Latest Updates
-
ఒంగోలు ఫేమస్ పంతులు గారి పులిబొంగరం దోశ..మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
పాతకాలం నాటి ఉలవచారు..ఫైవ్ స్టార్ హోటల్ లో కూడా ఇది దొరకదు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
ఇలాంటి టేస్ట్ ఎప్పుడూ చేసి ఉండరు.. రొటీన్‌కి భిన్నంగా ఘాటుగా తోటకూర వంకాయ పచ్చడి! -
25 రోజులు ఉడికించిన సొరకాయ తింటే..శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
జస్ట్ 10 నిమిషాల్లో ఫైవ్ స్టార్ హోటల్ స్టైల్ మష్రూమ్ ఆనియన్ పకోడీ.. ఈ చిన్న ట్రిక్ పాటిస్తే అదిరిపోతుంది! -
లైక్, కామెంట్, షేర్, ట్రోలింగ్.. యువతపై తీవ్ర ప్రభావం.. దీని నుంచి ఎలా బయటపడాలి.? -
పూజ గదిలో దీపం ప్రతిసారీ ఆరిపోతుందా.. మీ ఇంట్లో ఈ కష్టాలు తప్పవు.! -
రోజూ అవే చపాతీలు, రోటీలు తిని బోర్ కొట్టిందా? మట్కా రోటీ ఇలా చేస్తే పిచ్చెక్కించే టేస్ట్! -
స్వీట్, హాట్ తినాలనే కోరికలు విపరీతంగా ఉన్నాయా.. మీ బాడీలో ఈ లోపాలే కారణం.! -
శని దేవుని అభయహస్తం: జూన్ 2027 వరకు ఈ 3 రాశులకు రాజయోగం.. మీరున్నారా ఇందులో?
టెన్షన్ ఎందుకు దండగ..రోజుకొక క్యారెట్ తింటూ వుండగా..!
కొన్ని కూరగాయలను మనం పచ్చిగానే తినవచ్చు. క్యారెట్, బీట్‌రూట్, ఖీరదోసకాయ, లాంటి వాటిని కడుక్కొని అలాగే తిన్నా జిర్ణసమస్య కూడా ఏవీ రావు. కానీ ఆలుగడ్డ, వంకాయ లాంటి కూరగాయలను వండుకొని తినాల్సిందే. నేరుగా తినే అవకాశం వున్న క్యారెట్‌లో ఎన్నో పోషకాలు వున్నాయ్. రోజుకొక క్యారెట్‌ను తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయ్. రోజుకొక యాపిల్ తినాలంటే కొంత ఎక్కువ ఖర్ఛు చేయాలి, అదే ఒక క్యారెట్ తినడానికి ఎక్కువగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. క్యారెట్ అందరికీ అందుబాటులో వుంటుంది. రోజుకి ఒక క్యారెట్ తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు వుంటాయో తెలుసుకుందాం.

రోజూ క్యారెట్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజాలు ఇవే
ప్రస్తుతం చాలా మంది కంటి సమస్యలతో బాధపడుతున్నారు. చిన్న వయసులోనే వారికి కళ్లజోళ్లు వస్తున్నాయ్. కంటి చూపు లోపించడం సర్వసాధారణమైపోయింది. వైటమిన్ ఏ లోపం వల్ల కంటిచూసు లోపిస్తుంది. ఒక నెలపాటు రోజుకొక క్యారెట్ తినడం వల్ల కంటికి సంబంధించిన సమస్యలు దూరమౌతాయ్.
క్యారెట్‌లో ఫైబర్ అధికంగా వుంటుంది. ఇది జీర్ణ సమస్యలను మెరుగుపరుస్తుంది. దీనివల్ల కడుపులో గ్యాస్, మంట లాంటివి వుండే అవకాశం లేదు. మలబద్దకం సమస్యతో బాధపడే వారు రోజుకొక క్యారెట్ తింటే వారి సమస్య తొలగిపోతుంది.
అల్సర్లతో బాధపడేవారు రోజుకొక క్యారెట్ తింటే కడుపులో వున్న పుండ్లు తగ్గుతాయ్. వీటిని తినడం వల్ల శరీరంలో, కడుపులో వున్న వ్యర్థాలు బయటకు పోతాయ్. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో ఒక క్యారెట్ తీసుకుంటే చాలా మంచిది.
క్యారెట్లలో బీటా కెరోటిన్ పుష్కలంగా వుంటుంది. అందువల్ల రోజూ ఒక క్యారెట్ తింటే గోళ్లు ఆరోగ్యంగా మారుతాయ్. గోళ్లు చిట్లిపోవడం తగ్గిపోతుంది.

క్యారెట్లలో వుండే క్యారటినాయిడ్లు, వైటమిన్ సి వల్ల చర్మం మరింత ఆరోగ్యంగా మారుతుంది. వైటమిన్ సి కొల్లెజన్‌ను ఉత్పత్తి చేసి మనల్ని మరింత యవ్వనంగా కనబడేలా చేస్తుంది. చర్మంపై ముడతలు, మచ్చలు పోయి వృధ్దాప్య ఛాయలు రాకుండా వుంటాయ్.
క్యారెట్ తినడం వల్ల క్యాల్షియం కూడా పుష్కలంగా అందుతుంది. దీని వల్ల యముకలు బలంగా తయారౌతాయ్. యముకల నొప్పులు వున్నవారు రోజుకు ఒక క్యారెట్‌ను తినాలి.
క్యారెట్‌ను తినడం వల్ల రక్తంలో చెక్కర స్థాయి కూడా తగ్గుతుంది. డయాబెటిస్ అదుపులోకి వస్తుంది. క్యారెట్ గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. శరీరంలో రక్త సరఫరాను మెరుగుపరుస్తాయ్. రక్తం తయారయ్యేలా చేస్తాయ్. బీపీ తగ్గుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. దీంతో గుండెపోటు వచ్చే అవకాశాలు కూడా తగ్గుతాయ్.
క్యారెట్‌లో వుండే వైటమిన్ సి రోగనిరోధక శక్తిని అమాంతం పెంచుతుంది. హానికర బ్యాక్టీరియాలతో పోరాడే లక్షణాలు క్యారెట్ ద్వారా అందుతాయ్.
రోజుకొక క్యారెట్‌ను తినడం వల్ల క్యాన్సర్ ప్రమాదం కూడా తగ్గుతుంది. మెదడు చురుగ్గా పనిచేసే ఎన్నో పోషకాలు క్యారెట్‌లో వుంటాయ్. క్యారెట్‌లో వుండే కె1, ఫొలేట్, పొటాషియం ఇవన్నీ మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది.
రొజుకొక క్యారెట్ తింటే నోటి దుర్వాసన కూడా తగ్గుతుంది. నోట్లో లాలాజలం తక్కువగా వుండడం వల్ల నోటిదుర్వాసన వస్తుంది. క్యారెట్లు ఈ లాలాజలాన్ని ఉత్పత్తి చేయడం వల్ల నోట్లో వున్న తిన్న చిన్న పదార్ధాలు, బ్యాక్టీరియా తొలగిపోతాయ్.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications