For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రాయలసీమ రాగి ముద్దతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు..

|

రాగి ముద్ద అంటే రాయలసీమ ప్రజలు, కర్నాటక వాసులు అమితంగా ఇష్టపడతారు. రాగిముద్దలోకి చికెన్, లేదా చారు లేదా రసం వేసుకుని తింటే ఆ రుచి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది కేవలం రుచికరంగా ఉండటమే కాక.. దీన్ని తీసుకోవడం వల్ల మనకు అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను సైతం అందిస్తోంది. ఒకప్పుడు పై రెండు ప్రాంతాల వారికే దీని గురించే బాగా తెలుసు. ఇప్పుడిప్పుడే అన్ని ప్రాంతాల ప్రజలు రాగులు, రాగిముద్ద, రాగి జావా వైపు మొగ్గు చూపుతున్నారు. ఇక ఈ స్టోరీలో రాగుల వల్ల కలిగే హెల్త్ బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాం. రాగుల మంచి పోషకాహారం అందరికీ తెలిసిన విషయమే. ఇతర తృణధాన్యాలతో పోలిస్తే వీటి వాడకం ఇప్పటివరకూ చాలా తక్కువగానే ఉండేది. కానీ ఇప్పుడిప్పుడే వీటిపై చాలా మంది ఆసక్తి కనబరుస్తున్నారు. ఎందుకంటే వీటిలో ఐరన్, కాల్షియం నిల్వలు అధికంగా ఉన్నాయని తెలుసుకుంటున్నారు. అందుకే వీటిపై అవగాహన పెంచుకుని వీటిని ఏదో ఒక రూపంలో ఆహారంగా తీసుకునేందుకు తెగ మక్కువ చూపుతున్నారు. వీటిని సాధారణంగా మిల్లెట్ లేదా రాగులు అని పిలుస్తుంటారు. ఈ మిల్లెట్స్ దక్షిణ భారతదేశంలో విరివిగా లభిస్తాయి కర్నాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల్లోని చాలా గ్రామాలలో ఇదే ప్రధానమైన ఆహారం.

ఇతర ధాన్యాల కంటే బలమైనవి రాగులు..

శారీరక కష్టం చేసేవారికి ఆ రాగులు బాగా ఉపయోగపడతాయి. వారిని మరింత బలంగా తయారు చేస్తాయి. శారీరక కష్టం చేసే వారంతా రాగుల పిండితో తయారు చేసిన పదార్థాలను విరివిగా తీసుకుంటే వారికి ఎప్పటికప్పుడు నూతన శక్తి వస్తుంది. రాగులలో కాల్షియం, ఐరన్ తో పాటు ప్రోటీన్, ఫైబర్, మినరల్స్, అయోడిన్ వంటివి కూడా పుష్కలంగా లభిస్తాయి. దీంతో పాటు ఈ ధాన్యంలో బరువును కూడా తగ్గించే శాతం కూడా అధికంగా కలిగి ఉంటుంది. అన్నిటికంటే ప్రధానంగా అసంతృప్త కొవ్వు కలిగి ఉండటం వల్ల ఇది అత్యంత సులువుగా జీర్ణమవుతుంది.

బరువును నియంత్రిస్తుంది..

బరువును నియంత్రిస్తుంది..

రాగుల్లో ఉండే అమినోయాసిడ్స్, ట్రిఫ్టోఫాన్ అనే అమినో ఆమ్లం ఉండటం వల్ల ఇది ఆకలిని అమాంతం తగ్గిస్తుంది. అంతేకాదు బరువును నియంత్రణలో ఉంచేందుకు తప్పకుండా సహాయపడుతుంది. ఇందుకుగాను రాగి పిండితో తయారు చేసే ఆహారాన్ని తీసుకోవడం వల్ల జీర్ణక్రియను నిదానం చేస్తుంది. అందుకే అదనపు క్యాలరీలను గ్రహించకుండా చాలా దూరంగా ఉంచుతుంది. వీటిలో ఉండే ఫైబర్ వల్ల కూడా కడుపు పూర్తిగా నిండిన ఫీలింగ్ కలుగుతుంది. అంతేకాదు ఆహారాన్ని కూడా అధికంగా తీసుకోకుండా పూర్తిగా నియంత్రిస్తుంది.

ఎముకల్లో ఎనర్జీ పెంచేందుకు..

ఎముకల్లో ఎనర్జీ పెంచేందుకు..

రాగుల్లో కాల్షియం పుష్కలంగా ఉండటం వల్ల ఎముకల్లో ఎనర్జీ లెవెల్స్ కూడా బాగా పెరుగుతాయి. దీంతో ఎముకలు బాగా బలంగా తయారువుతాయి. అందుకే చాలా మంది పిల్లలకు చిన్నప్పటి నుండే వారి ఎదుగుదల సక్రమంగా ఉండేందుకు వీటిని ఉపయోగిస్తారు. అంతేకాదు ఇది అమితమైన పుష్టిని కలిగిస్తుంది. పెద్ద వయస్సు కలిగిన వారికి కూడా రాగుల్లోని కాల్షియం బాగా ఉపయోగపడుతుంది. మహిళల్లో సైతం ఎముకల పటుత్వానికి రాగులతో తయారు చేసిన రాగి మాల్ట్ ను తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఈ రాగి మాల్ట్ ధాతువుల నిర్మాణానికి సహాయపడుతుంది.

