Latest Updates
-
రాయలసీమ కారం చికెన్: ఈ ఒక్క సీక్రెట్ మసాలాతో చేస్తే టేస్ట్ జబర్దస్త్ -
మంచింగ్కి మస్తుగా ఉండే గోంగూర మటన్ లివర్ ఫ్రై.. బ్యాచ్లర్స్ సైతం ఈజీగా చేసుకోవచ్చు.! -
హైదరాబాద్ లో పోలీస్ పైశాచికత్వం: మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి..వీడియో చూడండి -
రఫ్ క్యారెక్టర్లో తగ్గేదే లే.. ఈ రాశుల వారు తప్పున్నా సారీ కూడా చెప్పరట.! -
రాజస్థానీ మలై ప్యాజ్.. రోటీ, చపాతీల్లోకి బెస్ట్ సైడ్ డిష్..ఎలా చేసుకోవాలంటే.. -
చుక్క నూనె, ఇసుక లేకుండానే రోస్టెడ్ పల్లీలు.. ఎలా చేసుకోవాలంటే -
వీటిని ఫ్రిజ్లో పెట్టి తింటే క్యాన్సర్ రావడం పక్కా.. పొరపాటున కూడా ఈ పని చేయకండి.! -
అల్లుడిపై ఐదుగురు పిల్లల అత్త వ్యామోహం..కన్న కూతురికే సవతిలా మారి..చివరికి ఏమైందంటే.. -
నల్ల శనగలతో ఇలా చేసుకుని తింటే లెక్కలేనన్ని లాభాలు.. ఫిట్నెస్ ప్రియులకు పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్.! -
ఎన్నడూ లేని విధంగా ప్రధాన గ్రహాల సంచారం, అదృష్ట యోగాలు.. ఈ రాశుల వారికి సిరిసంపదల వరాలు.!
పిల్లలకు అవగాహన కలిగించే మొక్కల పెంపకం...!

మట్టి, ఇసుక, నీరూ ఈ మూడు అంటే ఇష్టపడని పిల్లలుందడరు. కానీ వాళ్లు అలా నీటి జోలికి వెళ్లగానే జలుబు చేస్తుంది. దుస్తులు మరకలవుతాయి.. అంటూ వెనక్కిలాగుతుంటాం. అదే వాళ్లకు ఇష్టమైన ఆ విషయాలతోనే తోట పని నేర్పిస్తే చక్కగా ఆడుతూపాడుతూ నేర్చుకుంటారు. పెద్దవాళ్ల పర్యవేక్షణతో పాటు అందుబాటులో ఉండే వస్తువులతోనే ఈ తోటపని నేర్పించవచ్చు.
పిల్లలు నీళ్లతో ఆడటానికి ఎక్కువ ఇష్టపడతారు కాబట్టి వారి ఆసక్తికి అనుగుణంగా వాటర్ ప్లాంట్ రకాలని పెంచేట్టుగా ప్రోత్సహిస్తే ఉత్సాహంగా ముందుకు వస్తారు.
ఇందుకోసం నాలుగడుగుల లోతు ఉండే కుండీలతో పాటు రెండడుగుల లోతు ఉండే కుండీలు ఎంపిక చేసుకోవాలి. ఇవి సిమెంట్ మట్టితో చేసినవి కాకుండా ప్లాస్టిక్ తో చేసినవి అయితే మేలు. తేలిగ్గా ఉండి పిల్లల పొరపాటున మీద వేసుకొన్నా పెద్దగా ప్రమాదం ఉండదు. అలాగే యాభై శాతం మట్టి, యాభై శాతం కుళ్లిన ఆకులతో చేసిన ఎరువు కలిపిన మిశ్రమాన్ని దగ్గర పెట్టుకోవాలి. వాటితో పాటు రెండు మూడు గప్పీ చేసలు ఉంటే చాలు తోటపనికి అవసరం అయిన సామాగ్రి అంతా సిద్దమైనట్టే.
