Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
పల్లీలే కదా అని తీసి పారేయొద్దు..! తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా..?
వేరు శెనగపప్పులు ప్రతీ సామాన్యుడు కొనుక్కోగలిగే అద్భుతమైన పౌష్టికాహారము. 80 ఏళ్ల వయసులో కూడా మహాత్మాగాంధీగారు వేరు శెనగపప్పులను తిని బలంగా వుండేవారు. మాంసంలో వున్నంత బలం ఈ వేరుశెనగపప్పుల్లో వుంటుంది. మార్కెట్లో చాలా తక్కవ ధరకే ఇవి మనకు అందుబాటులో వుంటాయ్. డ్రై ఫ్రూట్స్‌కు ఏమాత్రం తగ్గకుండా ఈ వేరుశెనగపప్పులు వుంటాయ్. వీటి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను మీకు అందిస్తున్నాం.
1. 100 గ్రాముల వేరుశెనగల్లో 560 క్యాలరీల శక్తి లభిస్తుంది. అందులో 25 గ్రాములు ప్రొటీన్ వుంటుంది. 45 గ్రాముల కొవ్వు వుంటుంది. వీటిని ఎండబెట్టి గ్రైండ్ చేస్తే నూను వస్తుంది. పచ్చిగా గ్రైండ్ చేస్తే పాలు వస్తాయ్. వేపిన తరువాత గ్రైండ్ చేస్తే బటర్ వస్తుంది.

2. పల్లీలను 8 గంటలు నానబెట్టి తరువాత బాగా ఉడికించాలి. 10 నిమిశాలు ఉడకబెడితే అవి మెత్తగా టేస్టీగా బాగుంటాయ్. మేకమాంసంలో కన్నా ీ పల్లీల్లో ఎక్కువ ప్రొటీన్ వుంటుంది. 100 గ్రాముల మేక మాంసంలో 21 గ్రాముల ప్రొటీన్ వుంటే ఈ 100 గ్రాముల పల్లీల్లో 25 గ్రాముల ప్రొటీన్ వుంటుంది.
3. ఈ ఉడకబెట్టిన పల్లీలు తింటే గర్భిణులకు చాలా మంచిది. బరువు పెరగడం లేదనుకునే వారికి కూడా ఈ వేరుచెనగపప్పులు బాగా పనిచేస్తాయ్. ఇవి కడుపులో కూడా చాలా సులభంగా జీర్ణం అవుతాయ్. బలం కోసం బాదాం, కాజూ మాత్రమే కాకుండా ఈ పల్లీలను కూడా తినవచ్చు.
4. వేరుశెనగల్లో అనేక ఔషధగుణాలున్నాయ్. రైబోఫ్లోవిన్, థియామిన్, బి6 వైటమిన్, కాపర్, మ్యాంగనీస్, పొటాషియం, జింక్, సెలీనియం, క్యాల్షియం, ఐరన్ లాంటి పోషకాలు వున్నాయ్.
5. వీటిలో మోనోఅన్ సాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు వున్నాయ్. ఇవి గుండె కండరాల పనితీరును మెరుగుపరుస్తాయ్. రక్తంలో వుండే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. గుండెపోటు రాకుండా నివారిస్తుంది. పక్షవాతం కూడా రాకుండా నివారిస్తుంది.
6. వేరుశెనగలు తినేటప్పుడు చేదుగా అనిపిస్తే తినవద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పల్లీలు రంగుమారినా తినవద్దు. ఈ రంగు మారిన పల్లీల్లో విషపదార్ధాలు వుండే అవకాశం వుంది.
7. వేరుశెనగపప్పు తినడం వల్ల మానసిక సమస్య కూడా తగ్గుతుంది. ఇందులో వుండే ట్రెప్టోఫోన్ శరీరంలోకి వెళ్లిన తరువాత సిరొటోనిన్‌గా మారి మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది.

8. మూత్రపిండాల్లో రాళ్లు రాకుండా కూడా వేరు శెనగపప్పుుల దోహదం చేస్తాయ్. పల్లీల్లో పీచు పదార్ధం ఎక్కువగా వుంటుంది. పల్లీలపై పొట్టు తీయకుండా అలాగే తినాలి. వీటిని వేయించినా ఉడకబెట్టినా పొట్టుతోనే తినాలి.
9. ఫైబర్ ఎక్కువగా వుండడం వల్ల పెద్దపేగు క్యాన్సర్ రాకుండా నివారిస్తుంది. బరువు ఎక్కువగా వున్నవారు పల్లీలు తింటే బరువు తగ్గుతారు. ఇందులో వుండే యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయ్. వేరుశెనగపప్పులు ఇమ్యునిటీ బూస్టర్‌గా పనిచేస్తాయ్. కోవిడ్ లాంటి వైరస్‌లను కూడా అడ్డుకుంటుంది.
10. వేరు శెనగపప్పుల ద్వారా కండ పట్టడంతో పాటు నరాల బలహీనత కూడా తగ్గుతుంది. పల్లీల ద్వారా బెల్లంతో చేసిన చిక్కీలు తింటే మేధోసంపత్తి పెరుగుతుంది. ఐరన్ కూడా పుష్కలంగా అందుతుంది. పల్లీలతో చేసిన చిక్కీ రోజుకు ఒకటి తిన్నా శరీరానికి మంచి పోషకాలు, ఖనిజాలు అందుతాయ్. పిల్లల్లో ఏకాగ్రతా, ఘ్నాపకశక్తి పెరుగుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications