Latest Updates
-
నోరూరించే వంకాయ పచ్చి కారం..వేడి అన్నంతో తింటే అద్భుతో అద్భుత అద్భుతసహ్య.. -
ఎముకలను ఉక్కులా మార్చే రాగి నువ్వుల లడ్డూ..15 నిమిషాల్లో ఎలా చేసుకోవాలంటే.. -
వృషభం, మిథునం, సింహ రాశుల వారికి ఈ వారం ధన యోగం.. మీ అదృష్టం ఎలా ఉంది? - 17 నుండి 23 మే 2026 వరకు -
వృషభం, సింహం, ధనస్సు రాశుల వారికి రాజయోగం.. ఆదివారం మీ అదృష్టం ఎలా ఉంది? - ఆదివారం, 17 మే 2026 -
Chilkur Balaji Temple: వీసా మాఫియా గుడి.. చిలుకూరు బాలాజీ ఆలయంపై ట్రంప్ పార్టీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు -
సండే స్పెషల్ గా తమిళనాడు ఫేమస్ ముట్టా ఇడ్లీ..10 నిమిషాల్లో ఈ హై ప్రొటీన్ బ్రేక్ ఫాస్ట్ ఎలా చేయాలంటే.. -
Women Alert: ఫంక్షన్ ఉందని పీరియడ్స్ ట్యాబ్లెట్ వేసుకున్న మహిళ మృతి..నిపుణులు ఏమంటున్నారంటే? -
ఆరోగ్యానికి సంజీవని,రుచిలో అమోఘం..మునగాకు మామిడికాయ పప్పు ఎలా చేసుకోవాలంటే.. -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ డిన్నర్..చియా రైతా చేయండిలా..కడుపుకు హాయిగా, క్యాలరీలు తక్కువగా.. -
Best Snacks For Fatty Liver: ఆకలి తీరాలి, లివర్ సేఫ్ గా ఉండాలా?..అయితే ఈ స్నాక్స్ తినండి!
Yoga For Eyes: కంటి యోగా.. చూపు మెరుగవుతుంది, ఇంకా ఎన్నో లాభాలు
యోగా చేయడం వల్ల కంటి చూపు కూడా మెరుగుపడుతుంది. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడం ద్వారా ఒత్తిడిని తగ్గిస్తుంది. కొన్ని యోగాసనాలు కంటి చూపను మెరుగుపరుస్తాయి.
యోగా ఆరోగ్య ప్రదాయిని. నిత్యం యోగా చేసే వారిలో ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవు. శారీరకంగా, మానసికంగా యోగా ప్రయోజనం చేకూరుస్తుంది. అందుకే ఈమధ్యకాలంలో యోగా చేసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అలాగే యోగా చేయడానికి ఎలాంటి పరికరాలు అవసరం లేదు. కొంత కాలం శిక్షణ తీసుకుంటే ఇంటి పట్టునే ఉంటూ యోగా చేసేసుకోవచ్చు. అలాగే యోగాలో ఒక్కో శరీర భాగానికి ప్రత్యేకమైన యోగాసనాలు ఉంటాయి.

యోగా చేయడం వల్ల కంటి చూపు కూడా మెరుగుపడుతుంది. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడం ద్వారా ఒత్తిడిని తగ్గిస్తుంది. కొన్ని యోగాసనాలు కంటి చూపను మెరుగుపరుస్తాయి. కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సహాయపడతాయి. కంటి యోగా చేయడం వల్ల ఇంకా ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

గ్లకోమాను పరిష్కరిస్తుంది:
కంటి యోగాను సాధన చేయడం ద్వారా గ్లకోమా పరిష్కరించబడుతుంది. కంటిలోని ఇంట్రాకోక్యులర్ ప్రెజర్ ను తగ్గిస్తుంది. దీని వల్ల ఆప్టిక్ నాడిని దెబ్బతీసే గ్లకోమా అనే వ్యాధి క్రమంగా తగ్గుముఖం పడుతుంది. అయితే కంటి యోగా వల్ల గ్లకోమా తగ్గుతుందని ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.

కంటిశుక్లం శస్త్రచికిత్స తర్వాత:
కంటి శుక్లం శస్త్ర చికిత్స తర్వాత కంటి యోగా చేయడం వల్ల కంటి బలాన్ని పునరుద్ధరిస్తుంది. కంటి శుక్లం తొలగించిన వెంటనే యోగా చేయడం మంచిది కాదు. కంటి శుక్లం సర్జరీ సమయంలో చొప్పించిన కృత్రిమ లెన్స్ ను నయం చేయడానికి, సర్దుబాటు చేయడానికి కంటికి సమయం కావాలి. కంటి శుక్లం శస్త్రచికిత్స తర్వాత మీరు ఏదైనా రకమైన కంటి వ్యాయామం లేదా సాధారణంగా వ్యాయామం చేయడానికి ముందు వైద్యులను సంప్రదించాలి.

కంటి ఒత్తిడి కోసం:
కంటి ఒత్తిడి లక్షణాలను నివారించడానికి, ఉపశమనానికి కంటి యోగా పని చేస్తుంది. 60 మంది నర్సింగ్ విద్యార్థులపై జరిపిన అధ్యయనంలో, 8 వారాల పాటు కంటి యోగా చేయడం వల్ల కళ్లకు అలసట అనిపించడం తగ్గిందని తేలింది.

కంటి చూపును మెరుగుపరిచే, కంటి అలసటను తగ్గించే కొన్ని వ్యాయామాలు
ఫోకస్ షిఫ్టింగ్:
ఈ వ్యాయామం వల్ల కంటి కండరాలకు శిక్షణ ఇచ్చినట్లవుతుంది. అదే సమయంలో మీ దృష్టి కేంద్రీకరించే సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. ముందుగా పద్మాసనంలో లేదా కూర్చూలో కూర్చోవాలి. థంబ్స్ అప్ భంగిమలో చేతిని పట్టుకోవాలి. చేతిని పైకి లేపి పట్టుకుని బొటన వేలిపై దృష్టి కేంద్రీకరించాలి. ఇప్పుడు చేతిని కుడివైపు, ఎడమ వైపు కదుపుతూ ఉండాలి. ఈ వ్యాయామం చేస్తున్నప్పుడు మెడ, గడ్డం కదలకుండా కేవలం కళ్ల మాత్రమే అటు ఇటు కదుపుతూ ఉండాలి.
కళ్లను తిప్పడం:
పద్మాసనంలో నిటారుగా కూర్చోవాలి. లేదంటే కూర్చీలో నిటారుగా కూర్చోవాలి. తలను స్ట్రయిట్ గా ఉంచాలి. తల కదపకుండా మొదట పైకప్పు చూడాలి. తర్వాత కుడివైపుకు కళ్లను తిప్పాలి. అక్కడి నుండి కింది వైపుకు, తర్వాత ఎడమ వైపుకు, తిరిగి మళ్లీ పైకి చూడాలి. ఇలా కళ్లను తిప్పుతూ ఉండాలి. 9 సార్లు ఇలా చేసిన తర్వాత. ఇప్పుడు అపసవ్య దిశలో మరో 9 సార్లు తిప్పాలి. దీని వల్ల కళ్లకు చక్కని వ్యాయామం చేసినట్లు అవుతుంది.
పామింగ్:
ఈ వ్యాయామంలో రెండు చేతులతో కళ్లను మూసుకోవాలి. రెండు చేతులను కళ్లను తాకకుండా నుదురుపై, చెంపలపై ఉంచాలి. ఇప్పుడు చీకటిగా ఉన్నప్పుడు కళ్లను తెరవాలి. ఇలా కొన్ని నిమిషాల పాటు చేయాలి.

కంటి ఆరోగ్యానికి చిట్కాలు:
సమస్య వచ్చినప్పుడు బాధపడేకంటే ఆ సమస్య రాకుండా జాగ్రత్త పడటం చాలా ముఖ్యం. సర్వేంద్రియానాం నేత్రం ప్రదానం అంటారు. కాబట్టి ఆ నేత్రాలను చక్కగా కాపాడుకోవాలి. తరచూ కంటి పరీక్షలు చేయించుకోవాలి. దీని వల్ల కంటి శుక్లం, గ్లకోమా లాంటి సమస్యలు ఉంటే ముందస్తుగా తెలుస్తాయి. సమస్యను ఎంత త్వరగా గుర్తించే దాని నుండి అంత త్వరగా, సులభంగా బయటపడవచ్చని గుర్తుంచుకోవాలి.
* ఎండలో బయటకు వెళ్లినప్పుడు నాణ్యమైన సన్ గ్లాసెస్ వాడాలి.
* మీది కంప్యూటర్ పై చేసే పని అయితే ప్రతి గంటకు కొన్ని నిమిషాల పాటు కళ్లకు విశ్రాంతి ఇవ్వడం మర్చిపోవద్దు.
* కళ్లు తేమగా ఉంచేందుకు పుష్కలంగా నీరు తాగాలి.
* కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే క్యారెట్, బచ్చలికూర, నారింజి వంటివి తినాలి.
* బయటకు వెళ్లినప్పుడు కళ్లద్దాలు ధరించడం వల్ల కళ్లల్లో దుమ్ము, ధూళి పడకుండా కాపాడుకోవచ్చు.



Click it and Unblock the Notifications