For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఒకటి రెండు రోజుల్లో మలబద్ధక సమస్యను నియంత్రించే వంటగదిలోని పదార్థాలు

ఒకటి రెండు రోజుల్లో మలబద్ధకం సమస్యను నియంత్రించే వంటగదిలోని పదార్థాలు

|

మలబద్ధకం అనేది ఏ వయసులోనైనా, ఎప్పుడైనా సంభవించే ఒక సమస్య మరియు ఇది తరచుగా ఇబ్బందికరంగా ఉంటుంది. ఒక సర్వేలో ఇరవై ఐదు శాతం మందికి ఈ సమస్య ఉందని తేలింది. ఇటువంటి సమస్య ఎందుకు వస్తుంది?సాధారణ సమాధానం ఏమిటంటే జీవనశైలిలో మార్పులు. అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడం వల్ల బలవంతంగా మలవిసర్జనకు కారణం అవుతుంది.

kitchen ingredients to get rid of constipation with in two days

సాధారణ మలబద్ధకం చాలా సమస్యాత్మకం కాకపోవచ్చు. కానీ తీవ్రమైన మలబద్ధకం ఉన్నవారు దీనిని తట్టుకోలేరు. మలబద్దకాన్ని నివారించడానికి సరైన మందులు ప్రయత్నించడం మాత్రమే కాదు, అనుసరించే క్రమం మీద కూడా ఆధారపడి ఉంటుంది. అయితే మలబద్దకంను నివారించడానికి తగిన ఔషధాలు మన ఇంటి వంటగదిలో ఉన్నాయి. మలబద్దకంను సమర్థవంతంగా నివారించే ఇంట్లోని హో రెమెడీస్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం రండి...

మీ ఆహారంలో ఆరోగ్యకరమైన కొవ్వులను పెంచండి

మీ ఆహారంలో ఆరోగ్యకరమైన కొవ్వులను పెంచండి

మనకు తెలిసిన కొవ్వు అనారోగ్యకరమైనది కాదు, మన ఆరోగ్యానికి మంచి కొవ్వులు చాలా అవసరం అవుతాయి. కానీ ఎక్కువగా తీసుకుంటే ప్రమాధం ఉంటుంది. కాబట్టి ఆరోగ్యకరమైన కొవ్వు ఆహారం ద్వారా మనకు అందుబాటులో ఉండాలి. ఆలివ్ ఆయిల్ మరియు నువ్వులు మన శరీరానికి అద్భుతమైన కొవ్వు పదార్ధాలను అందిస్తాయి. అదేవిధంగా ఎండు ఫలాలు కూడా ఈ విషయంలో మంచి ఎంపిక. ఈ నూనెలలోని కొవ్వు పదార్ధం మన ప్రేగులలోని ఆహారాన్ని తేలికగా ముందుకు తరలించడానికి సహాయపడుతుంది మరియు ఎక్కువ ఒత్తిడి లేకుండా విసర్జన ప్రక్రియకు సహాయపడుతుంది.

పుదీనా లేదా అల్లం టీ

పుదీనా లేదా అల్లం టీ

మలబద్ధకం సులభంగా నియంత్రించబడకపోతే ఈ పద్ధతిని ప్రయత్నించండి. కొద్దిగా పుదీనా ఆకులు లేదా అల్లం ముక్కలతో నీళ్ళలో వేసి టీలాగా ఉడకబెట్టండి మరియు రుచికోసం కొద్దిగా బెల్లం చేర్చి తీసుకోవడం వల్ల రుచిరికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం. మీ సమస్యను నివారించడంలో సులభమైనటువంటి హోం రెమెడీ. ఈ రెండింటిలో జీర్ణక్రియను సులభతరం చేసే శక్తివంతమైన ఎంజైములు ఉన్నాయి. ముఖ్యంగా జీర్ణశయాంతర ప్రేగులలో మంటను తగ్గించి ఉపశమనం కలిగిస్తుంది. ఉత్తమ ఫలితం కోసం భోజనానికి ముందు మరియు తరువాత ఈ టీ తాగడం వల్ల ప్రేగులలోని మలినాలను తొలగించి మలబద్దకాన్ని నివారిస్తుంది.

బేకింగ్ సోడా

బేకింగ్ సోడా

శరీరమంతా సక్రమంగా పనిచేయడంలో మన గ్యాస్ట్రిక్ ఆమ్లాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. బేకింగ్ సోడా లేదా సోడియం బైకార్బోనేట్ మన గ్యాస్ట్రిక్ ఆమ్లాలతో (అంటే, ఆమ్లం మరియు ఆమ్లాలు మిశ్రమంగా) స్పందించినప్పుడు, కార్బన్ డయాక్సైడ్ మరియు నీరు ఉత్పత్తి అవుతాయి. కార్బన్ డయాక్సైడ్ నోటి ద్వారా విడుదల అయినప్పుడు, నీరు జీర్ణక్రియకు సహాయపడుతుంది, పేగులను శుభ్రపరచడం మరియు ఆహారం పేగులలో తేలికగా కదలడం సులభం చేస్తుంది.

నిమ్మకాయ నీరు

నిమ్మకాయ నీరు

నిమ్మజాతి జాతి పండ్లలో సిట్రస్ ఆమ్లం ఒక ముఖ్యమైన అంశం మరియు వీటిలో శరీర సమతుల్యతను కాపాడటానికి సహాయపడే అనేక విటమిన్లు మరియు ఖనిజాలను కలిగి ఉన్నాయి. ఈ పండ్లలోని విటమిన్ సి జీర్ణక్రియకు సహాయపడుతుంది మరియు జీర్ణవ్యవస్థకు సహాయపడుతుంది. భోజనం తినడానికి ముందు పెద్ద మొత్తంలో నిమ్మరసం త్రాగాలి. మంచి ఆరోగ్యం కోసం రోజూ ఈ దినచర్యను అనుసరించండి.

నువ్వులు

నువ్వులు

సాధారణంగా ఆహార రూపంలో తీసుకుంటారు. ఇవి తెలుపు మరియు నలుపు రంగుల్లో ఉంటాయి. కానీ నల్ల నువ్వులు చాలా ఆరోగ్యకరమైనవి. వాటి పరిమాణం చిన్నది అయినప్పటికీ, వాటిలో ఉండే పోషకాల మాత్రం భారీగా ఉంటాయి. ముఖ్యంగా నువ్వుల నూనె మన శరీరానికి ఉత్తమమైనది. ఈ నూనె జీర్ణవ్యవస్థలోని ఆహారాన్ని సడలించడానికి సహాయపడుతుంది మరియు జీర్ణమయ్యి మిగిలిన వ్యర్థాలను ప్రేగుల నుండి సులభంగా ముందుకు నెట్టడానికి సహాయపడుతుంది.

డైటరీ ఫైబర్ ఆహారాలు

డైటరీ ఫైబర్ ఆహారాలు

తదుపరి మీరు మలబద్దకాన్ని అనుభవించినప్పుడు మునుపటి రెండు రోజుల్లో మీరు తీసుకున్న ఆహారాన్నిగుర్తించండి. మైదా ఆధారిత లేదా ఫైబర్ లేని ఆహారం అయితే మలబద్ధకానికి ప్రధాన కారణం కావచ్చు. మీరు వెంటనే ఆకుకూరలు మరియు ఫైబర్ అధికంగా ఉండే తినదగిన కూరగాయలు వంటి ఆహారాన్ని తీసుకోవడం ప్రారంభించాలి. ఈ ఫైబర్ మన జీర్ణవ్యవస్థకు కూడా అవసరం. ఆహారాన్ని జీర్ణవ్యవస్థలో ఉంచడానికి, ఆహారాన్ని జీర్ణం చేయడానికి, తద్వారా పోషకాలను గ్రహించడానికి మరియు వ్యర్థాలను సులభంగా బయటకు విసర్జింపడానికి సహాయపడుతుంది. మీ ఆహారంలో తృణధాన్యాలు, ఎండుద్రాక్ష, వోట్స్ మరియు చిక్కుళ్ళు తీసుకోవడం ద్వారా మలబద్దకాన్ని నివారించడంలో సహాయపడుతుంది.

ప్రూనే పండ్లు

ప్రూనే పండ్లు

కొద్దిగా పెద్ద ఎండుద్రాక్షలా కనిపించే ప్రూనే పండు మలబద్దకాన్ని నివారించడంలో సహాయపడుతుంది. అదే కారణంతో వీటిని సహజ మలబద్ధకం ఉపశమన పండ్లు అని కూడా పిలుస్తారు. మలవిసర్జన సాఫీగా జరగడానికి సహాయపడే గొప్ప లక్షణాలు వీటిలో ఉన్నాయి. దాంతో మలబద్ధక సమస్య నుండి జీర్ణవ్యవస్థకు ఉపశమనం కలిగిస్తుంది.

గానుగ బెల్లం

గానుగ బెల్లం

గానుగ బెల్లం అని పిలువబడే నీరు బెల్లం(నక్కిళ్లు) ఏడాది పొడవునా వినియోగించే ఉత్తమ ఆహారం లేదా సూపర్ ఫుడ్‌లో ఒకటి. ఇందులో చక్కెర సాంద్రత చాలా తక్కువగా ఉంటుంది మరియు ఎక్కువ మొత్తంలో వివిధ విటమిన్లు మరియు ఖనిజాలు, మెగ్నీషియం కలిగి ఉంటాయి., ఇవి ఎంజైమ్‌లను విచ్ఛిన్నం చేస్తాయి మరియు శరీరం యొక్క జీర్ణక్రియను సులభతరం చేస్తాయి. తద్వారా విసర్జనను సులభతరం చేస్తాయి.

English summary

kitchen ingredients to get rid of constipation with in two days

Extremely common and frustrating, constipation can affect anyone. It is estimated that about 20% of the people suffer through the silent problem. Often caused by constant lifestyle changes and the binge eating that sometimes follow, there are also times that people suffer from chronic constipation which has no particular cause associated with it but has people clutching the pill box for a remedy all the time. Before rushing to find the perfect medicine, try these tested home remedies to treat constipation which will help you give quick relief in no time.
Story first published:Tuesday, October 22, 2019, 16:13 [IST]
Desktop Bottom Promotion