Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
ఇంటి పట్టునే ఆరోగ్యం...పచ్చదనంతో ఆహ్లాదం....!

తులసి: ఎంతో పవిత్రంగా భావించే మొక్క ఇది. టీస్పూను తులసి రసంలో చిటికెడు మిరియాల చూర్ణం వేసి సేవిస్తే జలుబు, రొంప, గొంతు బొంగురు ఉపశమనమిస్తాయి. రెండు టీస్పూన్ల తులసి రసం రోజుకు రెండు సార్లు సేవిస్తే అనేక రకాల జ్వరాలు తగ్గిపోతాయి. తులసి రసాన్ని వేడి చేసి ఒకటి రెండు చుక్కలు చెవిలో పోస్తే చెవినొప్పి తగ్గిపోతుంది. తులసి ఆకులు, లవంగాలు కలపి నూరి ముద్దగా వేసి పన్ను నొప్పి వద్ద ఉంచితే నొప్పి తగ్గుతుంది. చర్మం, ముఖంపై వచ్చే నల్ల మచ్చలు తగ్గడానికి తులసి రసంలో నిమ్మరసం, పసుపు చేర్చి రాసుకోవాలి. ఇవే కాకుండా అతిసిరం, మూర్చవ్యాధి, వ్యాధినిరోధక శక్తకి తులసి ఆకు ఎంతో ఉపయోగపడుతుంది.
కలబంద: ఇది ఒక గుత్తి వలె పాత్రాలు వచ్చే బహువార్షికపు మొక్క. దాదాపు అరవై సెం.మీ ఎత్తువరకు పెరుగుతుంది. ఆకులు జిగటగా ఉన్న గుజ్జుతో అంచులకు ముళ్ళు ఉంటాయి. పుష్పాలు నారింజ పసుపు రంగులో ఉంటాయి. ఆకులు, ఆకులలో ఉండే గుజ్జు పసుపు పచ్చిని ద్రవం ఔషద గుణాలను కలిగి ఉంటుంది. మొటిమలు, కాలిన గాయాలతో ఏర్పడ్డ మచ్చలు నివారించవచ్చు. దగ్గుకు కలబంద రసం ఒక స్పూను, మిరియాల పొడి అరస్పూను, శొంఠి పొడి పావుకప్పును కలిపి తేనెతో సేవించాలి. చర్మ సంరక్షణలోనూ, సౌందర్య సాధనాలలోను కలబందను విరివిగా వినియోగిస్తున్నారు.
ఒత్తిడిని తగ్గించే సరస్వతీ మొక్క: సరస్వతి ఆకుకు ఒత్తిడిని తగ్గించి నిద్రలేమిని పొగొట్టే శక్తి ఉంది. జ్ఞాపకశక్తిని పెంచేందుకు సరస్వతి ఆకులను దంచి రసం తీసి, సమానంగా ఆవునెయ్యి వేసి కాచి 2,3 చుక్కలతో ప్రారంభించి ప్రతిరోజూ 30చుక్కల వరకు పాలతో కలిపి తాగేస్తే పిల్లల్లో జ్ఞాపకశక్తి పెరుగుంది. కీళ్ళ నొప్పులకు సరస్వతి ఆకు రసాన్ని నువ్వుల నూనెతో కలిపి వెచ్చచేసి నొప్పి గల కీళ్లపై వేసి మర్దన చేయాలి. జ్వరతాపం ఎక్కువగా ఉన్నా సరస్వతి ఆకును మొత్తగా నూరి శరీరంపై లేపనం చేయాలి.
అశ్వగంధ: అశ్వగంధ అనేది సంస్కృత పదము. దీనికి పెన్నేరుగడ్డ అని కూడా పేరు. ఇది అన్ని ప్రాంతాలలో లభిస్తుంది పువ్వులు పసుకలిసిన ఆకుపచని రంగులో వుండును. ఇది సుమారు ఒకటిన్నర మీటర్ పొడవు పెరుగును. ఎరుపు రంగులో దీని పండ్లు వుండి దీని వేరు తెలుపు బూడిద రంగులో వుటుంది. అశ్వగంధను పొడి, లేహ్యం రూపంలో ఎక్కువగా వాడుతుంటారు. ఉపయోగాలు : దీనిని ఎవరైనా వాడవచ్చును. ఇది మానసిక ఒత్తిడిని తగ్గించి, రోగానిరోగనిరోధకశక్తిని పెంచి నరాలకు, కండరాలకు బలాన్ని ఇస్తుంది. వాత, పిత్త ములను సమస్తితిలో వుంచుతుంది. శరీరంలో కణాల పెరుగుదలకు సహాయపడును. అశ్వగంధ ముక్కలు ముక్కలుగా చేసి నీళ్ళుపాలతో సగమయ్యే దాక మరిగించి ఆ కషాయాన్ని నెయ్యితో కలిపి వాడితే వాత సంబందమైన నొప్పులు తగ్గుతాయి. రక్త పోటును సమస్తితికి తేచి, హృదయ వేగాన్ని సరిదిద్దును. అశ్వగంధ శన్ఖపుష్పితో శతావరితో కలిపి పిల్లలకిస్తే మెదడు చల్లబడి మంచి పోషణ కలిగి జ్ఞాపక శక్తి పెరుగుతుంది.
తిప్ప తీగ : ఇది తీగలాగా పాకుతూ పెరుగుతుంది కనుక దీనిని తిప్పతీగ అని పిలుస్తారు. దీనికి అమృతలత అని కుడా పేరు. దీనికి గల శాస్త్రీయ నామము 'టినోస్పోరా కార్డిఫోలియా'. ఇది తీగలాగా పాకుతూ పెరుగుతుంది కనుక దీనిని తిప్పతీగ అని కూడా పిలుస్తారు. దీనిని సులభంగా గుర్తించవచ్చును. ఎలాగంటే చిన్న చిన్న ఆకులు, ఆకుపచ్చ పసుపు రంగు పువ్వులు, కాండం బలంగా వుండును. చేదు రుచి కల్గి త్ర్రిదోషాలను ( వాత, పిత్త, కఫం లను ) సమం చేస్తుంది. చర్మ రోగాలకు, శరీరంలోని నొప్పులకు, వీర్య వృద్దిని, శరీరానికి పునః శక్తిని ప్రసాదిస్తుంది. తిప్ప తీగలోని రసాయనాలు యాంటి ఆక్సిడెంట్స్ గా పని చేసి రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది.
దీనిని కాషాయం గాను, చూర్ణం గాను, లేహ్యంగాను, ఆకును వంట కూరల్లోను వాడుతారు. ఇతర ఆయుర్వేద మూలికలను కలిపి అనేక వ్యాధులను నయం చేయుటలో సహాయపడును. తిప్ప తీగ రసం లేదా పొడిని తేనెతో, సాయంత్రం ఒకటి లేదా రెండు చెంచాల మోతాదులో భోజనం / టిఫిన్ కు అరగంట /గంట ముందు తీసుకుంటూ వున్నా తొందరగా కీళ్ళ నొప్పులు, శరీర వాపులు నయమగును. మధుమేహ రోగ గ్రస్తులైతే ఉదయం, సాయంత్రం క్రమం తప్పకుండా సుమారు ౫ గ్రాములు వరకు పెద్దలు, పిల్లలు రెండు నుండి మూడు గ్రాములు మోతాదులో తీసుకున్న ఎడల త్వరగా మధుమేహం తగ్గుతుంది.



Click it and Unblock the Notifications











