Latest Updates
-
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!
వేసవిలోనూ ఇంట్లో చల్లచల్లగా...హాయిగా..ఆహ్లాదంగా..

వేసవిలో ఇంటిని అందంగా ఆహ్లాదంగా ఉంచుకోవాలంటే.. ఇంట్లో చల్లదనం కోసం ఎయిర్‌కండీషన్ పెట్టుకోగానే సరిపోదు. వెంటిలేషన్ సరిగ్గా ఉందోలేదో చూసుకోవడం చాలా అవసరం. ఇంట్లో ఏసీ ఉందికదా అని తలుపులు కిటీకీలు మూతపెట్టడం లాభం లేదు. వాటిని తెరిచి ఉంచాలి. మంచాలు, బెడ్ ఎక్కువ స్థలాన్ని ఆక్రమిస్తే వాటిని తొలగించి నేలమీద పడుకోవడమే బెటర్. చెయిర్స్, టేబుల్స్ ని వీలైనంతవరకు తగ్గించుకోవాలి. ప్రాణవాయువు కోసం పూలకుండీలను గది మధ్యలో వుంచితే మంచిది.
వేసవిలో ప్రతిరోజూ ఇంటిముందు రెండుపూటలా నీళ్లు చల్లుతూ ఉండాలి. వేసవిలో గదిని చల్లగావుంచడం కోసం ఎయిర్ కూలర్ ని తెచ్చి పెట్టుకోవడం మంచిది. టేబుల్ ఫ్యాన్ కి బదులు సీలింగ్ ఫ్యాన్ బిగించుకోవడం ఉత్తమం. అధిక స్పీడ్ లో ఫ్యాన్ ని తిరగనివ్వరాదు. గదిలో బల్బ్ ని తొలగించి ట్యూబ్ లను బిగించుకోవాలి. కిటికీ కర్టెన్ ని డోర్ కర్టెన్లని ఎప్పుడూ మూతఉంచకుండా సగంకతెరచి ఉండటం మంచిది. వాటిని అప్పుడప్పుడు నీటితో తడుపుతుండడంవల్ల గదిలో చల్లదనం చోటుచేసుకుంటుంది. వేసవిలో గదులలోపలి గోడలకి ముదురురంగు వాల్ పెయింట్ ని వేయించడం మంచిది.
వేసవిలో ఇంటి శుభ్రత కోసం క్లోరిన్, బ్లీచింగ్, డయాక్సీన్ వంటి రసాయనాల వాడకాన్ని తగ్గించడం మంచిది. సువాసన వెదజల్లే పూలను అక్కడక్కడ వేలాడదీయండి. లేదా మంచి వాసన కలిగిన అగరొత్తులైనా వెలిగించవచ్చు. గదిలో ఇత్తడి మరియు స్టీలు బిందెలనీ, పాత్రలని అటక ఎక్కించండి. కూజాలు కుండలు వేసవిలో చాలా మేలు చేస్తాయి. ప్రతీరోజూ చన్నీటితో ఇంటి గదులన్నింటిని కడుగుతుంటే చల్లగా, హాయిగా ఉంటుంది. వేసవిలో గదుల లోపలి గోడలకి ముదురురంగు వాల్ పెయింట్ వేయించడం మంచింది.



Click it and Unblock the Notifications
