Latest Updates
-
గణేష్ నిమజ్జనం 2026: అనంత చతుర్దశి నాడు 4 మహా యోగాలు.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే! -
పెర్ఫ్యూమ్ స్ప్రే చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ డబ్బులు వృథా అయినట్లే.! -
ముంబై రోడ్ సైడ్ తవా పులావ్..మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
పనీర్ కర్రీ కూడా పనికిరాదు.. ఈ ఆఫ్ఘానీ సోయా కర్రీ రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
గొంతు నొప్పిని ఒక్క ముద్దతో తరిమేసే వెల్లుల్లి కారం పచ్చడి.. అసలు సిసలైన పద్ధతి ఇదే.! -
చిన్న వయసులోనే మెటబాలిక్ సిండ్రోమ్.. ఇది వ్యాధి కాదు.. కానీ ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.! -
అమ్మ ఎప్పుడు వస్తుంది నాన్నా?.. మేనల్లుడి మోజులో పడి ముగ్గురు పిల్లలను వదిలేసిన తల్లి! -
మైదా లేకుండా హెల్తీగా రైస్ సేమియా.. మ్యాగీ చేసినంత ఈజీగా బ్రేక్ఫాస్ట్ రెడీ.! -
కర్కాటకంలో కుజ, గురు గ్రహాలు.. దురదృష్టం పోయి అదృష్ట జాతకంలో ఉన్న రాశులు ఇవే.! -
సొరకాయతో కరకరలాడే లచ్చా పరాటా.. ఇలా చేశారంటే వదిలిపెట్టకుండా తింటారు
షడ్రుచుల మేళవింపు ..పచ్చతోరణాలతో ఇంటికి సరి కొత్త అందం...

ప్రతీ ఇంట ముందు ఆవు పేడతో కల్లాపి జల్లి , రంగు రంగుల రంగవల్లులు తీర్చి దిద్దుతారు. శాస్త్రయుక్తంగా తమ ఇష్టదైవానికి పూజ చేసుకుని కొత్త సంవత్సరం అంత శుభం కలగాలనికోరుకుంటారు. ఆరోగ్య ఐశ్వర్యాలను ఆకాంక్షిస్తారు . ఈ రోజున కొత్త పనులు వ్యాపారాలు మొదలెడతారు. ఇంటింట ప్రత్యేక వంటకాలు తయారు చేస్తారు. పులిహోర, బొబ్బట్లు, పాయసం, అలాగే పచ్చి మామిడి కాయతో వంటకాలు విశేషం. పూజకు ఉగాది పచ్చడి నైవేద్యం, పసుపు రంగులు పుష్పాలు వాడాలి. ఉగాది పండుగ రోజున ఉదయం ఆరు గంటల నుంచి 9 గంటల వరకు పూజ చేయవచ్చు. దీపారాధనకు రెండు ప్లస్ రెండు దూది వత్తులు, ఆవునెయ్యి వాడాలి.
షడ్రుచుల మేళవింపు అమృతప్రాయం పచ్చడి...ఉగాది పండుగ రోజు ప్రత్యేకంగా సేవించే పానంకం పచ్చడిలో తీపి, చేదు, వగరు, పులుపు, ఉప్పు, కారం అన్ని ఆరు రకాల శడ్రుచులను కలిపి తయారు చేసే పచ్చడిని ప్రజలు ఆమృత ప్రాయంగా భావిస్తారు. ఔషద గుణాలు కలిగి ఉన్న బెల్లం, చింతపండు, మామిడి, వేపపుపవ్వు, మిరియాలు, ఉప్పు, కొబ్బరి నీటిలో కలిపి తయారు చేసి కొత్త కుండలో నిలువచేసే పచ్చడి మన సాంప్రదాయానికి నిదర్శంగానే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మంచిది. మరొక వంటకం బొబ్బట్లు, బూరెలు ఉగాది స్పెషల్ వంటకాలతో ప్రతి ఇల్లు ఘుమఘుమలతో అలరిస్తూ ఉంటుంది.



Click it and Unblock the Notifications
