Latest Updates
-
చాలా ఏళ్ల తర్వాత ఒకే రాశిలో సూర్య కేతులు.. రాజయోగం పట్టనున్న రాశులివే.! -
చికెన్ లివర్ vs మటన్ లివర్..రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిది? -
పెళ్లిళ్లలో వడ్డించే పూరీ మసాలా.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా ఇలా ఈజీగా చేసుకోండి..వేళ్లు నాకుతూ తినేస్తారు! -
కలియుగం ముగిసేది ఎప్పుడు? మనిషి ఆయుష్షు కేవలం 20 ఏళ్లేనా? -
పెళ్లిళ్లలో వడ్డించే కరకరలాడే చిల్లీ గోబీ.. అచ్చం అదే రుచితో ఇంట్లోనే ఈజీగా చేసేయండిలా.. -
కొల్హాపురి స్టైల్ కోడిగుడ్డు పులుసు..అన్నం, జొన్న రొట్టెలోకి అదిరిపోతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
వర్షాకాలంలో పాము కాటుకి గురైతే ఏం చేయాలి? ఏం చేయకూడదు? -
ఈ వీకెండ్ కి నాన్వెజ్ వద్దా? నాన్ వెజ్ ను మించే రుచితో కాజు మసాలా ఈజీగా చేసుకోండిలా.. -
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.! -
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.!
తక్కువ బడ్జెట్తోనే ఇంటిని ఆకర్షణీయంగా మార్చండి
ఇంటిని అలంకరించడంలో అధిక సమయంతో పాటు తగినంత సృజనాత్మకత కూడా ఉండాలి. మీ ఇంటి అలంకరణ మీ పర్సనాలిటీని మరియు స్టైల్ ను తెలుపుతుంది. అయితే ఇంటి అలంకరణలో మీ ఇంటి అందాన్ని పెంచడం కోసం మరియు ఆకర్షణీయంగా కనబడేలా చేయడం కోసం ఖరీదైనవి మరియు అద్భుతమైన వస్తువులను మాత్రమే అలంకరించాలని లేదు. మీ ఇంటి అలంకరణకు కొన్ని వినూత్న ఆలోచనలను కలిగి ఉంటే మీ ఇంటి అలంకరణ మీ విషయంలో మీరు ఇంటీరియర్ డిజైనర్ అయిపోవచ్చు. మీలోని కొన్ని ఆలోచనలను, ఉపాయాలను వెలికితీయడంలోనే మీ ఇంటి అలంకరణ దాగి ఉంది.
కొన్ని సందర్భంలో సింపుల్ గా చేసే హోం డెకరేషనే చాలా అద్భుతంగా ఆకర్షణీయంగా కనబడేలా చేస్తుంది. అందుకు ఇంటి అలంకరణలో ప్రతి ఒక్కదాని మీద కన్నేసి ఉంచాలి. ప్లోర్ తో కలిపి, లైటనింగ్, ఫర్నీచర్, వాల్ డెక్కర్, మరియు ఇంటీరియర్ డిజైన్స్ ఇలా ప్రతి ఒక్క దానిమీద దృష్టి పెట్టి, తగు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మీ ఇల్లు మరింత అట్రాక్షన్ గా చేస్తుంది. మీ ఇల్లు మరింత అందంగా ఆకర్షణీయంగా కనబడేలా చేసేందుకు మీ దగ్గర ఐడియాస్ ఉన్నట్లైతే , కొన్ని చౌకైన గృహోపకరణాలుతోటే మీ ఇంటిని అందంగా తీర్చిదిద్దండి.
చౌకైన గృహోపకరణాలు కూడా ఇంట్లో సరైన ప్రదేశంలో ఉంచడం వల్ల ఇల్లు విలాసవంతమైనదిగా కనబడుతుంది. అందుకు ఇతరులు ఉపయోగించని కొన్ని చౌకైన గృహోపకరణాలను ఎదుటివారిని ఆకర్షించేలా చేసే వస్తువులను ఎంపిక చేసుకొని, ఇంటి అలంకరణకు ప్రయత్నించండి. ఇలా చౌకన హోం ఆక్సెసరీస్ ను ఎంపిక చేసుకోవడం వల్ల మీ ఇంటి అందంతో పాటు మీకు బడ్జెట్ ఫ్రెండ్లీ పొందవచ్చు. మీ ఇంటికి సొగసైన శైలిని తీసుకురావడానికి ఇక్కడ కొన్ని ఐడియాస్ ఉన్నాయి. వాటిని పరిశీలించి ప్రయత్నించండి...

ఫోటో ఫ్రేమ్స్: మీ ఇంట్లో ఖాలీగా ఉన్న అందమైన గోడలను అందంగా మార్చడంలో అతి చౌకైన ఫోటో ఫ్రేములు ఇంటి అలంకరణలో ఒకటి. ఫోటో ఫ్రేమ్ లో మీ కుంటుంబం సంతోషంగా గడిపిన క్షణాల్లో తీయించిన ఫోటోలను ఫ్రేమ్ కట్టించి ఖాళీగా ఉన్న గోడలకు అట్రాక్షన్ గా తగిలించడంతో, అవి మీజీవితంలో మీకు తీపి గుర్తులుగా నిలిచుంటాయి.

పెయింటింగ్స్: మీ ఇంటిని అలంకరించడంలో పెయింటింగ్స్ కన్నా మంచి అలంకరణలు మరొకటి ఉండదంటే అతిశయోక్తి కాదు. మీరు చౌకైన ఇంటి అలంకరణ వస్తువులను చూస్తున్నట్లైతే, మీరు మంచి ఆకర్ణణీయమైన మరియు సొగసైన చిత్రాల ఎంపిక చేసుకోవడం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి.

ఫ్లవర్ వాజ్: మీ ఇంటి అలంకరణలో ఫ్లవర్ వాజ్ చాలా చౌకగా అందుబాటులో ఉండే అలంకరణ వస్తువు. తాజా పువ్వులు మీ ఇంటి అందాన్ని రెట్టింపు చేస్తుంది. మీ ఇంటి అలంకరణకు చౌకైన హోం యాక్సెసరీస్ కావాలనుకుంటే, ఫ్లవర్ వాజ్ ను ఎంపిక చేసుకోవడం గుర్గించుకోండి.

ఇండోర్ ప్లాంట్స్: కొన్ని అందమైన ఇండోర్ మొక్కలను మీ గదిలో ఉంచుకోండి. ఇండోర్ ప్లాంట్స్ ఇల్లు మరింత అందంగా కనబడేలా చేస్తాయి. ఇంటి అలంకరణలో తక్కువ ఖర్చులో ఇంటి అలంకరణకు ఇండోర్ ప్లాంట్స్ బెస్ట్ ఎంపిక.

కుషన్స్: మీ గదిని మరింత రిచ్ గా మరియు లక్సరీగా కనబడేలా చేయాలనుకుంటే మీ సోఫా లేదా బెడ్ మీదకు కొన్ని కుషన్స్ లేదా డెరేటివ్ పిల్లోస్ ను ఎంపిక చేసుకోవడం మంచిది. ఇంటి అలంకరణలో తక్కువ బడ్జెట్ లో కుషన్లు లేదా పిల్లోలను ఎంపిక చేసుకోవడం అంత కష్టమైన పనేం కాదు. కుషన్స్ లేదా డెకరేటివ్ పిల్లోస్ ను చౌకైన గృహలంకరణ వస్తువుగా భావించవచ్చు.

కర్టెన్లు మరియు మ్యాట్స్: మీ ఇంట్లోని గదులకు మ్యాచ్ అయ్యే విధంగా కలర్స్ ను ఎంపిక చేసుకోవాలి. మీ ఇంటి అలంకరణలో తక్షణ మార్పును తీసుకురావడంలో కర్టెన్లు మరియు మ్యాట్స్ ఎంపిక చేసుకోవడం చాలా సులభ పద్దతి.

డై ఆర్ట్ వర్క్(DIY artwork): మీ ఇంటి అలంకరణకు చౌకైన వస్తువులను ఎంపిక చేసుకోవాలనుకొన్నప్పుడు, ఆర్ట్ వర్క్ కంటే ఉత్తమమైనది మరొకటి లేదు. మీ ఇంటి అలంకరణ కోసం కొన్ని ఐడియాస్ ను మీలోని సృజనాత్మకతను జోడించడంతో మీ ఇంటి అలంకరణకు మరింత ఆకర్షణ తోడవుతుంది. కాబట్టి తక్కువ బడ్జెట్ తోనే ఇంటిని అలంకరించడంలో ఇటువంటి ఉపాయలు మరెన్నో మీరే ఆలోచించండి....



Click it and Unblock the Notifications