Latest Updates
-
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!
చీట్ మీల్ అంటే ఏంటి? బరువు తగ్గే ప్రయాణంలో ఇదెంత ముఖ్యమో తెలుసా?
బరువు తగ్గడం దీర్ఘకాలిక లక్ష్యం. బరువు పెరిగినంత తక్కువ సమయంలో తగ్గడం కష్టం. దానికి కొంత సమయం పడుతుంది. మానసికంగా దృఢంగా ఉంటే బరువు తగ్గవచ్చు. బరువు తగ్గడంలో వ్యాయామం ఎంత ముఖ్యమో..
డైట్ పాటించడం కూడా అంతకంటే ఎక్కువ కీలకం. రోజూ కావాల్సిన కేలరీల కంటే తక్కువ కేలరీలు తీసుకోవడం ద్వారా బరువు తగ్గవచ్చు. ఇష్టమైన పిజ్జా, బర్గర్లు, ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకోవడాన్ని పూర్తిగా నివారించి బరువు తగ్గాలి.

అయితే కఠినమైన డైటింగ్ ను పాటించడం వల్ల బరువు తగ్గుతారన్నది ఎంత నిజమో.. నోరు కట్టేసుకుని ఎక్కువ రోజులు ఉండలేమన్నది కూడా అంతే నిజం. డైటింగ్ పాటించడం వల్ల కొన్ని రోజులయ్యాక ఇష్టమైన పదార్థాలు తినాలన్న కోరిక కలుగుతుంది. ఇది రోజురోజుకూ పెరుగుతుంది.
అలాంటి వారి కోసమే చీట్ మీల్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. వారం అంతా లేదా నెలరోజులు కఠినమైన డైటింగ్ పాటించి ఒక్కరోజు మాత్రం ఇష్టమైన ఆహారాలు తినడాన్ని చీట్ మీల్ అంటారు. బరువు తగ్గే ప్రయాణంలో ఈ చీట్ మీల్స్ చాలా ముఖ్యం. చీట్ మీల్స్ ఎందుకంత ముఖ్యమో ఇప్పుడు తెలుసుకుందాం.
చీట్ మీల్‌ను గిల్టీగా భావించొద్దు:
వారం లేదా నెల రోజులు కఠినమైమ డైటింగ్ పాటించి ఒక రోజు చీట్ మీల్ తీసుకోవడాన్ని గిల్టీగా భావించాల్సిన అవసరం లేదు. చాలా మంది ఈ పద్ధతిని ఫాలో అవుతుంటారు. కఠినమైన ఆహార నియమాల నుండి లెక్కించిన, ప్రణాళికాబద్ధంగా చీట్ మీల్ తీసుకోవడం తప్పేం కాదు. అయితే ఈ చీట్ మీల్ లో అతిగా తినకుండా ఉండేలా నియంత్రించుకుంటే సరిపోతుంది.
చీట్ మీల్ అనే ఆలోచన ఈ రోజుల్లో బాగా ప్రాచుర్యం పొందింది. ఎందుకంటే ఇది ఆరోగ్యకరమైన జీవనశైలిని కొనసాగించడంలో సహాయపడుతుంది. అప్పుడప్పుడు చీట్ మీల్ వల్ల పెద్దగా నష్టం కూడా ఉండదు. వారం పాటు కఠినమైన ఆహార నియమాలను అనుసరించినందుకు చీట్ మీల్ ను ఓ అర్హత భావించొచ్చు.
చీట్ మీల్‌లో సమతుల్యత అవసరం:
కఠినమైన ఆహార నియమాల తర్వాత చీట్ మీల్ తీసుకుంటే కొన్ని జాగ్రత్తలు పాటించడం ముఖ్యం. చీట్ మీల్ ను తరచూ తీసుకోకూడదు. అలాగే చీట్ మీల్ వల్ల ఆ వారంలో పడిన కష్టం వృథా కాకుండా చూసుకోవాలి. చీట్ మీల్ కు అలవాటు పడితే డైటింగ్ పాటించడం కష్టంగా ఉంటుంది.
చీట్ మీల్ తీసుకునే రోజు కూడా తినే ఆహారం పూర్తిగా చీట్ మీల్ కాకుండా చూసుకోవాలి. ఇందులో 80 శాతం పోషకాహారం మరో 20 శాతం ఇష్టమైన చీట్ మీల్ ఉండేలా చూసుకుంటే ఆ చీట్ మీల్ వల్ల పెద్దగా నష్టం ఉండదు.
చీట్ మీల్ అంటే అతిగా తినడం కాదు:
చీట్ మీల్ అంటే ఆ రోజు ఇష్టమైన ఆహార పదార్థాలను ఇష్టమొచ్చినట్లుగా తినడం కానే కాదు. వారమంతా కఠినమైన డైటింగ్ పాటించినప్పుడు చీట్ మీల్ అంటే ఆ ఒక్కరోజు అన్నీ తినొచ్చు, ఎంతైనా తినొచ్చు అని అర్థం కాదు. చీట్ మీల్ రోజు ఇష్టమైన ఆహారాన్ని తినవచ్చు. అయితే ఆ ఆహారం ఎక్కువ మొత్తంలో ఉండకుండా చూసుకోవాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