డయబెటిస్ ను కంట్రోల్ చేస్తుంది..

డయబెటిస్ ను కంట్రోల్ చేస్తుంది..

మధుమేహం (డయబెటిస్) వ్యాధి గ్రస్తులకు రాగులతో చేసిన ఆహార పదార్థాలు ఉదాహరణకు రాగుల గంజి, పాలల్లో కలిపిన రాగుల పానీయం వంటికి చక్కటి మందుగా పనిచేస్తుంది. ఇందులోని ఫింగర్ మిల్లెట్ యొక్క ఫైటో కెమికల్స్ జీర్ణప్రక్రియ తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది. దీంతో మధుమేహ వ్యాధి గ్రస్తుల్లో చక్కెర నిల్వ స్థాయిని తగ్గించేందుకు లేదా నియంత్రించేందుకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది.

అధిక కొవ్వుకు అడ్డుకట్ట..

అధిక కొవ్వుకు అడ్డుకట్ట..

రాగుల్లో అమైనో యాసిడ్ లెసిథిన్, మేథినోన్ కలిగి ఉంటాయి. ఇవి కాలేయంలోని అధిక కొవ్వు పెరగకుండా చేస్తాయి. అంతేకాదు అదనపు కొవ్వును తొలగించి కొవ్వును తగ్గించేందుకు బాగా ఉపయోగపడతాయి.

రక్తహీనత నివారణలోనూ..

రక్తహీనత నివారణలోనూ..

రాగుల్లో పుష్కలంగా ఉండే ఐరన్ అనే మూలకం రక్తహీనత నివారణలో సహాయపడుతుంది. రాగిని అధికంగా తీసుకోవడం వల్ల అనిమీయా (రక్తహీనత)కు అడ్డుకట్ట వేసేందుకు ఉపయోగపడుతుంది.

మైగ్రేన్ ను మాయం చేయడంలో సహాయం..

మైగ్రేన్ ను మాయం చేయడంలో సహాయం..

రాగులతో తయారు చేసిన పదార్థాలను తీసుకోవడం ద్వారా శరీరాన్ని సహజంగానే సడలించడంలో చాలా చక్కగా ఉపయోగపడుతుంది. వీటితో పాటు మనలో ఆందోళన, వ్యాకులత, నిద్రలేమి వంటి సమస్యలకు చెక్ చెప్పేందుకు ప్రయోజకరంగా ఉంటుంది. మరో ముఖ్య విషయమేమిటంటే మైగ్రేన్ సమస్యను నివారించడంలో ఇది బాగా పనిచేస్తుంది.

వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది..

వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది..

రాగి ముద్దను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల వ్యాది నిరోధక శక్తితో మీ శరీర బలాన్ని పెంచుతుంది. వీటిలో ఉండే ప్రోటీన్లు, మినరల్స్ మన శరీరాలను శారీరకంగా ఆరోగ్యంగా ఉంచటంలో సహాయపడతాయి.

మలబద్ధకాన్ని తగ్గిస్తుంది..

మలబద్ధకాన్ని తగ్గిస్తుంది..

రాగి ముద్దలో ఉండే ఫైబర్ కూడా మలబద్ధం నివారణకు బాగా సహాయం చేస్తుంది. అయితే పైల్స్, హెమరాయిడ్స్ కలిగిన వారు రాగి ముద్దను ఎక్కువగా తీసుకోకూడదు.

థైరాయిడ్ ను తగ్గించొచ్చు..

థైరాయిడ్ ను తగ్గించొచ్చు..

రాగి ముద్దలోని మరో హెల్త్ బెనిఫిట్, మీ థైరాయిడ్ లోని స్థితిగతులను తరచూ తెలియజేస్తుంది. ఈ థైరాయిడ్ సమస్యతో బాధపడే వారు రాగిముద్దను తినడం అత్యంత శ్రేయస్కరం.

బాలింతలకు తగినంత బలం..

బాలింతలకు తగినంత బలం..

బాలింతల్లో పాల ఉత్పత్తి, ఇతర మహిళల్లో పాల ఉత్పత్తి లేకపోవడం ఈ సమస్యలతో బాధపడుతున్న వారి శరీరానికి కూడా తగినంత బలాన్ని అందజేస్తుంది. రాగి జావా వంటిది తీసుకుంటే అది ఆరోగ్యాన్ని అందించే టానిక్ లాగా పని చేస్తుంది.

English summary

Many health benefits of Rayalaseema Raagi Ball..

The good nutrition of Ragula is a well-known fact. Their use is still relatively small compared to other cereals. But now there are many people interested in these. Because they are rich in iron and calcium reserves. This is why the tribe is keen to raise awareness of these and take them in some form as food. These are commonly called millet or rags.These millets are widely available in South India.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more