Latest Updates
-
వర్షాకాలంలో పాము కాటుకి గురైతే ఏం చేయాలి? ఏం చేయకూడదు? -
ఈ వీకెండ్ కి నాన్వెజ్ వద్దా? నాన్ వెజ్ ను మించే రుచితో కాజు మసాలా ఈజీగా చేసుకోండిలా.. -
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.! -
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.! -
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.! -
బుధ గోచారంతో శని ప్రభావం.. ఈ రాశుల వారికి ఈ పది రోజులూ కష్టాలు తప్పవు.! -
బీరకాయ గారెలు..సూపర్ టేస్ట్ తో పాటు హెల్తీ కూడా..చేయడం చాలా ఈజీ!
నెలసరి ఆలస్యమైందా? గర్భవతి కాలేదా? అసలు కారణాలు ఇవే
ఆడవాళ్లకి పీరియడ్స్ అనేవి కామన్. దీనిని రుతుక్రమం అని కూడా అంటారు. స్త్రీల శరీరంలో జరిగే ఒక సహజ ప్రక్రియ ఇది. సాధారణంగా 28 రోజుల చక్రంలో ఒకసారి జరుగుతుంది. అయితే ఇది ఒక్కొక్కరిలో భిన్నంగా ఉంటుంది. కొందరు 21 నుంచి 35 రోజుల మధ్యలో పీరియడ్స్ వస్తుంటాయి. సాధారణంగా పీరియడ్స్ 3 నుంచి 7 రోజుల వరకు ఉంటుంది. పీరియడ్స్ అప్పుడు ఏం జరుగుతుందంటే గర్భాశయం లోపలి పొర విచ్ఛిన్నం అయ్యి రక్తస్రావం జరుగుతుంది. ఈ సమయంలో కడుపు నొప్పి, నడుము నొప్పి, అలసట, తలనొప్పి, మానసిక స్థితిలో మార్పులు వంటి లక్షణాలు అమ్మాయిలలో కనిపిస్తాయి.
మీ నెలసరి ఆలస్యమవుతోందా? గర్భవతి కాదని ఖచ్చితంగా తెలుసా? చాలా మంది మహిళలు తమ జీవితంలో ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటారు. సాధారంగా ఎవరైనా అమ్మాయికి పీరియడ్స్ ఆగిపోతే ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయినట్లు భావిస్తారు. అయితే కొంతమందికి పీరియడ్స్ సమయానికి రాకుండా..అదే సమయంలో వాళ్లు ప్రెగ్నెంట్ గా కూడా ఉండకపోవచ్చు. నెలసరి రాకపోవడానికి లేదా ఆలస్యం కావడానికి అనేక ఇతర కారణాలు ఉండవచ్చు. హోర్మోన్ల అసమతుల్యత, మెడికల్ కండీషన్స్ దీనికి ప్రధాన కారణాలుగా చెబుతుంటారు. 5శాతం 35.6శాతం మంది మహిళలు ఈ అనుభవాన్ని ఎదుర్కొంటున్నారు. అయితే పీరియడ్స్ లేటు అవడానికి సాధారణ కారణాలు, ఎవరెవరికి ఇలా జరుగుతుందో ఇప్పుడు చూద్దాం.

అధిక వ్యాయామం
సాధారణంగా తీవ్రంగా ఎక్సర్ సైజ్ చేసే అథ్లెట్లకు పీరయడ్స్ ఆలస్యం అవ్వడానికి అవకాశం ఉంటుంది. తీవ్రమైన వ్యాయామం వల్ల శరీరం ఒత్తిడి హార్మోన్లను రిలీజ్ చేస్తుంది, పునరుత్పత్తి హార్మోన్ల సంశ్లేషనకు అంతరాయం కలిగిస్తుంది. దీంతో పీరియడ్స్ మిస్ అవడం లేదా క్రమ రహితంగా వస్తుంటాయి. వ్యాయామం కారణంగా మీకు పీరియడ్స్ క్రమరహితంగా వస్తుంటే వెంటనే డాక్టర్ ని కలవాలి.
ఊబకాయం
ఊబకాయం కేవలం బరువు పెరగడానికి మాత్రమే కాదు శరీరంలోని ముఖ్యమైన హార్లోన్మ ఉత్పత్తిని కూడా మార్చేస్తుంది. ముఖ్యంగా ఇది ఈస్ట్రోజెన్ ఉత్పత్తిని విపరీతంగా పెంచుతుంది. ఈస్ట్రోజెన్ అనేది స్త్రీల పునరుత్పత్తికి చాలా అవసరమైన హార్మోన్. అయితే ఈస్ట్రోజన్ శరీరంలో ఎక్కువైతే నెలసరి చక్రానికి అడ్డుపడవచ్చు. దీంతో రుతుక్రమం ఆలస్యం అవొచ్చు లేదా కొన్నిసార్లు పూర్తిగా ఆగిపోవచ్చు. ఊబకాయం కారణంగా పీరియడ్స్ రావడం లేటు అవడం లేదా మిస్ అయితే మత్రం జీవనశైలి మార్పుల ద్వారా ఈ పరిస్థితికి చెక్ పెట్టవచ్చు.
ఒత్తిడి,ఆందోళన
ప్రస్తుతం ఒత్తిడి,ఆందోళన మన జీవితాల్లో ఒక సాధారణ భాగం అయింది. అయితే ఈ ఒత్తిడి ఆరోగ్యంమీదనే కాకుండా నెలసరి చక్రంపై కూడా పెద్ద ప్రభావం చూపుతుంది. ఇది అనారోగ్యానికి దారితీయవచ్చు లేదా శరీర బరువులో హఠాత్తుగా మార్పులు తీసుకురావచ్చు. ఫలితంగా నెలవారీ చక్రం గందరగోళానికి గురవుతుంది. దీర్ఘకాలికంగా కూడా దీని ప్రభావం ఉంటే అవకాశముంది కాబట్టి వెంటనే డాక్టర్ ని కలవడం బెటర్.
PCOS
పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS).. చాలా మంది మహిళలను ప్రభావితం చేసే ఒక సాధారణ పరిస్థితి. PCOS ఉన్నవారిలో నెలసరి చక్రం అస్తవ్యస్తంగా మారవచ్చు లేదా పూర్తిగా ఆగిపోవచ్చు. అంతేకాదు, ఈ పరిస్థితి వల్ల అండాశయాలలో చిన్న చిన్న, ప్రమాదం లేని నీటి బుడగలు ఏర్పడతాయి. PCOS కేవలం నెలసరి సమస్యలనే కాకుండా మరిన్ని ఇబ్బందులను కలిగిస్తుంది. క్రమ రహిత పీరియడ్స్, ముఖం, శరీర భాగాలపై ఎక్కువగా వెంట్రుకలు పెరగడం, మొటిమలు, బరువు పెరగడం వంటి లక్షణాలు కూడా PCOS వల్ల కనిపించవచ్చు.
థైరాయిడ్ సమస్య
మన బాడీలో చిన్న సీతాకోక చిలుక ఆకారంలో ఉండే థైరాయిడ్ గ్రంథి మన శరీరంలోని జీవక్రియలన్నింటిని నియంత్రిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది మన శరీరానికి కంట్రోల్ రూమ్ లాంటిది. అయితే ఈ థైరాయిడ్ గ్రంథిలో ఏదైనా సమస్య వస్తే దాని పనితీరు మారుతుంది. దీని వల్ల విడుదలయ్యే హార్మోన్ల స్థాయిల్లో హెచ్చుతగ్గులు వస్తాయి. ఈ హార్మోన్ల మార్పులు మీ నెలసరి చక్రాన్ని కూడా ప్రభావితం చేయగలవు. కాబట్టి మీ నెలసరి క్రమం తప్పిందంటే, థైరాయిడ్ గ్రంథి పనితీరును కూడా ఒకసారి పరిశీలించుకోవడం మంచిది.
పాలిచ్చే సమయంలో ప్రోలాక్టిన్ అధిక ఉత్పత్తి
ప్రోలాక్టిన్ అనేది సాధారణంగా పాలిచ్చే సమయంలో శరీరం ఉత్పత్తి చేసే హార్మోన్. ఇది ఋతుస్రావంపై ప్రభావం చూపుతుంది. అందుకే పాలిచ్చే చాలా మందికి రుతుస్రావం జరగదు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications