Latest Updates
-
వినాయక చవితి స్పెషల్: గణనాథుడికి కారం ఉండ్రాళ్లు.. త్వరగా, పర్ఫెక్ట్గా రావాలంటే ఇలా చేయండి.! -
గణేశుడి విగ్రహం వెనుక వైపు చూడవచ్చా, తొండం ఏ వైపు ఉండాలి.. శాస్త్రం చెబుతోంది ఇదే.! -
ఒక్కసారి చేస్తే 4 నెలల పాటు నిల్వ ఉండేలా సాంబార్, రసం పొడులు.. హోటల్ స్టైల్ రుచితో ఇంట్లోనే.! -
ఒకే ఒక్క స్పూన్ నూనెతో హై ప్రొటీన్ బాయిల్డ్ ఎగ్ ఫ్రైడ్ రైస్..ఈజీగా చేసుకోండిలా.. -
నెయ్యి ఉపవాసంతో అద్భుతాలు!..ఇంటర్నెట్ ను ఊపేస్తున్న కొత్త ఫిట్ నెస్ ట్రెండ్! -
ఎప్పుడైనా లాహోరీ పన్నీర్ కుర్మా టేస్ట్ చేశారా? నోట్లో పెట్టుకుంటే స్వర్గమే! -
పవర్ ఆఫ్ హనుమాన్: ఆంజనేయస్వామి ఆలయం తొలగించబోయిన అధికారులు..4 రోజులైనా ఇంచు కూడా కదలట్లేదు! -
సంతానలేమితో ఆస్పత్రికి వెళ్లిన యువకుడిలో గర్భాశయం.. ఈ విచిత్ర సంఘటనకి కారణాలేంటి.? -
వర్షాకాలంలోనూ ఉక్కపోత.. శరీరంలో వేడిని నిమిషాల్లో తగ్గించే సూపర్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ ఇదే.! -
రాహు నక్షత్రంలోకి శుక్రుడు: భాగస్వామితో గొడవలు.. అక్టోబర్ 24 వరకు వెంటాడనున్న దురదృష్టం
పసిపిల్లలకు డ్రై ఫ్రూట్స్ ఎప్పటినుంచి ఇవ్వాలి? ఎలా పెడితే ఆరోగ్యానికి మంచిది?
ప్రతి తల్లిదండ్రులూ తమ పిల్లలు ఆరోగ్యంగా, దృఢంగా పెరగాలని కోరుకుంటారు. అందుకోసం పోషకాలు నిండిన ఆహారాన్ని అందించడానికి ఆరాటపడతారు. ఈ క్రమంలోనే డాక్టర్లు సూచించే అత్యుత్తమ ఆహారాల్లో డ్రై ఫ్రూట్స్ ముందు వరుసలో ఉంటాయి. పిల్లల సంపూర్ణ ఎదుగుదలకు డ్రై ఫ్రూట్స్ తప్పనిసరి అని ఆరోగ్య నిపుణులు తరచూ చెబుతుంటారు.
అయితే పసిపిల్లలకు డ్రై ఫ్రూట్స్ ఎప్పటినుంచి పెట్టాలి? ఎలా తినిపించాలి? అనే విషయాల్లో చాలా మంది తల్లులకు ఎన్నో సందేహాలు ఉంటాయి. మీ మదిలోనూ ఇదే గందరగోళం ఉంటే.. ప్రముఖ పీడియాట్రిషియన్ డాక్టర్ సందీప్ గుప్తా తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా పంచుకున్న కొన్ని విలువైన సూచనలు ఇక్కడ చూడండి.

పిల్లలకు డ్రై ఫ్రూట్స్ ఎందుకు అంత ముఖ్యం?
జీడిపప్పు, బాదం, పిస్తా, వాల్‌నట్స్ వంటి డ్రై ఫ్రూట్స్ పోషకాలకు కేరాఫ్ అడ్రస్. వీటిలో ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్‌తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలకు అద్భుతంగా సహాయపడతాయి. ముఖ్యంగా ఇందులో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు పిల్లలు ఆరోగ్యవంతమైన బరువు పెరగడానికి, వారి మెదడు చురుగ్గా పనిచేయడానికి, రోగనిరోధక శక్తి పెరగడానికి ఎంతగానో దోహదపడతాయి.

ఏ వయసులో.. ఎలా పరిచయం చేయాలి?
సాధారణంగా పిల్లలకు ఆరు నెలలు (180 రోజులు) నిండిన తర్వాత ఘనకాహారంతో పాటు డ్రై ఫ్రూట్స్ ఇవ్వొచ్చని నిపుణులు చెబుతుంటారు. కానీ డాక్టర్ సందీప్ గుప్తా మాత్రం పిల్లల జీర్ణవ్యవస్థ కాస్త మెరుగైన తర్వాత అంటే 7 లేదా 8 నెలల వయసులో వీటిని పరిచయం చేయడం ఉత్తమమని సూచిస్తున్నారు.
అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ను ఒకేసారి కాకుండా ఒక్కొక్కటిగా పరిచయం చేయాలి. ముందుగా బాదం పప్పును మాత్రమే మెత్తటి పొడి చేసి కొద్ది మొత్తంలో ఇవ్వాలి. ఒకట్రెండు రోజులు గమనించి, వారిలో ఎలాంటి అలెర్జీలు, దద్దుర్లు లేదా విరేచనాలు రావడం లేదని నిర్ధారించుకున్నాకే.. ఇతర నట్స్ ను నెమ్మదిగా అలవాటు చేయాలి. ముఖ్య విషయం ఏమిటంటే.. ఐదేళ్లలోపు వయసున్న పిల్లలకు గింజలను నేరుగా లేదా ముక్కలుగా ఇవ్వకూడదు. అవి గొంతులో, శ్వాసనాళంలో ఇరుక్కునే ప్రమాదం ఉంటుంది.
ఇంట్లోనే హెల్తీ డ్రై ఫ్రూట్ పౌడర్ తయారీ విధానం
ముందుగా ఒక మందపాటి కడాయిని స్టవ్ మీద పెట్టి వేడి చేయండి. అందులో ఒక కప్పు జీడిపప్పు, ఒక కప్పు పిస్తా, ఒక కప్పు బాదం, ఒక కప్పు వాల్ నట్ వేసి సన్నటి మంటపై దోరగా వేయించుకోవాలి. అవి మాడిపోకుండా చూసుకుని, ఒక ప్లేట్‌లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి.
ఆ తర్వాత మిక్సీ జార్ లో వేసి మెత్తటి పొడిలా గ్రైండ్ చేసుకోవాలి. అంతే ఎంతో బలవర్ధకమైన డ్రై ఫ్రూట్ పౌడర్ రెడీ. ఈ పొడిని గాలి చొరబడని డబ్బాలో భద్రపరుచుకుని.. ప్రతిరోజూ పిల్లలు తాగే పాలలో ఒక స్పూన్ కలుపుకుని ఇవ్వవచ్చు. లేదా వారు తినే పండ్ల గుజ్జు, ఉగ్గు, పాయసంలో కలిపి కూడా తినిపించవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