ఆరుబయటి చిన్న స్థలాన్ని.. అపార్ట్ మెంట్ అయితే కుండీలు పెట్టుకోవాడనికి కొద్దిపాటి స్థలాన్ని..పిల్లలకోసం కేటాయించాలి. ఇక నుంచి ఈ స్థలం నీది అంటూ వాళ్లకు దానిని శుభం చేసే బాధ్యతలని అప్పగించాలి.
పిల్లలు పెంచుకోవడానికి అనువైన మొక్కలు:
1. మాస్ మెరీగోల్డ్(గడ్డిపూలు): ఇది కాసత్త అరుదుగా దొరికే రకం మొక్క.. నర్సరీల్లో లభ్యమవుతుంది.
2. పపేరస్: ఈ మొక్క నీటిలో తేలుతుంది. పసుపు, ఉదా పూలు పూస్తాయి. విత్తనాలు ఉంటాయి. వృక్షశాస్త్రానికి సంబంధించిన పాఠాలు దీనిని చూపించి చెబితే చిన్నారులకు సులభంగా అర్థమవుతుంది.
3. ఫెరీమాస్(నీటిలో పెరిగే అందమైన నాచు): పెద్ద ఆకులతో ఉండే నాచురకం మొక్క. సులభంగా పెరుగుతుంది.
4. వాటర్ పాపీ: పసుపు, తెలుపు పూలు పూస్తుంది.
5. వాటర్ లెట్యూస్: దీనినే వాటర్ క్యాబేజీ అంటారు. పెంచడం చాలా తేలిక.
6. వాటర్ లిల్లీ: కలువలోనే చిన్న రకం ఇది. దీనిని ఇంట్లోనే సులభంగా పెంచుకోవచ్చు. ఒక్కసారి పూయడం మొదలుపెడితే ఎండ తీవ్రతను బట్టి అవి పూస్తూనే ఉంటాయి. త్వరత్వరగా పూసే ఈ రకం పూల వల్ల పిల్లల్లో ఆసక్తి పెరుగుతూ ఉంటుంది.
7. తామర: చూడ్డానికి అందంగా ఉండే దీనిని పెంచాలంటే కనీసం ఐదడుగుల లోతున్న కుండీ ఉండాలి. ఇది దుంప రకం. విత్తనాలు కూడా పెరుగుతాయి.
ఈ రకం మొక్కలని ఎంపిక చేసుకోవడం వల్ల వాళ్లకు మొక్కలు నీటిని ఎలా పీలుస్తాయి, వేర్లు ఎదుగుతల, పూత వంటి తదితర సైన్స్ విషయాలని తెలియజేయవచ్చు. వీటిని నాటడం చాలా తేలిక. ఎంపిక చేసుకొన్న రంధ్రాలు లేని ప్లాస్టిక్ కుండీల్లో ఒకటిన్నర అడుగు వరకూ నీరు, ఆకులు కుల్లబెట్టిన మట్టిని కలిపి వెయ్యాలి. అప్పుడు మొక్కని నాటి కుండీని నీటితో నింపాలి. నీటిని అంచుమీదగా పోస్తే మొక్క కదలకుండా ఉంటుంది. అయితే ఇవన్నీ ఎండ ఆధారంగా చేసుకొని బతికే మొక్కలు. నీటి బాగోగులు పిల్లలకు అప్పగిస్తే వారిలో బాధ్యత అలవడుతుంది.
నీరు నిలిచిపోవడం వల్ల దోమలు వస్తాయి. కుండీలో రెండు గ్పీ చేపలని వేస్తే అవి దోమలని తినేస్తాయి. తోటపనిలో తాము గమనించిన విషయాలని అమ్మానాన్నలకు, వారి స్నేహితులు, టీచర్లకు చెప్పడం వల్ల వారి బందాలను బలపరుస్తయి. ఫలితంగా వారిలో సున్నితత్వం, విలువలు పెరుగుతాయి.



Click it and Unblock the Notifications
