Latest Updates
-
ఈ వీకెండ్ కి నాన్‌వెజ్ వద్దా? నాన్ వెజ్ ను మించే రుచితో కాజు మసాలా ఈజీగా చేసుకోండిలా.. -
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.! -
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.! -
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.! -
బుధ గోచారంతో శని ప్రభావం.. ఈ రాశుల వారికి ఈ పది రోజులూ కష్టాలు తప్పవు.! -
బీరకాయ గారెలు..సూపర్ టేస్ట్ తో పాటు హెల్తీ కూడా..చేయడం చాలా ఈజీ! -
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.!
Coffee Side Effects : కెఫిన్ తో ఇంత ప్రమాదమా.. పరోశోధనలు ఏమి చెబుతున్నాయంటే..!
కాఫీలో ఉండే కెఫిన్ శరీరానికి చాలా ప్రమాదమని పరిశోధకులు చెబుతున్నారు. మరో వైపు కాఫీ రోజూ తాగితే క్యాన్సర్ రాకుండా ఉంటుందని, గుండె సమస్యలు కూడా రావంటున్నారు. కాఫీ లేనిదే రోజు గడవని పరిస్థితి ఉంది. అలాంటిది కాఫీలో కెఫిన్ చాలా ప్రమాదకరమంటే చాలా ఆందోళన చెందాల్సిన పరిస్థితి. అయితే కెఫిన్ మంచిదే గానీ ఎక్కువగా తీసుకుంటే లేదా అలవాటు పడితే మాత్రం చాలా డేంజ్ అంటున్నారు.
కెఫిన్ ఎక్కువగా తీసుకుంటే ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయ్..
రోజుకు 1 గ్రాము కంటే ఎక్కు కెఫిన్‌ను తీసుకుంటే మెదడు దెబ్బతింటుంది. తరచుగా ఆందోళనకు గురౌతారు. మానసిక ఒత్తిడి కూడా పెరిగే అవకాశాలు్నాయ్.
ఓ పరిశోధన ప్రకారం పార్కిన్సాన్స్ వ్యాధి బారిన పడిన వారిలో 8 శాతం మంది కెఫిన్ వల్ల ఆ వ్యాధికి గురైనట్లు బయటపడింది. కెఫిన్ ఎక్కువగా తీసుకుంటే చేతులు వణకడం లాంటి లక్షణాలు కనిపిస్తాయంటున్నాారు.

కెఫిన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎక్కగా మూత్రం వెళ్లే అవకాశం ఉంది. దీంతో డీహైడ్రేట్ అయి తలనొప్పటికి దారితీస్తుందంటున్నారు. కెఫిన్ తగ్గిస్తే తలనొప్పి సమస్య తగ్గే అవకాశం ఉందని పరిశోధనలు నిరూపిస్తున్నాయ్.
నిద్రలేమి సమస్యకు కూడా కెఫిన్ కారణమని తెలుస్తోంది. ఈ సమస్య యువకుల్లో కంటే వయసు పైబడిన వాళ్లల్లోనే ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. కెఫిన్ ఎక్కువగా తీసుకున్నవారు నిద్రపోయే సమయం తక్కువగా ఉంటోందని కనుగ్గొన్నారు.
కెఫిన్ ఎక్కువగా తీసుకుంటే రక్తపోటు కూడా ఎక్కువయ్యే అవకాశముంది. కెఫిన్‌తో అడ్రినలిన్ ఎక్కువగా విడుదలై బ్లడ్ ప్రెజర్‌ను పెరుగుతుంది. రోజు రెండు నుంచి మూడు, నాలుగు కప్పుల కాఫీ తాగే వారిలో బ్లడ్ ప్రెజర్ ఎక్కువగా ఉంటుంది.
10 కాఫీ కప్పులు తాగితే 1 గ్రాము కెఫిన్ తీసుకున్నట్లు. అలా 1.2 గ్రాముల కంటే ఎక్కువ కెఫిన్‌ను తీసుకుంటే తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందంటున్నారు. కాబట్టి మితంగా కాఫీ తాగితేనే ఆరోగ్యం.
శరీరంపై కెఫిన్ ఎలా పనిచేస్తుందంటే..?
రోజుకు ఐదు కప్పుల కంటే ఎక్కువ కాఫీ తాగవద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. కెఫిన్‌ను పూర్తిగా ఆపివేయడం కూడా మంచిది కాదంటున్నారు. రోజుకు కొంత కెఫిన్ తీసుకుంటే శరీరం ఆరోగ్యంగా ఉంటుందంటున్నారు. మెదడును చురుకుగా చేసే శక్తి కెఫిన్‌లో ఉందని, అయితే ఎక్కువగా తీసుకుంటే నిద్రలేమి, పార్కిన్సాన్స్, రక్తపోటు లాంటి అనారోగ్య సమస్యలు వస్తాయంటున్నారు.
శరీరంలో కెఫిన్ పూర్తిగా రక్తంలో చేరడానికి 15 నుంచి 2 గంటల సమయమే పడుతుంది. దీంతో కెఫిన్ తాగి దాన్నుంచి వెంటనే ఉపశమనం పొందాలనుకుంటారు. అందుకే పరిగడపున కాఫీ తాగితే వచ్చే చురుకుదనం వేరే సమయంలో తాగితే రాదు. కెఫిన్‌లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయ్. లివర్ క్యాన్సర్, డిప్రెషన్, టైప్ 2 డయాబెటిస్ రాకుండా కెఫిన్ చేస్తుంది. కానీ ప్రతికూల ప్రభావాలు కూడా అంతే ఉన్నాయన్న విషయాన్ని మరువద్దు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications