For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ చిట్కాలతో మీ ఇంట్లోని పాతకూలర్ ని కొత్తగా మార్చేయండి...

మీ ఇంట్లో ఉండే పాత కూలర్ ను కొత్తగా మార్చడానికి ఈ చిట్కాలను పాటించండి.

|

జూన్ మాసం వచ్చినా ఎండలు తీవ్రమంగా మండిపోతున్నాయి. వేడి గాలులు, తేమతో కూడిన ఉక్కపోతతో ప్రతి ఒక్కరూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Tips To Make Your Old Cooler New in Telugu

ఇలాంటి సమయంలోనే అందరూ ఏసీ, కూలర్లను వాడుతూ ఉంటారు. చాలా మంది పాత కూలర్లను, ఏసీలను పక్కనపెట్టేసి కొత్త వాటి కోసం షాపులకు వెళ్తుంటారు లేదా ఆన్ లైనులో ఆఫర్ల కోసం అన్వేషిస్తూ ఉంటారు. అయితే సామాన్యులు మాత్రం ఖరీదైన ఏసీల జోలికి వెళ్లకుండా కూలర్లతోనే సరిపెట్టుకుంటారు.

Tips To Make Your Old Cooler New in Telugu

వాటి నుండి వచ్చే చల్లగాలితో ఉపశమనం పొందుతారు. అయితే ప్రస్తుతం పెరిగిన ధరల కారణంగా, మీరు కొత్త వాటిని కొనలేకపోతున్నామని బాధపడుతున్నారా? పాత కూలర్ కు బదులుగా కొత్తది ఎలా మార్చాలని చూస్తున్నారా? అయితే అందుకోసం మీరు ఎక్కువ ఖర్చులు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీతో ఉండే పాత కూలర్ ను చాలా సులభంగా కొత్తగా మార్చుకోవచ్చు. మీరు కోరుకున్న చల్లని గాలిని ఆస్వాదించొచ్చు. ఈ సందర్భంగా మీ పాత కూలర్ ను సరికొత్తగా ఎలా మార్చాలనే చిట్కాలను ఇప్పుడు తెలుసుకుందాం...

చల్లని గడ్డి..
మోటారు మరియు ఫ్యాన్ తో పాటు ఎడారి కూలర్ లో గసగసాల గడ్డి ఉంటుండి. ఈ గడ్డి నుండి కూలర్లోని నీటితో చల్లని గాలి వస్తుంది. అయితే కాలానికి అనుగుణంగా గడ్డిని మారుస్తూ ఉండాలి. ఎందుకంటే దానిపై దుమ్ము పేరుకుపోవడం వల్ల అది నిరోధించబడుతుంది. ఈ కారణంగా కూలర్ నుండి చల్లని గాలి రావడం ఆగిపోతుంది. గడ్డి చాలా పాతబడితే, కూలర్ నుండి వచ్చే గాలి కూడా దుర్వాసన వస్తుంది.

కొత్త పెయింట్..
పాత కూలర్ ను శుభ్రం చేసిన తర్వాత, దానికి సరైన కలర్ జోడించండి. అందుకోసం మీ ఇంట్లో ఉండే కూలర్ ను సులభంగా మీరే పెయింట్ చేసేయ్యండి. ఇది మీ కూలర్ ని మళ్లీ బలపరుస్తుంది. దీంతో ఇది కొంచెం కొత్తగా కనిపిస్తుంది.

ఫ్యాన్ సర్వీసింగ్..
కూలర్ ని రన్ చేసే ముందు, దాని ఫ్యాన్ కు సర్వీసు చేయించండి. ఎందుకంటే మీరు ఎక్కువ కాలం కూలర్ ను వాడకుండా ఉంటే, అది సరిగా పని చేయదు. కాబట్టి ముందుగానే మీ ఫ్యాన్ ను చెక్ చేసుకోవడం మంచిది. ఇక కూలర్లలో వాటర్ పైపులు చాలా త్వరగా పాడైపోవడం తరచుగా కనిపిస్తుంది. అవి పాడైనప్పుడు, కూలర్లోని నీటి ఒత్తిడిని భరించలేవు. ఒకవేళ ఇవి చెడిపోయినట్లయితే, మార్కెట్లో ఇవి కేవలం 100 నుండి 150 రూపాయలకే దొరకుతాయి.

కూలర్లో నీరు లీకవ్వడం..
మన ఇంట్లో పాత కూలర్లలో నీరు లీకవ్వడం అనేది సహజంగా జరుగుతుంది. ఇదొక పెద్ద సమస్యగా చెప్పొచ్చు. అయితే దీనికి సులభమైన పరిష్కారం ఉంది. ఆ నీటి లీకేజీని ఆపేందుకు మీరు M-సీల్ సహాయం తీసుకోవచ్చు.

ఇక్కడ తెలిపిన సాధారణ చిట్కాలతో మీ పాత కూలర్ ను కొత్తగా మార్చుకోవడమే కాదు.. వేసవిలో ఏసీ లాంటి చల్లదనాన్ని అనుభవించొచ్చు. అంతేకాకుండా మీ ఇంట్లో కూలర్ ను ఉంచేటప్పుడు, సరైన వెంటిలేషన్ ఉన్న గదిలో కూలర్ ను ఎల్లప్పుడూ ఉంచడం వంటి కొన్ని విషయాలపై మీరు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. లేకపోతే చల్లని గాలి దాని బయటకు రాదు. మీ రూమ్ లో కూడా తేమ ఎక్కువగా ఉంటుంది. ఇది కాకుండా మీరు కిటికీ దగ్గర్లో కాకుండా, నీడ ఎక్కువ ఉండే ప్రాంతంలో కూలర్ ను ఉంచండి.

English summary

Tips To Make Your Old Cooler New in Telugu

Here are the Tips to make old cooler new in Telugu: Follow these easy tips to make your old cooler new.
Story first published:Tuesday, June 7, 2022, 12:17 [IST]
Desktop Bottom Promotion