ క్యాన్సర్ పురుషులను మాత్రమే ప్రభావితం చేసే ప్రధాన క్యాన్సర్. ఈ క్యాన్సర్ ఎవరికి ఎప్పుడు వస్తుందో చెప్పలేము. కానీ ఈ రకమైన క్యాన్సర్ ప్రభావాన్ని నివారించవచ్చు. అందుకు కొన్ని ప్రత్యేకమైన ఆహారాలు చాలా సహాయపడతాయి. అలాంటి వాటిలో పుట్టగొడుగులు ఒకటి. ఇవి ప్రోస్టేట్ క్యాన్సర్‌ను నివారిస్తాయని తాజా అధ్యయనంలో తేలింది.

పుట్టగొడుగులు ఉత్తమ పరిష్కారం

పుట్టగొడుగులు ఉత్తమ పరిష్కారం

వారంలో మూడుసార్లు పుట్టగొడుగులను తినే పురుషులు ప్రోస్టేట్ క్యాన్సర్‌కు గురయ్యే ప్రమాదం ఉండదని ఒక కొత్త అధ్యయనం కనుగొంది.

కొత్త అధ్యయనం ...

కొత్త అధ్యయనం ...

జపాన్లో పుట్టగొడుగు మరియు ప్రోస్టేట్ క్యాన్సర్ పై పరిశోధనలు జరిగాయి. ఈ అధ్యయనంలో 40 నుండి 79 సంవత్సరాల వయస్సు గల సుమారు 36,499 మంది పురుషులు ఉన్నారు. ఈ అధ్యయనంలో ఉన్న పురుషులను 13.2 సంవత్సరాలు నిరంతరం పరీక్షించారు. తోహోకు విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు ఈ అధ్యయనం చేశారు. అధ్యయనంలో పాల్గొన్న వారిలో, 3.3 శాతం మందికి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని కనుగొన్నారు.

అలాగే వారానికి 1-2 సార్లు పుట్టగొడుగులను తింటున్న పురుషుల్లో

అలాగే వారానికి 1-2 సార్లు పుట్టగొడుగులను తింటున్న పురుషుల్లో

అలాగే వారానికి 1-2 సార్లు పుట్టగొడుగులను తింటున్న పురుషుల్లో ప్రోస్టేట్ క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం 8శాతం కంటే తక్కువగా ఉన్నట్లు గుర్తించారు, అయితే వారంలో మూడు సార్లు, అంత కంటే ఎక్కువ సార్లు పుట్టగొడుగులను తినే పురుషులకు ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశం 17 శాతం తక్కువగా ఉందని అధ్యయనం కనుగొంది.

ఏదేమైనా,

ఏదేమైనా, "ప్రోస్టేట్ క్యాన్సర్పై పుట్టగొడుగుల ప్రయోజనకరమైన

ఏదేమైనా, "ప్రోస్టేట్ క్యాన్సర్పై పుట్టగొడుగుల ప్రయోజనకరమైన ప్రభావాల విధానం అనిశ్చితంగా ఉంది. పుట్టగొడుగుల్లోని కొన్ని జీవ లక్షణాలు ప్రోస్టేట్ క్యాన్సర్ నివారణకు సంబంధించినవిగా నివేదించబడ్డాయి."

రోగనిరోధక శక్తి బలపడుతుంది

రోగనిరోధక శక్తి బలపడుతుంది

మరొక అధ్యయనం ప్రకారం ఒక వ్యక్తి పుట్టగొడుగులను తరచూ తింటుంటే అది రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది మరియు వ్యాధుల బారిన పడకుండా చేస్తుంది. అందుకు ప్రధాన కారణం వీటిలో ఉండే వ్యాధినిరోధక లక్షణాలు. మీరు రోజూ పుట్టగొడుగులను తింటుంటే ఊపిరితిత్తుల సమస్యల నుండి బయటపడవచ్చు.

బరువు తగ్గడానికి సహాయపడుతుంది

బరువు తగ్గడానికి సహాయపడుతుంది

పుట్టగొడుగులలో తక్కువ కేలరీలు మరియు కొవ్వులు ఉంటాయి. అదే సమయంలో ఇందులో రెండు రకాల డైటరీ ఫైబర్, బీటా-గ్లూకాన్స్ మరియు చిటిన్ ఉన్నాయి. ఇవి ఆకలిని తగ్గిస్తాయి మరియు కడుపును నింపుతాయి. దాంతో సులభంగా బరువు తగ్గవచ్చు.

బరువు తగ్గడం మరియు పుట్టగొడుగులపై ఒక అధ్యయనం పాల్గొనేవారు తక్కువ మాంసం మరియు ఎక్కువ పుట్టగొడుగులను తినాలని సూచించారు. ఒక సంవత్సరం తరువాత వారిని పరిశీలించినప్పుడు, అధ్యయనంలో పాల్గొన్నవారు ఆరోగ్యంగా ఉన్నారని, బరువు తగ్గారని మరియు రక్తంలో చక్కెర మరియు రక్తపోటు మరియు కొలెస్ట్రాల్ తగ్గించారని వారు కనుగొన్నారు.

కాబట్టి పుట్టగొడుగులను మామూలుగా భావించే బదులు, ప్రకృతి మనకు బహుకరించిన ఒక వరంగా భావించండి మరియు తరచూ మీ ఆహారంలో పుట్టగొడుగులను చేర్చండి. ఈ వ్యాసం మీకు ఉపయోగకరంగా ఉంటే దయచేసి దీన్ని షేర్ చేయండి మరియు ఈ కథనాన్ని స్నేహితులతో పంచుకోండి.

English summary

Eating Mushrooms 3 Times A Week Cuts Risk Of Prostate Cancer: Study

A new study has now revealed that consuming mushrooms may reduce risk of prostate cancer. Read on...
Desktop Bottom Promotion