Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
మామిడి పండ్లు తినడానికి ముందు నీళ్ళలో ఎందుకు నానబెట్టాలి? ఖచ్చితంగా తెలుసుకోవల్సిన విషయం
Is it good to soak mangoes in water : వేసవి సీజన్ వెంటబెట్టుకుని వచ్చే పండ్లు మామిడిపండ్లు. మామిడి పండును పండ్లకే రారాజుగా పిలుచుకుంటారు. ఈ పండు అంటే అందరీ చాలా ఇష్టమైన పండు . ఈ సీజన్ కోసం సంవత్సరం పొడవునా ఎదురుచూసే వారున్నారంటే అందులో ఆశ్చర్యం లేదు. ఎందుకంటే అందులో నేను కూడా ఒకరిని. వారిలో మీరు కూడా ఒకరైతే ఈ కథనం మీకోసమే.
మరి మామిడి పండ్లును ఎలా తినోలో మీకు తెలుసా ? మామిడిపండును తినాలనిమీకు ఎంత ఆశగా అనిపించినా దాన్నితినే ముందు నీళ్లలో కొద్దిసేపు నానబెట్టాలంట. ఈ విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఇది మీకు ఆశ్చర్యం కలిగించే విషయమే అయినా..అలా ఎందుకు చేయాలో ఆయుర్వేద నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ తెలుసుకుందాం.

ఆయుర్వేద నిపుణురాలు దీక్షా భావ్‌సర్ ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న పోస్ట్‌లో మామిడిపండును నీటిలో నానబెట్టడం ఎందుకు అవసరమో వివరించారు. అయితే మామిడి పండ్లను నీటిలో ఎంతసేపు ఉంచాలి? ఎలా తినాలి అనే వారి కోసం ఇక్కడ సమాధానం ..
మామిడికాయను నీళ్లలో ఎక్కువసేపు నానబెట్టి తినండి
ఆయుర్వేద నిపుణులు మామిడిపండ్లను తినడానికి ముందు కనీసం 1 నుండి 2 గంటల పాటు శుభ్రమైన నీటిలో నానబెట్టాలని సిఫార్సు చేస్తున్నారు. కానీ సమయం తక్కువగా ఉంటే, కనీసం మీరు మామిడి పండ్లను 20-30 నిమిషాలు నీటిలో ఉంచిన తర్వాత కూడా తినవచ్చు.
మామిడి పండ్లును తినడానికి ముందు ఎందుకు నానబెట్టాలి
హీలింగ్ సోల్స్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, మామిడి పండ్లను నీటిలో నానబెట్టడం వల్ల దానిలో ఉన్న అదనపు ఫైటిక్ యాసిడ్ తొలగిపోతుంది. ఇది ఒక రకమైన యాంటీ-న్యూట్రియంట్, ఇది ఐరన్, క్యాల్షియం, జింక్ మరియు ఖనిజ లోపానికి దారితీసే ఇతర ఖనిజాల వంటి కొన్ని ఖనిజాలను శరీరం గ్రహించకుండా నిరోధిస్తుంది.
మామిడి పండ్లను నీటిలో నానబెట్టడం వల్ల ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి
నానబెట్టిన మామిడిపండ్లను తినడం వల్ల మొటిమలు, చర్మ సమస్యలు, తలనొప్పి, మలబద్ధకం మరియు ఇతర పేగు సమస్యలను కూడా నివారిస్తుంది.
మామిడిపండ్లు మరియు అవొకాడో పండ్లు స్వీట్ గా పండినప్పుడు మాత్రమే పాలతో కలిపి తీసుకోవాలి.
బాగా పండిన మామిడిపండ్లను పాలతో కలిపి తీసుకోవడం వల్ల వాత మరియు పిత్తం తగ్గుతుంది. ఇలా తీసుకోవడం రుచికరమైనది మాత్రమే కాదు, పోషకాలు నిండుగా ఉండటం వల్ల చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది. కామోద్దీపనం కలిగిస్తుంది.
గమనిక: ఈ సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న ఊహలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. కథనానికి సంబంధించిన ఏ ఇన్‌పుట్ లేదా సమాచారాన్ని తెలుగు బోల్డ్ స్కై ధృవీకరించదు. ఏదైనా సమాచారం మరియు ఊహలను అమలు చేయడానికి లేదా అమలు చేయడానికి ముందు దయచేసి సంబంధిత నిపుణులను సంప్రదించండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications