For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ వేసవిలో మీ ఇంటిని చల్లగా మార్చేసే పదిహేను రకాల కర్టెన్లు

ఈ వేసవిలో మీ ఇంటిని చల్లగా మార్చేసే పదిహేను రకాల కర్టెన్లు

|

వేసవిలో మన ఇల్లు చల్లగా, హాయినిచ్చేదిగా ఉండాలని మనందరం కోరుకుంటాము. మండే ఎండల్లో కూడా మీ ఇల్లు అద్భుతంగా సేదతీర్చే విధంగా ఉండాలంటే, మీ కిటికీలకు ఉత్తమమైన, కొట్టవచ్చేటట్లు ఉండే కర్తెన్లను ఉపయోగించండి.

బోల్డ్ స్కై మీ ఇంట్లోకి వేసవి పిల్ల తెమ్మెరలను ఆహ్వానించి, మీ మనసుకు ఆహ్లాదం కలిగించేందుకు ఎటువంటి అందమైన కర్టెన్లను ఎంపిక చేసుకోవాలో మీ ముందుకు తీసుకువస్తుంది.ఈ లివింగ్ రూమ్ కర్టెన్ల నిర్వహణ కూడా సులభమే!

వేసవిలో మీ ఇల్లు వేడిగాలితో నిండిపోయి మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. దీనికి కారణం మీ ఇంట్లోకి చల్లని గాలిని ప్రవేశించనిచ్చే తేలికైన కర్టెన్లు వాడకపోవడం కూడా కావచ్చు. కర్టెన్ల రంగు కూడా మీ ఇంటి అందాన్ని ప్రభావితం చేస్తుంది. సరైన రంగుల కర్టెన్లు వాడితే మీ ఇల్లు ప్రకాశవంతంగా కనిపిస్తుంది. మీ లివింగ్ రూమ్ కొరకైతే మాత్రం పూల డిజైన్లు ఉన్న తేలికపాటి రంగులు ఎన్నుకోవడం ఉత్తమం.

మీ లివింగ్ రూమ్ కు శోభనిచ్చేందుకు ఏ కర్టెన్లైతే బాగుంటాయో ఇప్పుడు తెలుసుకుందాం!

పూల కర్టెన్లు:

పూల కర్టెన్లు:

మీ ఇల్లు సహజమైన ప్రకృతి రమణీయతతో అలరారుతూ ఉండాలంటే పూల డిజైన్లు ఉన్న కర్టెన్లు సరైన ఎంపిక. ఇవి తేలికగా, అందంగా ఉంటాయి.

 కుచ్చులుఉన్న కర్టెన్లు:

కుచ్చులుఉన్న కర్టెన్లు:

కుచ్చుల కర్టెన్లు ఎప్పటికి ఫేషన్ రంగంలో ముందంజలోనే ఉంటాయి. ఈ కర్టెన్లు మీ లివింగ్ రూంకి స్త్రీతత్వ శోభను చేకూరుస్తాయి. కనుక ఒంటరి మహిళలు ఉండే ఇంటికి ఇవి సరైనవి.

ప్రింట్లు ఉన్న కర్టెన్లు:

ప్రింట్లు ఉన్న కర్టెన్లు:

తెలివైన ఎంపిక కానప్పటికీ, వేసవికి ముదురు రంగు ప్రింట్లు ఉన్న కర్తెన్లను ఉపయోగించవచ్చు. మీరు కనుక ముదురు రంగులను ఇష్టపడేటట్లయితే ఇవి మీకు సరైనవి.

ముదురు రంగేపై ప్రకాశవంతమైన పేటర్నులు ఉన్న కర్టెన్లు:

ముదురు రంగేపై ప్రకాశవంతమైన పేటర్నులు ఉన్న కర్టెన్లు:

ముదురు రంగులు గదిని చీకటిగా ఉండేటట్లు చేస్తాయి. కాని ముదురు రంగుపై ప్రకాశవంతమైన పేటర్నులు ఉంటె కనుక మీ గది యోక్కరూపురేఖలే మారిపోతాయి.

ఎర్రని కర్టెన్లు:

ఎర్రని కర్టెన్లు:

చాలామంది ఇటువంటి కర్టెన్లు ఇష్టపడరు. కాని వేసవి కాలంలో మీ ఇంటికి కొత్త అందాలు చేకూర్చాలంటే ఇవి లివింగ్ రూమ్ కిటికీలకు అత్యుత్తమమైన మరియు సరైన ఎంపిక.

ఇంద్రధనుస్సు వన్నెలున్న కర్టెన్లు:

ఇంద్రధనుస్సు వన్నెలున్న కర్టెన్లు:

ఈ వేసవిని ఈ రంగులతో ఉత్సాహవంతం చేసుకోండి. మీకు విభిన్నమైన రంగులంటే ఇష్టమైతే కనుక ఇవి మీ లివింగ్ రూమ్ కిటికీలకు నప్పుతాయి.

లేత గోధుమ వన్నె కర్టెన్లు:

లేత గోధుమ వన్నె కర్టెన్లు:

సాదాసీదాతనానికి ఈ రంగు మారుపేరు. ఈ రంగు కర్టెన్లతో మీ ఇల్లు ప్రశాంతంగా మరియు అందంగా మారుతుంది.

నిమ్మ రంగులున్న కర్టెన్లు:

నిమ్మ రంగులున్న కర్టెన్లు:

ఈ వేసవిలో తాజా చల్లదనం కావాలనుకుంటే, నిమ్మ రంగు కర్టెన్లు మీకు సరైనవి.

స్వచ్చమైన తెల్లని కర్టెన్లు:

స్వచ్చమైన తెల్లని కర్టెన్లు:

మీ లివింగ్ రూమ్ కిటికీలకై స్వచ్చమైన తెల్లని కర్టెన్లు కనుక వాడినట్లయితే, మీ లివింగ్ రూమ్ కాంతివంతంగా ఆహ్వానం పలుకుతున్నట్లు ఉంటుంది.

పసుపు రంగు చెక్స్ ఉన్న కర్టెన్లు:

పసుపు రంగు చెక్స్ ఉన్న కర్టెన్లు:

చెక్స్ కలిగి ఉన్న ప్రింట్లు ఎప్పుడు ఆసక్తికరంగా ఉంటాయి. మీ ఇంటిని కూడా ఆసక్తికరంగా మార్చుకోవాలనుకుంటే, ఈ కర్టెన్లుతో మీ ఇంటికి ప్రత్యేక శోభను జత చేర్చండి.

నీలి రంగు షేడ్లు ఉన్న కర్టెన్లు:

నీలి రంగు షేడ్లు ఉన్న కర్టెన్లు:

నీలి రంగు షేడ్లు ఉన్న కర్టెన్లు మీ లివింగ్ రూమ్లో వాడినట్లయితే, అవి మీకు ప్రకృతిలో మమేకమైనట్లు ఒక ప్రత్యేక భావనను ఇస్తాయి. ఇవి వేసవికి బాగా నప్పుతాయి.

పోల్కా చుక్కలున్న కర్టెన్లు:

పోల్కా చుక్కలున్న కర్టెన్లు:

పోల్కా చుక్కలున్న కర్టెన్లను ఇష్టపడేవారు చాలామంది ఉన్నారు. మీ లివింగ్ రూమ్ గోడలు తెల్లని రంగులో ఉన్నట్లయితే, పోల్కా చుక్కలున్న కర్టెన్లు అద్భుతంగా అమరుతాయి.

చారలు కలిగిన కర్టెన్లు:

చారలు కలిగిన కర్టెన్లు:

నిండిన రంగులు కలిగిన పేటర్నులు ఉన్న కర్టెన్లు వేసవికి సరైన ఎన్నిక. ఇవి మీ లివింగ్ రూమ్ యొక్క సొగసును పెంచుతాయి.

ఘనమైన పూల సొబగులు:

ఘనమైన పూల సొబగులు:

మీ ఇరుగు పోరుగులతో పోలిస్తే మీ ఇల్లు అత్యుత్తమమనే కితాబు సొంతం చేసుకోవాలనుకుంటే, మీ లివింగ్ రూమ్ కర్టెన్ల పేటర్నులు ఈ విధంగా ఉండేట్టు చూసుకోండి.

తెల్లని లేసులున్న కర్టెన్లు:

తెల్లని లేసులున్న కర్టెన్లు:

వేసవికి అత్యద్భుతంగా ఈ కర్టెన్లు నప్పుతాయి. తేలికైన రంగు కలిగి ఉండటం వలన ఇవి ఈ వేసవిలో మీ ఇంటిని చల్లగా మారుస్తాయి.

English summary

Bright Curtains For Living Room | Curtains For Living Room Windows | Cool Summer Curtains For Living Room Windows

During summer, the entire house gets filled with hot air as the curtains you use might not be light enough for your home to receive the cool breeze. Colours do make a difference when it comes to your home. The colour of the curtain will make your home look brighter. It is best to choose sober coloured curtains with floral patterns for your living room windows.Here are some of the best curtains for your living room windows:
Story first published:Monday, May 7, 2018, 12:54 [IST]
Desktop Bottom Promotion