For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పురుషాంగం వెనుకకు ముడుచుకుపోవడానికి(ష్రింక్ అవ్వడానికి) కారణాలు, చికిత్స &ఈ సమస్య నియంత్రించే విధానం

పురుషాంగం వెనుకకు ముడుచుకుపోవడానికి(ష్రింక్ అవ్వడానికి) కారణాలు, చికిత్స మరియు ఈ సమస్య నియంత్రించే విధానం!!

|

లైంగిక జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషించే పురుషుల జననేంద్రియాలు కొన్ని సార్లు కుంచించుకొనిపోవు దౌర్భాగ్య సమస్య పురుషులను వెంటాడుతుంటుంది. అయితే ఇది కొన్ని కారణాల వల్ల పురుషాంగం కుంచించుకుపోయే సమస్య కనపడవచ్చు, దానిపై నిఘా ఉంచడం చాలా ముఖ్యం. పురుషాంగం క్షీణత లేదా పురుషాంగం కుచించుకుపోవడం అంటే పురుషుల జననేంద్రియ పరిమాణం ఇరుకైనదిగా లేదా చిన్నదిగా మారిపోతుంది. ఈ క్రమంలో పురుషుడి జననేంద్రియాల పొడవు కొన్ని అంగుళాలకు తగ్గిపోతుంది, ఇలా అవ్వడానికి అనేక కారణాల ఉండవచ్చు. జననేంద్రియ పరిమాణం లేదా చుట్టుకొలతలో సంకోచం. జననేంద్రియాల్లోని కణజాలంలో అధికంగా ప్రమాధం లేదా నష్టం జరగడం వల్ల ఇలా జరగవచ్చు.

ఇలా పురుషాంగం కుచించుకుపోవడం తాత్కాలికం. అయితే, కొన్ని సందర్భాల్లో ఇది శాశ్వతంగా ఉండవచ్చు. చాలా మంది యూరాలజిస్టుల(మూత్రాశయ నిపుణుల ప్రకారం ఈ రకమైన పురుషాంగం సంకోచం చాలా మంది పురుషులలో సాధారణం అని అంటున్నారు. పురుషుల జననేంద్రియాలు పరిమాణం, చుట్టుకొలతలో అంతర్గతంగా భిన్నంగా ఉండవచ్చు. సాధారణ పురుషాంగం పరిమాణం తప్పనిసరిగా పురుషాంగం యొక్క పరిమాణం అని అర్ధం కాదు. జననేంద్రియ పరిమాణంపై ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం, సగటు పురుషాంగం పరిమాణం 8.8 సెం.మీ (3.5 అంగుళాలు), సగటు నిటారుగా ఉన్న పురుషాంగం 12.9 మరియు 15 సెం.మీ (5-6 అంగుళాలు). సగటు నిటారుగా ఉన్న పురుషాంగం 12.3 సెం.మీ (4.75 అంగుళాలు)ఉండవచ్చు. జననేంద్రియ ప్రాంతానికి రక్తం ప్రసరించే విధానాన్ని బట్టి పురుషాంగం పరిమాణం ఆధారపడి ఉంటుంది. ఎక్కువ రక్త ప్రవాహం ఉంటే అప్పుడు పురుషాంగం యొక్క పరిమాణం పెద్దదిగా మరియు రక్త ప్రవాహం తక్కువగా ఉంటే పరిమాణం చిన్నదిగా ఉంటుంది. అధిక చలి వాతావరణం, ఆందోళన మరియు క్రీడా కార్యకలాపాల్లో పాల్గొనడం వల్ల పురుషాంగం సంకోచించబడవచ్చు. ఇవన్నీ రక్త ప్రసరణతో ముడిపడి ఉన్నాయి.

పురుషాంగం సంకోచాలలో రకాలు

పురుషాంగం సంకోచాలలో రకాలు

పురుషాంగం సంకోచం రెండు రకాలుగా విభజించబడింది.

తీవ్రంగా కుచించుకుపోవడం

తీవ్రంగా కుచించుకుపోవడం

తీవ్రమైన సంకోచం అనేది ఒక రకమైన పురుషాంగ సంకోచం, ఇది స్వల్ప కాలం మాత్రమే ఉంటుంది మరియు తాత్కాలికంగా ఉంటుంది.

దీర్ఘకాలిక సంకోచం

దీర్ఘకాలిక సంకోచం

ఈ రకమైన సంకోచం చాలా కాలం పాటు ఉంటుంది మరియు ఇది శాశ్వతంగా కూడా ఉంటుంది.

పురుషాంగం సంకోచానికి కారణాలు ఏమిటి?

పురుషాంగం సంకోచానికి కారణాలు ఏమిటి?

పురుషాంగ సంకోచ రకాలను బట్టి దాని కారణాలు కూడా విభజించబడ్డాయి.

తీవ్రంగా కుచించుకుపోవడం

తీవ్రంగా కుచించుకుపోవడం

మానసిక స్థితి

ఒక వ్యక్తి చాలా ఆందోళన చెందుతున్నప్పుడు లేదా ధైర్యం కోల్పోయినప్పుడు ఇలా జరుగుతుంది. ఈ సమయంలో జననేంద్రియాలకు సంబంధించిన అడ్రినలిన్ అనే హార్మోన్ శరీరంలో విడుదల అవుతుంది. ఈ హార్మోన్ వాసోకాన్స్ట్రిక్టర్‌గా పనిచేస్తుంది. దీనివల్ల పురుషాంగం కుంచించుకుపోతుంది.

ఉష్ణోగ్రత

ఉష్ణోగ్రత

పురుషాంగం కుంచించుకుపోవడానికి ఇది ప్రధాన కారణమని చెబుతారు. మీరు చాలా చల్లటి ఉష్ణోగ్రతలకు అలవాటుపడితే, రక్త నాళాలు సంకోచించగలవు మరియు శరీరంలో ప్రసరణ సరిగా జరగకపోవచ్చు. జననేంద్రియ మార్గంలో రక్త ప్రసరణ మరియు శరీర ఉష్ణోగ్రతను నిర్వహించడం చాలా అవసరం. శరీర ఉష్ణోగ్రత తక్కువగా ఉన్నప్పుడు లేదా శరీరం చాలా చల్లా ఉన్నప్పుడు ఏదైనా వాపు మరియు మంటను తగ్గిస్తుంది. అదేవిధంగా పురుషాంగం సంకోచం కూడా.

వ్యాయామం

వ్యాయామం

అధిక వ్యాయామం వల్ల జననేంద్రియ ప్రాంతానికి సరైన రక్త ప్రసరణ జరగదు. వ్యాయామం చేసేటప్పుడు కరిగిన అధిక ఆక్సిజన్ జననేంద్రియ మార్గంలోకి సరిగా ప్రసరించకపోవచ్చు మరియు ఊపిరితిత్తులకు రక్త ప్రసరణ ఎక్కువగా పెరగవచ్చు. దీనివల్ల పురుషాంగం కుచుంచుకునిపోయేలా చేస్తుంది.

దీర్ఘ సంకోచం

దీర్ఘ సంకోచం

సాధారణం కాని లైంగిక చర్య

శరీరంలోని ఏ భాగం అయినా అది గుండె అయినా, జననేంద్రియాలే అయినా పూర్తి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మీరు క్రమం తప్పకుండా పనిచేయడం అత్యవసరం. మీరు సాధారణ లైంగిక చర్యలో పాల్గొనకపోతే పురుషాంగం యొక్క పరిమాణం తగ్గిపోతుంది. ఇది మృదువైన కండరాలు, ఎలాస్టిన్ మరియు కొన్ని ఇతర కణజాలాలను ప్రభావితం చేస్తుంది. ఇది పురుషాంగం యొక్క పరిమాణాన్ని మరియు అంగస్తంభనను ప్రభావితం చేస్తుంది.

వ్యాధి మరియు చికిత్స

వ్యాధి మరియు చికిత్స

కొన్ని రోగాలు మరియు చికిత్సల ద్వారా పురుషాంగం పరిమాణం తగ్గవచ్చు. ప్రోస్టేట్ క్యాన్సర్‌కు రాడికల్ ప్రోస్టేటెక్టోమీకి ప్రోస్టేట్ తొలగించడానికి శస్త్రచికిత్స అవసరం అవుతుంది. దీని వల్ల పురుషాంగో సంకోచం ఏర్పడవచ్చు. అధ్యయన నివేదికల ప్రకారం ప్రోస్టేట్ శస్త్రచికిత్స సమయంలో 70% మంది పురుషులు సాధారణ, మితమైన మరియు తీవ్రమైన పురుషాంగ సంకోచాలను కలిగి ఉంటారు. అసాధారణ కండరాల సంకోచం పురుషాంగాన్ని శరీరంలోకి లాగడం జరుగుతుందని తెలియజేయడం జరిగింది.

పురుషాంగం సంకోచానికి మరొక కారణం పురుషాంగంలో తీవ్రమైన వక్రత కూడాకారణం కావచ్చు. ఫలితంగా, లైంగిక చర్యలో పాల్గొనడం కష్టమవుతుంది. ఈ వ్యాధితో పురుషాంగం పరిమాణం తగ్గుతుంది. పురుషాంగం పరిమాణం తగ్గడానికి మరో ముఖ్యమైన కారణం వృద్ధాప్యం మరియు ఊబకాయం. వయసు పెరిగే కొద్దీ పురుషాంగం మరియు వృషణ పరిమాణం చిన్నవి అవుతాయి. పురుషాంగానికి రక్తప్రసరణ తగ్గడం రక్త నాళాలలో ఉత్పత్తి అయ్యే కొవ్వు కారణంగా ఉంటుంది. ఇది అంగస్తంభన కణజాలంలో ఉండే స్పాంజ్ వంటి ట్యూబ్ యొక్క కండరాల కణాలను దెబ్బతీస్తుంది. ఇది కాకుండా, పురుషాంగం సంకోచానికి స్థూలకాయం ఒక ప్రధాన కారణం. ఉదరం మీద బరువు కారణంగా పురుషాంగం యొక్క పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది. పొత్తికడుపులో కొవ్వు పేరుకుపోవడం వల్ల పురుషాంగం షాఫ్ట్‌లు మూసివేయబడుతాయి. యాంఫేటమిన్ మరియు డెక్స్ట్రోంఫేటమిన్, ఉప్పు, యాంటీ-డిప్రెసెంట్స్ మరియు యాంటిసైకోటిక్స్ వంటి కొన్ని చికిత్సలు పురుషాంగం పరిమాణం తగ్గడానికి లేదా కుచించుకుపోవడానికి కారణం కావచ్చు. ప్రోస్టేట్ విస్తరణను తగ్గించడంలో సహాయపడే ఒక ఔషధం పురుషాంగ సంకోచానికి కారణమవుతుంది. మీరు ఎక్కువసేపు నిరంతరం పొగత్రాగితే, అప్పుడు పురుషాంగం యొక్క పరిమాణం తగ్గిపోవచ్చు. సిగరెట్లలోని రసాయనాలు పురుషాంగంలోని రక్త నాళాలను దెబ్బతీస్తాయి మరియు పురుషాంగానికి రక్త ప్రవాహాన్ని నిరోధించగలవు మరియు అది విస్తరించకుండా నిరోధించగలవు.

వైద్యుడిని ఎప్పుడు సందర్శించాలి?

వైద్యుడిని ఎప్పుడు సందర్శించాలి?

మీరు పురుషాంగంలో వాపు మరియు నొప్పిని గమనించినట్లయితే మీరు వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఇది పురుషాంగం కుచుంచుకుపోయే లక్షణం కావచ్చు. పురుషాంగం సంకోచానికి ఉణ్న చికిత్సలు

ప్లేట్‌లెట్ రిచ్ ప్లాస్మా (పిఆర్‌పి) థెరపీ

ప్లేట్‌లెట్ రిచ్ ప్లాస్మా (పిఆర్‌పి) థెరపీ

శరీర కణజాలాలను పునరుజ్జీవింపచేయడానికి మరియు పునర్నిర్మించడానికి ఇది చాలా సురక్షితమైన మరియు ప్రభావవంతమైన మార్గం అని అంటారు. ఈ థెరపీకి ఏ శస్త్రచికిత్స లేదా గాయం అయ్యే ప్రమాదం ఉండదు. ఇది చాలా సహజమైన మరియు శీఘ్ర ప్రభావ పద్ధతి. ఇది చాలా ప్రొఫెషనల్ అథ్లెట్లకు సిఫార్సు చేయబడింది. ఎందుకంటే ఈ అథ్లెట్ల జీవనశైలి తరచుగా వ్యాయామంలో కోల్పోతుంది.

సర్జరీ

సర్జరీ

పురుషాంగం సంకోచించినట్లయితే అప్పుడు శస్త్రచికిత్స ద్వారా ఈ ప్రాంతానికి రక్త ప్రసరణ పెంచవచ్చు. శస్త్రచికిత్స మరియు అల్ట్రాసౌండ్ టెక్నాలజీతో గాయపడిన కణజాలాన్ని తొలగించడం జరుగుతుంది. కానీ పరిమాణం చిన్నదిగా ఉంటుంది. అయితే ఇది లైంగిక కార్యకలాపాలను మెరుగుపరుస్తుంది.

పురుషాంగం సంకోచాన్ని నివారించడానికి ఏమి చేయాలి

పురుషాంగం సంకోచాన్ని నివారించడానికి ఏమి చేయాలి

అనుసరించాల్సిన మొదటి దశ జీవనశైలిలో మార్పులు. మీరు ధూమపానం మానేసి ఆరోగ్యకరమైన ఆహారంను తినాలి.

శారీరకంగా చురుకుగా ఉండాలి.

ధూమపానం మానుకోండి.

అధికంగా మద్యం సేవించడం విస్మరించాలి.

జలుబు మరియు ఒత్తిడిని అర్థం చేసుకోవాలి. అథ్లెట్లలో తాత్కాలిక సంకోచాలు సంభవించవచ్చు.

కెగెల్ వ్యాయామం వంటి వ్యాయామాలు చేయాలి.

లైంగికంగా చురుకుగా ఉండండి మరియు సురక్షితమైన సెక్స్ సాధన చేయండి.

English summary

Men Private part Shrinkage: Causes, Treatment And Prevention

Penile atrophy or penis shrinkage is the decrease in the size of the male genitalia. The length of one's penis can decrease by up to an inch or so due to various reasons. The size of the male genitalia varies according to the genetic and hereditary factors. It is of two types, acute and chronic and is caused by ageing, obesity and smoking.
Story first published:Monday, October 14, 2019, 18:39 [IST]
Desktop Bottom Promotion