Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఇంటికి అందం స్టైయిర్ కేస్ గార్డెన్..

తొట్లను తొలుత మట్టితో నింపాలి. తొట్టి అంచుల వద్ద కనీసం నాలుగయిదు అంగుళాల దిగువకే మట్టి ఉంచాలి. దీని వలన మొక్కకు ఎరువు వేసేందుకూ, నీరు పోసుకు నేందుకూ అనువుగా ఉంటుంది. నీరు పోసినప్పుడు మట్టి బయటకు పోదు. రకరకాల గడ్డినిగానీ, కూరగాయలను గానీ ముక్కలుగా చేసి మట్టిలో కలపాలి. ఈ గడ్డి చీకి మొక్కలకు ఎరువుగా ఉపయోగపడుతుంది. మట్టంతా తడిచేలా నీరు పోయాలి. మూడునాలుగు వారాల తర్వాత ఎంపిక చేసుకున్న విత్తనాలను తొట్లలో నాటాలి. గోంగూర, టమోట, మిర్చిలాంటివయితే ముందు నారు పోసు కోవాలి. నారు వేర్లు బలపడక ముందు పీకి తొట్లలో నాటు కోవాలి. మందు నీటిని చల్లి మట్టి నానిన తర్వాతే నారు పీకాలి.
భూమిలో తగినంత తడిలేకపోతే నారు వేర్లు తెగిపోయే అవకాశం ఉంది. విత్తనాలు మొలకెత్తే వరకూ తగుమోతాదులో మాత్రమే నీటిని చిలకరించాలి. నీరు ఎక్కువైతే విత్తలనాలు అధికంగా నాని మునిగిపోతాయి. మొలకెత్తిన మరుసటి రోజునుంచీ తడి అరకుండా నీటిని పోస్తుంటే సరిపోతుంది. ఉదయం పూట, సాయం సంధ్య తర్వాతే నీటిని పోయాలి. అంటే ఎండ తక్కువగా ఉన్నప్పుడే మొక్కలకు నీరు పెట్టాలి. మొక్క మొదలు దగ్గర మట్టిని ఎత్తుగా ఉంచటం వలన మొక్క కాండానికి నేరుగా నీరు తగలకుండా ఉంటుంది. దానివలన మొక్క కుళ్ళి పోకుండా ఉంటుంది. కాండం నిరంతరం నీటిలో నాను తుంటే కొన్ని రకాల తెగుళ్లు కూడా సోకే ప్రమాదం ఉంటుంది.
వారానికి కనీసం రెండు మూడా సార్లుగా పండ్లు, కూరగాయల వ్యర్థాలను చిన్నచిన్న ముక్కలుగా తరిగి మట్టిలో కలుపుతుంటే మొక్కలకు తగినంత ఎరువు లభ్యమవుతుంది. చెకచెకా ఎదుగుతాయి. మొక్కలు ఎదిగేకొద్ది తెగుళ్ళుసోకే ప్రమాదం ఉంటుంది. మొక్కల్లో ఏ భాగంలోనయినా మార్పు కన్పించగానే తగు జాగ్రత్తలు, నివారణా చర్యలు చేపట్టాలి.



Click it and Unblock the Notifications