Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
ప్రపంచ వినికిడి దినోత్సవం పోస్టర్‌లో కేరళ అమ్మాయి, ఎందుకో తెలుసా?
ఈ ఏడాది మార్చి 3వ తేదీన వరల్డ్ హియరింగ్ డే జరిగింది. ఇందుకోసం డబ్ల్యూహెచ్ఓ ఓ పోస్టర్ విడుదల చేసింది. అందులో కేరళకు చెందిన రిజ్వానా ఫోటోను ఉంచింది.
మనం చెవులతో వింటాం.. నోటితో మాట్లాడతాం.. ఈ రెండూ వేర్వేరులా కనిపించినా.. వీటి మధ్య అవినాభావ సంబంధం ఉంటుంది. ముఖ్యంగా పసితనంలో మన చెవులు వినపడితేనే మాటలు వస్తాయి. మాటలు విని, వాటిని అనుకరించడం ద్వారా మాటలు నేర్చుకుంటారు పిల్లలు. అందుకే మాటలు రావడానికి వినికిడి శక్తి అత్యంత కీలకం. అందుకే చిన్న పిల్లలను అమ్మా, నాన్న, అత్త అనాలంటూ పసిపిల్లలకు చెబుతూ ఉంటారు. మనం పదే పదే చెప్పే మాటలను పిల్లలను అనుకరిస్తూ మాటలు నేర్చుకుంటారు.

(image: TheFreePressJournal)
ఏటా కనీసం లక్ష మందికి పైగా పిల్లలు పుట్టుకతోనే తీవ్రమైన వినికిడి లోపంతో పుడుతున్నారు. దీన్ని సకాలంలో గుర్తించకపోవడం మూలంగా వీరిలో చాలా మంది చెవిటి-మూగ వారిగా మిగిలిపోతున్నారు. వినికిడి లోపాన్ని పసితనంతోనే గుర్తించి.. వినికిడి శక్తిని కల్పించగలిగితే ఎలాంటి సమస్య లేకుండా జీవితాన్ని గడుపుతారు.
పసిపిల్లల్లో ఎంత త్వరగా ఈ సమస్యను గుర్తించి చికిత్స అందించగలిగితే వారికి అంత త్వరగా ఆ సమస్య నుండి బయటపడేయడానికి, మాటలు రావడానికి అవకాశం ఉంటుంది. దీని ప్రాధాన్యత చెప్పేందుకు ఏటా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని జరుపుతుంది.
ఈ ఏడాది మార్చి 3వ తేదీన వరల్డ్ హియరింగ్ డే జరిగింది. ఇందుకోసం డబ్ల్యూహెచ్ఓ ఓ పోస్టర్ విడుదల చేసింది. అందులో కేరళకు చెందిన రిజ్వానా ఫోటోను ఉంచింది.

ఎవరీ రిజ్వానా? ఆమె ఫోటోను పోస్టర్‌లో ఎందుకుంచారు?
రిజ్వానా.. కొట్టాయంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ చివరి సంవత్సరం చదువుతోంది. నవజాత శిశువుల్లో వినికిడి లోపాన్ని త్వరగా గుర్తించి చికిత్స అందిస్తే.. వారు ఎలాంటి లోపం లేకుండా జీవితాన్ని సాగిస్తారు అనేందుకు రిజ్వానా ఓ సజీవ ఉదాహరణగా నిలుస్తోంది.
రిజ్వానా వినికిడి లోపంతో జన్మించింది. తనకు ఆరేళ్ల వరకు ఏదీ వినలేదు, మాట్లాడలేదు. రిజ్వానాకు వినికిడి లోపం ఉందన్న విషయాన్ని తన తల్లిదండ్రులు ఏడాది వయస్సులోనే గుర్తించారు. అబ్దుల్ రషీద్, సబిత దంపతులకు కాక్లియర్ ఇంప్లాంటేషన్ గురించి తెలియదు. అందుకే వారికి తెలిసిన కఠినమైన స్పీచ్ థెరపీ ఇప్పించారు. స్పీచ్ థెరపీ కచ్చితంగా సానుకూల ఫలితాలను ఇస్తుందని రిజ్వానా తల్లిదండ్రులకు తెలియదు. కానీ వారి ప్రయత్నాన్ని మాత్రం ఆపలేదు.
ఆ తర్వాత కాక్లియర్ ఇంప్లాంటేషన్ గురించి తెలుసుకుని రిజ్వానాకు ఆరేళ్ల వయస్సు ఉన్నప్పుడు ఆ చికిత్స అందించారు. చాలా ఆలస్యంగా కాక్లియర్ ఇంప్లాంటేషన్ చికిత్స అందించినప్పటికీ రిజ్వానా చక్కగా వినగలిగింది. ఆరేళ్ల వయస్సులో తను మొదటి సారి తన అమ్మనాన్న మాటలు స్పష్టంగా వినగలిగింది. ప్రకృతి చేస్తున్న శబ్ధాలకు మొదటిసారి పరిచయం అయింది. హోరు గాలి తన చెవులను తాకుతున్నప్పుడు ఎంతో ఆనందించింది.

కాక్లియర్ ఇంప్లాంట్ ఎప్పుడు అవసరం:
వినికిడి సామర్థ్యాన్ని డెసిబెల్స్ లో లెక్కిస్తారు. ప్యూర్ టోన్ ఆడియోమెట్రీ పరీక్షలో వినికిడి సామర్థ్యం 20 డెసిబెల్స్ గానీ, అంతకన్నా తక్కువగానీ ఉండే వినికిడి మామూలుగా ఉన్నట్టు. 25-30 మధ్య ఉంటే సమస్య లేనట్లు. 30 డెసిబెల్స్ దాటితే చిన్న సమస్య ఉన్నట్లు, 30-40 డెసిబెల్స ఉంటే మోస్తరు వినికిడి లోపం, 50-60 మధ్య ఉంటే మధ్యస్థ లోపం, 70-80 మధ్య తీవ్రమైన లోపం, 90 కి పైగా ఉంటే తీవ్రమైన వినికిడి లోపంగా పరిగణిస్తారు. 30-75 డెసిబెల్స్ వరకూ ఉంటే సర్జరీగాని, వినికిడి సాధనాలు గానీ అవసరం. అంతకుమించి సమస్య తీవ్రంగా ఉంటే వారికి కాక్లియర్ ఇంప్లాంట్ అవసరం.
- వినికిడి లోపంతో పుట్టిన బిడ్డలకు ఏడాదిలోపే కాక్లియర్ ఇంప్లాంటేషన్ చేస్తే మాటలు త్వరగా వస్తాయి. రెండు చెవులకూ చేస్తే మరింత మెరుగైన ఫలితాలు వస్తాయి.
- మూడేళ్లలోపు అమర్చిన పిల్లలతో పోలిస్తే ఏడాదిలోపే అమర్చితే మెరుగ్గా మాటలు వస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి.
- మాటలు వచ్చిన తర్వాత పిల్లలు లేదా పెద్దలకు వినికిడి లోపం తలెత్తితే వారికి కాక్లియర్ ఇంప్లాంట్ ఫలితాన్ని ఇస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications