Latest Updates
-
తగ్గేదేలే.. పుట్టిన నిమిషానికే డాక్టర్‌తో పోటీ.. లక్షల వ్యూస్‌తో దూసుకుపోతున్న వైరల్ వీడియో -
సాయంత్రం చిరుతిళ్లకి ఏం చేయాలో తెలియట్లేదా.. చిరు చినుకుల్లో ఈ సింపుల్, హెల్తీ స్నాక్స్‌పై ఓ లుక్కేయండి.! -
తొలి ఏకాదశి పర్వదినం.. విష్ణుమూర్తికి ప్రీతికరమైన తులసీ పూజ ఇలా చేస్తే కష్టాలు తొలగిపోతాయి.! -
లంచ్ తర్వాత విపరీతంగా నిద్ర మత్తు.. వీటిని అలవాటు చేసుకుంటే ఇక కునుకు మాటే ఉండదు.! -
వాతావరణ మార్పులతో మోకాళ్ల నొప్పుల బాధలు.. ఉపశమనం కోసం ఇంట్లోనే ఇలా చేయండి.! -
తిరోగమనం నుంచి బయటపడ్డ బుధ గ్రహం.. ఇక ఈ రాశుల వారి దశ తిరిగినట్లే.! -
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా..
ఇంటి ఆవరణలో ఇలాంటి మొక్కలు ఉండకూడదా...?

ఈ విధమైన ఉదయం, సాయంత్రపు నడక అందరు అలవరచుకొనుట మంచిదని డాక్టర్లు విజ్ఞానవేత్తలు తెలుపుతున్నారు. కనుక ఇంటి ఆవరణను బట్టి ప్రతి ఇంట్లోనూ చెట్లను, పూల మొక్కలను పెంచుట ఉత్తమం. చిన్న మొక్కలు పూల చెట్లను వీలయినంతవరకు తూర్పు ఉత్తర ఆవరణలో పెంచుట మంచిది. ఈశాన్య భాగములో బావి వద్ద చెట్టను పెంచుట మంచి ఫలితములను ఇవ్వగలవు.
అశోఖ చెట్లను అందము కోసం అలంకరణ కోసం తూర్పు ఉత్తర దిక్కులందు పెంచుట మానివేయవలయును. అవి ఏపుగా ఇంటికన్న చాలా ఎత్తు ఎదిగి ఇంటిలోనికి సూర్య కిరణములు ప్రసరించుటకు అడ్డుగా ఉండును. ఇంటి ఆవరణంలో ఈ చెట్లు ఉండరాదు...
1. ముళ్లు గల చెట్లు
2. మునగ చెట్లు
3. మర్రిచెట్టు
4. పాలుగారు చెట్లు
5. అశోక వృక్షములు
మొదలగు జాతి వృక్షములను ఇంటి ఆవరణలో పెంచుట అంత మంచిది కాదు. వేప చెట్టును పెంచుకోవచ్చును. వేప మంచి నీడనివ్వడమేగాక ఔషధపరంగా మనిషికి మంచి మేలు, ఆరోగ్యము చేకూర్చును. పూల మొక్కలను ఏ దిక్కులోనైనా పెంచుకొనవచ్చును. అదేవిధముగా పూలకుండీలను తూర్పు ఉత్తర ప్రహరీగోడలపైన ఉంచరాదు. తూర్పు ఉత్తర దిక్కులందు మేడల మీదగాని ఎక్కడయినా ఎత్తుగా గోడలు కట్టి అందు మట్టిని నింపి మొక్కలను పెంచరాదు. ఒకవేళ ఎవరయినా చేసి ఉన్నట్లయితే తక్షణమే తీసి వేయుట మంచిది. ఎందుకంటే వాటి టాప్ లెవలు ఇంటి ఫ్లోర్ లెవలుకన్న ఎత్తు ఉండుట మరియు ఆ దిక్కులందు బరువు అగుట వలన మిక్కిలి చెడు ఫలితములను కలుగజేయును. కాబట్టి కొన్ని మొక్కలను పెంచుకొనుటలో వాస్తుకూడా ముఖ్యమైన ప్రాధాన్యతను చూపిస్తుంది.



Click it and Unblock the Notifications