Latest Updates
-
కాలిగోళ్లు నల్లగా, పసుపు రంగులో ఎందుకు మారతాయో తెలుసా?..క్యాన్సర్ సంకేతం కూడా కావచ్చు! -
డైట్ పట్టింపులనూ పక్కనపెట్టేస్తారు.. రాత్రి మిగిలిపోయిన అన్నంతో హెల్తీ గ్రీన్ ఎగ్ రైస్.! -
పుట్టిన తేదీ ప్రకారం పర్సులో వీటిని పెట్టుకుంటే.. లక్ష్మీదేవి మిమ్మల్ని విడిచే ప్రసక్తే లేదు.! -
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం!
అపార్టుమెంటులో కూరల పెంపకం!

ఎక్కడ పెంచాలి? కూరల మొక్కలు బాల్కనీలో, లేదా ఫెన్సింగ్ వెంబడి లేదా విండోలో వుంచే కంటైనర్లలో కూడా పెంచవచ్చు. కొద్దిపాటి శ్రమ, ఆలోచనలు వుంటే, తాజా కూరలు, సుగంధ ద్రవ్యాలు అపార్టుమెంటు జీవనంలో కూడా సాధ్యమే.
ఏ మొక్కలు పెంచాలి? చిన్న సైజులో పెరిగే మొక్కలు అంటే, వంకాయ, టమాటా, ఉల్లి, ముల్లంగి, క్యాప్సికం, కుకుంబర్, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, పచ్చి మిర్చి మొదలైనవి పెంచవచ్చు.
ఏరకమైన కంటైనర్లు వాడాలి? దీనికిగాను ఏ కూరలు వేయాలి? ఎంత స్ధలం వుంది? అనేవి పరిశీలించాలి. కరివేపాకు, మిర్చి వంటి వాటికి చిన్న కంటైనర్లు చాలు. మిగిలినవాటికి కొద్దిపాటి పెద్ద కంటైనర్లు వాడండి.
కుండీలు ఎలా? కిటికీలలో వుంచే వాటికి బాక్సులు, బాల్కనీలోకి మట్టి లేదా టెర్రకొటా కుండీలు మొక్కలకు బాగుంటాయి. కుండీల కింద ప్లేటు వుంచితే నీరు నేలపై కారకుండా వుంటుంది. ఇంటిలో పాత బకెట్లు లేదా బేస్కెట్ వంటివి కూడా మొక్కల ఎదుగుదలకు బాగుంటాయి. ఏ కుండీ పెట్టినప్పటికి నీరు బయటకు పోయేటందుకు రంధ్రాలు వుండేలా చూడండి. రోజులో తగినంత సూర్యరశ్మి వీటికి తగిలేలా చూడండి.
విత్తనాలు - మొక్కల విత్తనాలు నర్సరీలలో లభిస్తాయి.
మట్టి - మట్టి తేలికైనది, మెత్తనైనదిగా వుండాలి. తేమను పట్టుకునేట్లుండాలి. దీనికి సేంద్రీయ ఎరువు లేదా కంపోస్టు కలిపితే మొక్కలు బాగా పెరుగుతాయి. లేదా కిచెన్ లో వచ్చే కూరల తొక్కలు వంటివి కూడా ఎరువుగా వేయవచ్చు.
నీరు - నీరు ప్రతిరోజూ తగినంత మాత్రమే పోయండి.
ఎరువులు - మార్కెట్ లో లభ్యమయ్యే లిక్విడ్ ఫెర్టిలైజర్లు వాడండి. పోసే నీటిలో వేప ఆకులు, పూలు వేసిన మిశ్రమాన్ని పోయండి. వీటికి క్రిములు, వ్యాధులు రాకుండా సంరక్షించండి.



Click it and Unblock the Notifications
