Latest Updates
-
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.!
World Malaria Day : సమ్మర్ లో జ్వరం వస్తే..మలేరియా సంకేతమే?..వాళ్లకు మాత్రం చాలా డేంజర్
మలేరియా అనేది ఒక ప్రాణాంతకమైన వ్యాధి అని మనందరికీ తెలిసిందే. ఇది ప్లాస్మోడియం అనే పరాన్నజీవి వల్ల వస్తుంది. ఈ పరాన్నజీవి సోకిన ఆడ అనాఫిలిస్ దోమ కుట్టడం ద్వారా మనుషులకు వ్యాపిస్తుంది. అయితే సమ్మర్ సీజన్ లో ఎవరికైనా అకస్మాత్తుగా జ్వరం వచ్చినా..ముఖ్యంగా జలుబు లేదా ఫ్లూ సంకేతాలు లేకుండానే జ్వరం వచ్చిందంటే అది ఖచ్చితంగా మలేరియా అయి ఉండే ఛాన్స్ ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. ఇవాళ వరల్డ్ మలేరియా డే(World malaria).
ప్రతి ఏటా ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ మలేరియా డే జరుపుకుంటారు. 2007లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(WHO)60వ హెల్త్ అసెంబ్లీ సందర్భంగా ఈ రోజుని ఏర్పాటు చేసింది. మలేరియా వ్యాధి పట్ల ప్రజల్లో అవగాహన పెంచడం, దాని నివారణ, నియంత్రణ కోసం కృషి చేయడమే మలేరియా డే వెనుక ఉద్దేశ్యం. 2025 ప్రపంచ మలేరియా దోనోత్సవ థీమ్ "Malaria Ends With Us: Reinvest, Reimagine,Reignite(మలేరియా మనతోనే అంతం అవుతుంది: తిరిగి ఇన్వెస్ట్ చేయండి,తిరిగి ఊహించండి,తిరిగి ప్రజ్వలించండి). మలేరియా నిర్మూలన దిశగా అన్ని స్థాయిలలో ప్రయత్నాలను పునరుద్దరించడం దీని ముఖ్య ఉద్దేశం.

సమ్మర్ లో ఈ లక్షణాలు కనబడితే మలేరియానే?
ఎండాకాలంలో ఏప్రిల్, మే నెలల్లో తరచుగా మళ్లీ మళ్లీ జ్వరం వస్తున్నా, తీవ్రమైన తలనొప్పి, కీళ్లలో నొప్పి, విపరీతమైన అలసట, వాంతులు, విరోచనాలు, వికారంగా ఉండటం వంటి లక్షణాలు కనబడితే అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు. దోమ కుట్టిన తర్వాత వారం లేదా అంతకంటే ఎక్కువ రోజులకు ఈ లక్షణాలు కనిపిస్తాయాని..ఇవి వైరల్ జ్వరాల మాదిరి అనినించవచ్చు కానీ మలేరియా అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది..సరైన టైంకి ట్రీట్మెంట్ చేయకుంటే ప్రమాదకరంగా మారుతుందని డాక్టర్లు చెబుతున్నారు.
ముఖ్యంగా చిన్న పిల్లలు, గర్భిణీ స్త్రీలు, వృద్ధులకు ఇది మరింత ప్రమాదకరం అని చెబుతున్నారు. సాధారణ బ్లడ్ టెస్ట్ ద్వారానే మలేరియాను గుర్తించవచ్చని తెలిపారు.
ఈ జాగ్రత్తలు తీసుకోవాలి
-ఒకటి లేదా రెండు రోజుల కంటే ఎక్కువ జ్వరం ఉండే వెంటనే హాస్పిటల్ కి వెళ్లి టెస్ట్ చేయించుకోవాలి. మలేరియా అని తేలితే తగిన ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు.
-మీ ఇంటి చుట్టుపక్కల, పరిసర ప్రాంతాల్లో నీరు లేదా మురుగు నీరు నిల్వ ఉండకుండా చూసుకోండి. కుండీలు, టైర్లు, డ్రమ్ములు వంటి వాటిలో నీరు నిల్వ ఉంటే వెంటనే తొలగించండి. లేకుంటే ఇక్కడ దోమలు పెరిగిపోయి తర్వాత అవి కుట్టి మలేరియా వచ్చే ప్రమాదమదుంటుంది.
-మీరు నివసించే ఏరియాలో లేదా బజారులో మలేరియా కేసులు వస్తున్నట్లు తెలిసినా లేదా అలాంటి ఏరియాలకు వెళ్లి వచ్చిన తర్వాత జ్వరం వచ్చిందంటే చాలు వెంటనే హాస్పిటల్ కి వెళ్లి టెస్ట్ చేయించుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. దోమలు విపరీతంగా ఉండే ఏరియాల్లో నివసించేవాళ్లు దోమతెరలు వాడటం మంచిదని సూచిస్తున్నారు.
-స్కిన్ కి దోమల నివారణ క్రీమ్స్ అప్లయ్ చేయడం మంచిదని డాక్టర్లు చెబుతున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
