Latest Updates
-
చపాతీలో ఫేవరెట్ పనీర్ మెంతి కర్రీ.. రెస్టారెంట్ స్టైల్లో ఇలా అదరగొట్టేయండి.! -
ఒకసారి స్టెంట్ వేశాక మరోసారి గుండెపోటు వస్తుందా.. చేదు నిజాలివే.! -
నోరూరించే కాజు చికెన్ పకోడీ.. ఇలా చేస్తే ఎంత తిన్నా తృప్తి తీరదు! -
ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ కోసం భార్యాభర్తలు ఎలా కలవాలి.? -
తల్లిపాల వారోత్సవాలు.. బిడ్డే కాదు బాలింత కోసం కుటుంబీకులు గుర్తుంచుకోవాల్సిన విషయాలు! -
పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా.. ఈ వడను తిన్నారంటే మినప గారెలను మరిచిపోతారు.! -
బుధాదిత్య యోగం.. ఈ నాలుగు రాశుల వారికి అదృష్టం ఇంటి ముంగిటే.! -
గంటల తరబడి ఫ్రిజ్‌లో పెట్టాల్సిన పనిలేదు.. అప్పటికప్పుడు చేసుకునే ఇన్స్టంట్ ఫిష్ ఫ్రై.! -
రెస్టారెంట్ స్టైల్ తవా చికెన్..వేళ్లు నాకుతూ తినడం గ్యారెంటీ..ఈజీగా చేసుకోండిలా.. -
35 ఏళ్లకే కోరికలు తగ్గిపోయాయా.. దాంపత్య సుఖం కోసం తప్పనిసరిగా ఫాలో అవ్వాల్సిన టిప్స్.!
పిల్ల గదికి అందం... ఆకర్షణ కలిగించే అలంకరణలు

పిల్లల గది ఇలాగే ఉండాలనే నిబంధనలేవీ లేవు. కాకపోతే వారి గదిని తీర్చిదిద్దేటపుడు వారి ఆసక్తులు, అభిరుచులు, వయస్సు, లింగ భేదం.. వంటివన్నీ దృష్టిలో పెట్టుకోవాలి. దీనికితోడు పిల్లల ఆరోగ్యం, చదువు, ప్రవర్తనల్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. కానీ క్షణానికో కొత్త ఇంటీరియర్ పుట్టుకొస్తున్న ఈ రోజుల్లో అన్ని హంగులూ అమర్చుకోవటమన్నది కాస్త ఖర్చుతో కూడిన పనే. దాంతోపాటు ఒక క్రమ పద్ధతంటూ లేకుండా రూమ్ లోని ఫర్నిచర్ ను తీర్చిదిద్దడమే పిల్లలను ఆకర్షిస్తుంది. అలాగని చిందరవందర చేయొద్దు.
రంగులే ప్రధానం: పిల్లలను ఆకట్టుకొనేలా గదిని రూపొందించడంలో రంగులదే అధిక ప్రాధాన్యం. మానసిక శాస్తవ్రేత్తల అంచనాల ప్రకారం చిన్న పిల్లలు ఎరుపు, నీలం, పసుపు రంగులను ఇష్టపడతారు. ఇవికాక ఆకుపచ్చ, పర్పుల్ కలర్లు కూడా ఓకే. ఇక వయలెట్, పింక్‌లు కూడా పర్వాలేదు. అన్నింటికన్నా ముఖ్యం మీ చిన్నారి ఏ రంగుని ఇష్టపడుతున్నాడనేది. మొత్తం అంతా ఒకే రంగు కాకుండా గదిలో వేర్వేరు చోట్ల వేర్వేరు రంగులను నింపడం ద్వారా అందాన్ని తేవచ్చు. దీంతో పాటు ఒకో రంగు ఒక్కో అంశాన్ని బహిర్గత పరచడానికి ప్రేరణ కల్పిస్తుందని కలర్ సైకాలజీ చెబుతోంది.
ఎరుపు అధికంగా ప్రభావితం చేసే రంగు. ఇక ఆరెంజ్ స్నేహ స్వభావాన్ని తెలియజేస్తుంది. కాబట్టి ఆడుకునే చోట, పిల్లలు కూర్చునే చోట ఈ కలర్ ఉంటే బాగుంటుంది. పసుపు ఏకాగ్రతను పెంచేందుకు తోడ్పడుతుంది. అందువల్ల చదువుకునే చోట వేస్తేసరి. పిల్లలకంటూ ప్రత్యేకించి గది చిన్నదైతే బాగా ముదురు రంగులు వేయటం వల్ల మరింత చిన్నదిగా కనిపించే ప్రమాదముంది. కాబట్టి తేలిక రంగులు వేస్తే మంచిది. పిల్లలకు ఇష్టమైన కార్టూన్ క్యారెక్టర్లను గోడలపై చిత్రించడం ద్వారా వారికి ఆనందాన్ని కలుగజేయొచ్చు. రాత్రుళ్లు నిద్రపోయే ముందు లైట్స్ ఆఫ్ చేస్తే పిల్లలు కొత్తలో బయపడే అవకాశం ఉంది. సీలింగ్‌కు చీకట్లో కూడా మెరిసేలా మెటాలిక్ రంగులు లేదా స్టెన్సిల్‌తో పెయింటింగ్‌లు వేస్తే చీకట్లో కూడా హాయిగా నిద్రపోతారు.
కంటికి శ్రమ కలిగించని లైటింగ్: లైట్ల విషయానికి వస్తే బాగా వెలుతురుని అందించే ఫ్లోరోసెంట్ బల్బులను వాడాలి. లైటింగ్ స్టాండ్లు కూడా వంకీలు లేదా ఇతర డిజైన్లతో ఉంటే పిల్లలను ఆకట్టుకుంటాయి. అయితే కంటిపై ఎలాంటి ప్రభావం చూపకుండానూ, చదువుకొనేటప్పుడు ఇబ్బంది కలగకుండా ఉండాలి. పిల్లల గది కదా అని తెగ హంగామా చేసి అన్ని వస్తువులను పేర్చేయకుండా అవసరమైన మేరకు ఉంచాలి. ఈ క్రమంలో వారి అభిరుచులకు ప్రాధాన్యతను ఇస్తూనే ఆకట్టుకొనే విధంగానూ రూపొందించాలి.



Click it and Unblock the Notifications