Latest Updates
-
కేరళ స్టైల్ రొయ్యల వేపుడు.. మసాలా ఇలా దట్టించారంటే కారం నషాళానికి అంటాల్సిందే.! -
గజకేసరి రాజయోగంతో కనక వర్షం.. ఈ మూడు రాశుల వారికి తిరుగే లేదు.! -
ఉదయం నిద్ర లేవగానే షుగర్ ఉన్నవారిని వేధించే అతిపెద్ద ప్రశ్న..ఈరోజు టిఫిన్ ఏం తినాలి?. -
ఒకే రాశిలో సూర్య కేతువులు.. వీరికి ఇతరుల విషయాల్లో జోక్యం వద్దు.. లేదంటే.! -
విడివిడిగా కాదు.. ఒకే గిన్నెలో క్రీమీ ముద్దపప్పు ఆవకాయ అన్నం..స్వర్గానికి నిచ్చెన వేసే అద్భుతమైన రెసిపీ! -
హైదరాబాద్ నుంచి ఒక్క రోజులో విజిట్ చేసే బెస్ట్ టూరిస్ట్ స్పాట్స్.. ఒక్కో వీకెండ్కి ఒక్కో ఎక్స్పీరియన్స్ -
బొటనవేలుపై ఈ గుర్తు ఉన్నోళ్లు ప్రపంచాన్ని జయించగలరు! -
ముక్కల్లేకుండా బిర్యానీ మజా.. అచ్చం రెస్టారెంట్ స్టైల్ కుష్కా ఇంట్లోనే ఈజీగా ఇలా చేయండి! -
అరటిపండు తినడానికి సరైన సమయం ఏది? ఈ నిజాలు మీరు తెలుసుకోవాల్సిందే! -
నెల రోజులు పైనే నిల్వ..చికెన్ కారం పొడి ఇలా చేసి పెట్టుకుంటే టిఫిన్స్, అన్నంలోకి అదుర్స్!
Alert:కరోనా నుండి కోలుకున్నాక టూత్ బ్రష్ మార్చడాన్ని మరచిపోకండి... లేదంటే కరోనా నుండి తప్పించుకోవడం కష్టమే...
కోవిద్ నుండి కోలుకున్నాక టూత్ బ్రష్ ను కచ్చితంగా మార్చాలి.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా చాలా మంది కరోనా బారిన పడుతున్నారు. అయితే మంచి విషయమేమిటంటే.. దాదాపు 90 శాతం మంది ఈ కోవిద్-19 మహమ్మారి విజయవంతంగా కోలుకుంటున్నారు.

అయితే కరోనా నుండి కోలుకున్నామని ఆనందపడే వారికి నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. ముందుగా ఉదయాన్నే లేచి పళ్లను శుభ్రం చేసుకోవడానికి ఉపయోగించే టూత్ బ్రష్ ను తప్పనిసరిగా మార్చుకోవాలని చెబుతున్నారు.

ఒకవేళ మీరు కోవిద్ నుండి కోలుకున్నాక టూత్ బ్రష్ మార్చడం మరచిపోతే మాత్రం మీరు మళ్లీ ఆ వ్యాధిన బారిన పడే ప్రమాదముందని చెబుతున్నారు. దీనికి సంబంధించిన అధ్యయనాలలో పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

అవి మార్చకపోతే..
కరోనా మహమ్మారి నుండి విజయవంతంగా కోలుకున్న వారు వెంటనే టూత్ బ్రష్ మార్చుకోవాలని దంతవైద్యులు సూచిస్తున్నారు. ఒకవేళ మీరు అలా చేయకపోతే.. కరోనా మళ్లీ సోకే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మీ టూత్ బ్రష్ వల్ల మీకు తిరిగి కరోనా సోకడమే కాదు.. మీ కుటుంబ సభ్యులు కూడా దీంతో ఇబ్బంది పడొచ్చు. ఎందుకంటే సాధారణంగా ఫ్యామిలీలో ఉండే వారు ఒకటే వాష్ రూమ్ ను ఉపయోగిస్తుంటారు.

