Latest Updates
-
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.? -
అక్టోబర్ 11 నుంచి శరన్నవరాత్రులు..ఏనుగుపై భూలోకానికి దుర్గమ్మ.. ఆ 3 రాశుల వాళ్లకి ఇక అంతా డబ్బే డబ్బు!
అద్దెఇల్లు అయితేనేం సువిశాలంగా తీర్చిదిద్దండి...

1. ముదురు రంగులతో ఉన్న మీ ఇంటికి లేత రంగులు అద్దండి. లైటింగ్ కూడా కాస్త బ్రైట్ గా ఉండేట్లు అమర్చుకుంటే గదులు కొంత విశాలంగా కనిపిస్తాయి.
2. ముందుగా ఇంట్లోని పాత వస్తువులు అంటే ఇక మనకు ఉపయోగపడవు అన్న వాటిని పారబోయాలి. పిల్లల పుస్తకాల నుంచి పెద్దల వాచీలు వరకూ ఏస్థానంలో అమర్చాలో నిర్ణయించి, అదే ప్లేస్‌లో పెట్టుకోవాలి. పొడవైన వస్తువులు నిలువుగా పెట్టుకోండి. అంటే టార్చిలైటు, మొబైల్, ఇతర గృహావసర వస్తువులన్నమాట.
3. ఫర్నీచర్ కొనేటప్పుడు ఎక్కువ ఖరీదు, అద్భుతమైన డిజైన్ అన్నలెక్కలకు పోకుండా మీ ఇంటి డ్రాయింగ్ రూమ్ లేదా హాలు నిర్మాణాన్ని బట్టి ఎంచుకోండి. ఎంత తక్కువ ర్నీచర్ ఉంటే అంత మంచిది. దానివల్ల వాటి నిర్వహణ కూడా తేలికవుతుంది.
4. పండుగకు అలవెన్సులు, బోనస్, ఇంక్రిమెంట్లు అందుకున్న రోజుల్లో సరదాపడి కొత్త వస్తువు కొనదలిస్తే… అది ఏ మేరకు అవసరమో ఒక్కసారి ఆలోచించండి. అవసరమైతేనే కొనండి. లేదంటే డబ్బు, ఇంట్లో స్థలం వృధాగా భావించండి.
5. సీలింగ్ హైట్ ఎక్కువ ఉండడం వల్ల గదులు పెద్దగా కనిపిస్తాయి. ఒకవేళ సీలింగ్ తక్కువ ఎత్తులో ఉంటే దానికి తెలుపు రంగును వేయించి అప్పుడు చూడండి.
6. గదిలో అద్దాలు ఎక్కువగా పెట్టుకోవడం వల్ల గది మరింత పెద్దగా కనిపిస్తుంది. అలా అని మొత్తం అద్దాలతో నింపేయొద్దు.
7. చిన్నదైనా కిటీకీలు ఎక్కువగా ఉండి వెంటిలేషన్ సరిగా ఉంటే కూడా గది పెద్దగా కనిపిస్తుంది.



Click it and Unblock the Notifications
