Latest Updates
-
నల్ల శనగలతో ఇలా చేసుకుని తింటే లెక్కలేనన్ని లాభాలు.. ఫిట్నెస్ ప్రియులకు పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్.! -
ఎన్నడూ లేని విధంగా ప్రధాన గ్రహాల సంచారం, అదృష్ట యోగాలు.. ఈ రాశుల వారికి సిరిసంపదల వరాలు.! -
జపనీస్ క్లౌడ్ ఆమ్లెట్ ఎప్పుడైనా తినారా? మెత్తగా, ఉబ్బెత్తుగా రావాలంటే ఈ చిట్కా పాటించండి -
బ్యాగ్ సర్దుకుని బయలుదేరడమే.. ఈ 3 రాశుల వారికి ట్రావెలింగ్ అంటే మహా పిచ్చి! -
విటమిన్లు, ఐరన్ గని..మునగాకు తొక్కు ఇలా చేసి తింటే జీవితంలో హాస్పిటల్ గుమ్మం తొక్కరు!..యమా రుచి కూడా -
పోషకాలు ఫుల్,ఫైవ్ స్టార్ హోటల్ రుచిని తలదన్నే వెల్లుల్లి సోయా రైస్..ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
నోటికి కమ్మగా, కడుపులో చల్లగా.. కీరదోసకాయతో విలేజ్ స్టైల్ మజ్జిగ పులుసు.! -
సూర్యుడు, శని ఎదురెదురుగా.. ఈ 5 రాశులకు అక్టోబర్ 17 వరకు తీవ్ర నష్టం! -
ట్రైనర్ లేకుండా మొదటిసారి యోగాసనాలు వేస్తున్నారా.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
సర్వ రోగాలకు మూలం కడుపే..పేగుల్లో పేరుకుపోయిన చెత్తను బయటకు పంపే 10 ఫుడ్స్
అపార్టుమెంటుల్లో కూరల పెంపకం!

కూరగాయల మొక్కలను బాల్కనీ, లేదా ఫెన్సింగ్ ప్రదేశాలలో, విండోలలో పెంచవచ్చు. వంకాయ, టమాటా, పచ్చిమిరప, కొత్తిమీర వంటివి కంటైనర్లు లేదా మొక్కల కుండీలలో పెంచి తాజా కూరలు ఆనందించవచ్చు. మొక్క ఎదిగే తీరును బట్టి కుండీ చిన్నది పెట్టాలా? లేక పెద్దది పెట్టాలా అనేది నిర్ణయించండి.
కుండీలు, మట్టివి, సిమెంట్ తో చేసినవి లేదా కొన్ని ఇతర డబ్బాలు, చెక్కవి, ప్లాస్టిక్ వి వాడవచ్చు. ఏది వాడినప్పటికి మొక్కకు పోసిన నీరు బయటకు పోయేలా రంధ్రం వుండాలి. నేలపై నీరు పడకుండా కుండీ అడుగున సాసర్లు లేదా ప్లేటు వంటివి ఏర్పరచండి. విత్తనాలు సమీప నర్సరీలలో దొరుకుతాయి. విత్తనాలు, మన్ను, నాణ్యతగలవిగా ఎంపిక చేయండి.
మొక్క ఎదుగుదలను బట్టి ప్రతిరోజూ కుండీలలో తేమ వుండేలా నీటి అవసరం చూడండి. నేడు అందుబాటులో వున్న లిక్విడ్ ఫెర్టిలైజర్లు ఉపయోగానికి బాగుంటాయి. మొక్కలకు పురుగులు పట్టకుండా, వ్యాధులు రాకుండా తగిన పురుగు మందులు వేయండి. విత్తనాలు నాటాలంటే సహజంగా వర్షాలు పడిన తర్వాత మంచి సమయం. మొక్క చిన్నదిగా వున్నపుడు ఎండ అధికంగా తగలకుండా జాగ్రత్త వహించండి.



Click it and Unblock the Notifications
