For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తిన్నవెంటనే కడుపునొప్పి...కారణాలు, లక్షణాలు, చికిత్స మరియు నివారణ

తిన్నవెంటనే కడుపునొప్పి...కారణాలు, లక్షణాలు, చికిత్స మరియు నివారణ

|

పొట్ట సమస్యలు వివిధ రకాలుగా ఉంటాయి. వాటి లక్షణాలను బట్టి కడుపునొప్పికి గల కారణాలను తెలుసుకోవచ్చు. వివిధ రకాల కడపునొప్పిలో ఒకటి ఇరిటబుల్‌ బవెల్‌ సిండ్రోమ్‌ (ఐబీఎస్‌). 25 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్కుల్లో కనిపించే ఈ వ్యాధి స్త్రీలలోనే ఎక్కువ. కడుపులో కలిగే భిన్నమైన మార్పులతో ఇబ్బంది పెట్టే ఈ సమస్య ప్రమాదకరమైనది కాకపోయినా దైనందిన జీవితాన్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. దీర్ఘకాలంపాటు వేధిస్తుంది. ఈ సమస్య వల్ల కొందరు ఉద్యోగ వేళలు మార్చుకోవటం లేదా ఇంటి నుంచి పని చేయటం, అరుదుగా కొందరు పూర్తిగా ఉద్యోగమే మానుకుని ఇంటికే పరిమితమైపోవటం చేస్తూ ఉంటారు. ఐ.బి.ఎ్‌సలో కూడా రకాలున్నాయి. కొందరికి ఐ.బి.ఎ్‌సతోపాటు మలబద్ధకం, ఐ.బి.ఎ్‌సతోపాటు డయేరియా, ఇంకొందరికి రెండూ కలిసి ఉంటాయి.

దీని లక్షణాలు భోజనం తిన్న వెంటనే టాయిలెట్ కు వెళ్ళాల్సి వస్తుంది. కొన్ని సార్లు మలబద్దకం, విరేచనాలు ఒకదాని తర్వాత మరొకటి కనిపిస్తుంటాయి. అలాగే కొంత మందిలో మలబద్దకంతో పాటు మలంలో జిగురు కూడా కనిపిస్తుంది. అలాగే చాలా సంధర్బాల్లో నొప్పి ఉండి మెలిపెట్టినట్లుగా లక్షణాలు కనబడుతాయి.

ఇంకా కొంత మందిలో ఈ లక్షణాలతో పాటు తేన్పులు, కడుపు ఉబ్బరం, వికారం, తలనొప్పి, ఆందోళన వంటివి ఉంటాయి. ఈ లక్షణాలన్నింటిని బట్టి ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ గా పిలుస్తారు. అయితే కొన్నింటికి వాస్తవమైన కారణాలు స్పష్టంగా ఉండవు. అయితే కొంత మందిలో మాత్రం ఈ క్రింది లక్షణాలను స్పష్టంగా తెలుపుతాయి.

ఐబీఎస్ లక్షణాలు :

ఐబీఎస్ లక్షణాలు :

  • ఐబీఎస్ లక్షణాలు ఒక్కొక్క వ్యక్తిలో ఒక్కో విధంగా ఉంటాయి.
  • రోజు మొత్తంలో ఎక్కువ సార్లు విరేచనం కావటం లేదా మలబద్ధకంగా ఉండటం
  • మలం కూడా పల్చగా, గట్టిగా, మెత్తగా లేదా నీళ్లలా....ఇలా మారుతూ ఉంటుంది.
  • కొన్నిసార్లు మలబద్ధకం వేధిస్తే, కొన్నిసార్లు విరేచనాలు విసిగిస్తాయి.
  • పొట్టలో నొప్పి, శబ్దాలు ఉంటాయి.
  • జీర్ణవ్యవస్థలో తరచూ వచ్చే ఇన్ఫెక్షన్లు
  • మలబద్దకం, మలం గట్టిగా లేదా కష్టంగా ఉండటం
  • మలవిర్జన సమయంలో రక్త పడటం, లేదా మ్యూకస్ పడటం..
  • ఫుడ్ అలర్జీలు
  • తిన్న గంటలోపు కడుపుబ్బరం
  • దీర్ఘకాల జ్వరాలు
  • మానసిక ఆందోళన
  • కుంగుబాటు
  • ఎక్సెస్ గ్యాస్
  • పొట్ట ఉదరంలో వాపు లేదా ఉబ్బుకుని ఉండటం
  • ఎక్కువరోజులు యాంటీబయాటిక్స్‌వాడటం
  • జన్యుపరమైన కారణలు
  • ఫంగస్ లేదా ఈస్ట్ ఇన్ఫెక్షన్
  • నోటి దుర్వాసన లేదా శరీర దుర్గందం
  • చిన్న ప్రేగులో బ్యాక్టీరియా ఎక్కువ సంఖ్యలో ఉండటం వంటివి ఐబిఎస్ కు దోహదం చేస్తాయి.
  • ఉదయం లేవగానే త్వరగా విసర్జనకు వెళ్లాల్సి రావడం, ఇంటి నుంచి బయటకు వెళ్లే ముందు టాయిలెట్‌కు వెళ్లాల్సి వస్తుంది.
  • భోజనం చేయగానే టాయిలెట్‌కు వెళ్లాల్సి రావడం.
  • కారణాలు :

    కారణాలు :

    అధ్యయనాల ద్వారా శరీరంలో చోటు చేసుకునే కొన్ని మార్పుల వల్ల ఐ.బి.ఎస్‌ సమస్య తలెత్తుతుందని తేలింది. పెద్దపేగు సున్నితంగా తయారైనా, స్వల్ప ప్రేరణలకే ఎక్కువగా స్పందిస్తున్నా ఐ.బి.ఎస్‌ మొదలవుతుంది. కొన్ని రకాల ఫుడ్‌ అలర్జీలు, ఐరన్‌ మందులు, కొన్ని యాంటాసిడ్‌లు, ఇన్‌ఫెక్షన్ల వల్ల కూడా ఐ.బి.ఎస్‌ తలెత్తవచ్చు.

    సాధారణంగా ఈ సమస్య పురుషుల్లో కంటే మహిళల్లో మూడువంతులు

    సాధారణంగా ఈ సమస్య పురుషుల్లో కంటే మహిళల్లో మూడువంతులు

    సాధారణంగా ఈ సమస్య పురుషుల్లో కంటే మహిళల్లో మూడువంతులు ఎక్కువగా కనబడుతుంది. కొంత మంది ఈ లక్షణాలతో పాటు నొప్పిలేకుండా కూడా ఐబీస్ వస్తుంది. అలాంటి పరిస్థితిలో వారు అర్జెంట్ గా టాయిలెట్ కు వెళ్లాల్సి వస్తుంటుంది. నిద్రలేగుస్తూనే టాయిలెట్ కు పరుగులుపట్టాల్సి వస్తుంది. ఐబీఎస్ క్యాన్సర్ కారకం కాదు, ప్రాణాంతకమూ కాదు. కానీ చాలా ఇబ్బందికి గురిచేస్తుంది.

    వ్యాధి నిర్ధారణ

    వ్యాధి నిర్ధారణ

    ఈ వ్యాధి నిర్ధారణకు నిర్ధిష్టమైన పరీక్ష అంటూ ఏదీ లేదు. కాకపోతే రోగి లక్షణాలను బట్టి, రోగి కడుపులో ఏవైనా పరాన్న జీవులు ఉన్నాయా లేదా చిన్న పేగుల్లో బ్యాక్టీరియల్ ఇన్లెక్షన్స్ ఏవైనా ఉన్నాయ అనే విఅంశాల ఆధారంగా దీన్ని చాలా నిశిత పరిశీలనతో వ్యాధి నిర్థారణ చేస్తారు. దాంతో పాటు మల పరీక్ష, రక్తపరీక్ష ఆల్ట్రాసౌండ్ స్కానింగ్ అబ్డామిన్ , ఎండోస్కోపి, హైడ్రో.ెన్ బ్రీత్ టెస్ట్ వంటివి పరీక్షణ ఈ వ్యాధి నిర్ధారణకు తోడ్పడతాయి.

    వ్యాధి నివారణ :

    వ్యాధి నివారణ :

    • రెగ్యులర్ డై లో పీచుపదార్థాలు ఎక్కవ తీసుకోవాలి
    • ఒత్తిడి తగ్గించుకోవాలి
    • పొగతాడం, మద్యపానం అలవాట్లను పూర్తిగా మానుకోవాల.
    • రోజుకు ఎనిపిమి గంటలు నిద్రపోవాలి
    • చికిత్స

      చికిత్స

      ఇరిటబుల్‌ బవెల్‌ సిండ్రోమ్‌కు అత్యంత శక్తిమంతమైన మందులు అందుబాటులో ఉన్నాయి. కారణం ఏదైనప్పటికీ అంటే ఉదాహరణకు జీర్ణవ్యవస్థలో ఉండే ఇన్ఫెక్షన్లూ, దీర్ఘకాలంగా మందులు వాడటం వల్ల కలిగే దుష్ప్రభావం వల్ల జీర్ణవ్యవస్థలో వచ్చే మార్పులు, ఒత్తిడి, ఆందోళన వల్ల ఐబీఎస్‌ వస్తే దాన్నికాన్‌స్టిట్యూషనల్‌ సిమిలియమ్‌ ద్వారా చికిత్స చేసి, సమస్యను చాలావరకు శాశ్వతంగా పరిష్కరించవచ్చు.

      పరిష్కారం:

      పరిష్కారం:

      • సాధారణంగా ఆహార శైలి, అలవాట్లలో మార్పుల వల్ల ఐ.బి.ఎస్‌ రావొచ్చు.
      • ఐ.బి.ఎ్‌సను నియంత్రించాలంటే కెఫీన్‌ ఉండే కాఫీ, టీలు, సోడాలు మానేయాలి.
      • ఆహార పదార్థాల్లో ఎక్కువ మసాలాలు, అతి కారంగా ఉండే పదార్థాలు తీసుకోకూడదు
      • చల్లని లేదా అతి వేడిగా ఉండే పదార్థాలు తీసుకోకూడదు
      • పీచు ఎక్కువగా ఉండే పళ్లు, కూరగాయలు, నట్స్‌, ధాన్యాలు తీసుకోవాలి.
      • రోజుకి 8 గ్లాసుల నీళ్లు తప్పనిసరిగా తాగాలి.
      • ఒత్తిడిని తగ్గించే వ్యాయామాలు చేయాలి.
      • పాల ఉత్పత్తుల వాడకం తగ్గించాలి.
      • తక్కువ పరిమాణంలో ఎక్కువ సార్లు ఆహారం తీసుకోవాలి.
      • తినే ఆహార పదార్థాల ద్వారా ఇన్‌ఫెక్షన్లు సోకకుండా శుభ్రమైన ఆహారం తీసుకోవాలి. బయటి ఆహారం తీసుకోవడం మానేయాలి.
      • వ్యక్తిగత శుభ్రత పాటించాలి. టాయిలెట్ వెళ్లి వచ్చాక చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.

English summary

Reasons You Might Have Stomach Pain After Eating, Symptoms and Treatment

Irritable bowel syndrome (IBS), also called spastic colon and mucous colitis, is a gastrointestinal disorder. In this condition there is abdominal cramping or pain, episodes of diarrhea followed by constipation, bloating, gas, mucus in the stool, nausea, headache, depression, and fatigue.
Story first published:Friday, September 20, 2019, 13:35 [IST]
Desktop Bottom Promotion