టంగ్ క్లీనర్ కూడా..
దేశంలోని ప్రతిష్టాత్మక మీడియా సైట్లో ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం, న్యూఢిల్లీలోని లేడీ హార్డింగ్ మెడికల్ కాలేజీకి చెందిన హెచ్ఓడి డెంటల్ సర్జన్ డాక్టర్ ప్రవీణ్ మెహ్రా మాట్లాడుతూ కరోనా నుండి కోలుకున్నాక టూత్ బ్రష్ లు మాత్రమే కాకుండా టంగ్ క్లీనర్లను కూడా మార్చాలని చెప్పారు.

ఎన్నిరోజుల తర్వాత మార్చాలి..
నిపుణుల అభిప్రాయం ప్రకారం, సాధారణంగా మీ టూత్ బ్రష్ మరియు టంగ్ క్లీనర్ ను 20 రోజుల తర్వాత ఒకసారి మార్చాలి. అప్పుడే మీ నోట్లో దాగి ఉన్న వైరస్లు లేదా బ్యాక్టిరీయాను తొలగించేందుకు దోహదపడుతుంది. ఒకవేళ మీకు ఇలా మార్చడం కుదరడానికి కష్టంగా అనిపిస్తే.. మీరు మీ నోట్లో ఉప్పు నీటితో పుకిలించడం ఉత్తమ మార్గం. దీని కోసం మీరు అనేక రకాల మౌత్ వాష్ ఉత్పత్తులు మార్కెట్లో సులభంగా లభిస్తాయి.

బ్రెజిల్ అధ్యయనం..
ఈ ఏడాది జనవరిలో బ్రెజిల్ లోని పరిశోధకులు కోవిద్-19 మహమ్మారి నేపథ్యంలో నోటి పరిశుభ్రత ప్రభావాన్ని అర్థం చేసుకోవడానికి ఒక అధ్యయనం చేశారు. టూత్ బ్రష్ లను క్రిమి సంహారం చేయడం నోటి పరిశుభ్రతలో భాగంగా ఉండాలని అధ్యయనం సిఫార్సు చేసింది. ఎందుకంటే ఇది ఇన్ఫెక్షన్లు తగ్గించడంలో సహాయపడుతుంది.

సులభంగా వ్యాప్తి..
ఈ అధ్యయనం జర్నల్ ఆఫ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ లో ప్రచురించబడింది. ఇందులో టూత్ బ్రష్ లు ‘సూక్ష్మజీవుల జలాశయాలుగా పని చేస్తాయి'. ఇది వ్యాధి సోకిన వ్యక్తి నుండి ఇతరులకు సులభంగా వ్యాప్తి చెందుతుంది. కాబట్టి మీరు కోవిద్-19 రోగులు కరోనా నుండి భద్రత కోసం టూత్ బ్రష్ మరియు టంగ్ క్లీనర్ ను ఆరబెట్టడం మరియు శానిటైజ్ చేయడం వంటివి చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

మళ్లీ కరోనా రాకుండా..
కరోనా మహమ్మారి భారతదేశంలో భయంకరంగా వ్యాపిస్తోంది. ఒక వ్యక్తి కరోనా నుండి కోలుకున్న తర్వాత తిరిగి మళ్లీ ఆ వ్యాధి బారిన పడే అవకాశం ఉందని చాలా అధ్యయనాలు రుజువు చేశాయి. మీరు టీకా వేసుకున్నప్పటికీ.. జాగ్రత్తగా లేకుంటే మళ్లీ దాని బారిన పడే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడ్డారు. ఈ వ్యాధి మరోసారి సోకకుండా కరోనా బాధితులు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అందులో ముఖ్యమైనది టూత్ బ్రష్ మరియు టంగ్ క్లీనర్ మార్చడం.
చూశారుగా.. టూత్ బ్రష్, టంగ్ క్లీనర్ మార్చకపోతే ఎంత ప్రమాదం ఉందో.. కాబట్టి ఇప్పటి నుండి మీరు టూత్ బ్రష్ విధిగా మార్చాలని గుర్తు పెట్టుకోండి.



Click it and Unblock the Notifications