For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మొదటి వార్షికోత్సవానికి బహుమతిని ఎంచుకోవడం ఎలా?

|

ఏ జంటకైనా మొదటి వార్షికోత్సవం ఏంతో ముఖ్యమైనది మరియు అత్యంత మధురమైనది. వార్షికోత్సవం అంటే, రెండు జీవితాలని ఒకటిగా కలిసి జీవించడంలో విజయం సాధించినట్టే. ఒక సంవత్సరం వార్షికోత్సవానికి సాధారణంగా పేపర్ తో చేసిన బహుమతుల్ని కానుకలుగా ఇవ్వవచ్చు. అయినప్పటికీ, ఆధునిక ప్లాస్టిక్ వస్తువులు లేదా క్లాక్స్ వంటి వాటిని ఇప్పుడు కానుకలుగా ఇవ్వడం మొదలుపెట్టారు. ఆలోచన, సృజనాత్మకల కలయికతో ఆయా సందర్భాలకి తగిన బహుమతిని ఎంచుకునే అవకాశం లభిస్తుంది.

ఉదాహరణకి కొన్ని సూచనలు:

1. మొదటి వార్షికోత్సవ కానుకకి సంబంధించిన బడ్జెట్ ని ప్లాన్ చేసుకోండి. మొదటి వార్షికోత్సవాన్ని జరుపుకునే జంటలకు మీరు ఎంతగా దగ్గరివారో, మీకు వారు ఎంతగా తెలుసో గుర్తించడం ద్వారా బడ్జెట్ ప్లాన్ చేసుకోవచ్చు. మీ బడ్జెట్ ని దృష్టిలో పెట్టుకుని కానుకని ఎంచుకోండి. ఒకవేళ మీ దగ్గర డబ్బులు తక్కువగా ఉన్నట్లయితే, ఖరీదైన కానుకలని కొనడానికి ప్రయత్నించకండి. ఇంట్లో తయారు చేసే బహుమతులు బయట కొన్న కానుకల కంటే ఏంతో ఆకర్షణీయంగా ఉంటాయని మనసులో ఉంచుకోండి. మంచి అభిప్రాయాన్ని కలిగించడానికి ఖరీదైన కానుకలని కొనే ప్రయత్నం మానుకోండి.

2.సాంప్రదాయకంగా కనిపించే ఒక పేపర్ గిఫ్ట్ ని ఎంచుకోండి. ఈ విభాగంలో కి ఎన్నో కానుకలు వస్తాయి. ఒక వేళ ఆ జంటకి పిక్చర్స్ వంటివి ఇష్టమయితే స్క్రాప్ బుక్, లేదా ఫోటో ఆల్బం లేదా ఫొటోగ్రాఫ్ లని బహుమతిగా ఇవ్వవచ్చు. పుస్తక ప్రియులకి పుస్తకాలని బహుమతిగా ఇవ్వవచ్చు. ప్రేమతో ఇచ్చే ఏనివేర్సరీ కార్డు ప్రధాన పాత్ర పోషిస్తుంది. స్వయంగా రాసిన కవిత్వం లేదా ఉత్తరం బహుమతిగా ఇవ్వడం కూడా మంచి ఆలోచన. పేపర్ రొసెస్, సినిమాకి టికెట్లు, లేదా వారికిష్టమైన ప్రోగ్రాం ఈవెంట్ కి టికెట్లు వంటివి కూడా చక్కటి బహుమతులు.

How to Select a Proper Gift for a One Year

3. ఆధునిక ప్లాస్టిక్ వస్తువులు లేదా గడియారాలని ఎంచుకోండి. తరచూ అందుకునే కానుకలలో అలారమ్ గడియారాలు మరియు వాచ్ లు ఉన్నాయి. ప్రతి సంవత్సరం వాడుకోనగలిగే ప్లాస్టిక్ నుండి తయారు చేసిన క్రిస్మస్ ఆభరణాల ని కుడా బహుమతిగా ఇవ్వవచ్చు. డీవీడీ లు సి డి లు వంటివి ఎన్నో బహుమతిగా ఇవ్వదగినవి. మొదటి వార్షికోత్సవం జరుపుకునే జంటలకి ప్లాస్టిక్ ఫుడ్ కంటైనెర్స్ ని కూడా బహుమతిగా ఇవ్వవచ్చు. నిల్వ చేసేందుకు అవసరమైన ప్లాస్టిక్ స్టోరేజ్ వస్తువులని బహుమతిగా ఇవ్వవచ్చు.

4. మీరు ఇవ్వబోయే కానుకని ఆ జంటలకు వ్యక్తిగతీకరించేలా ప్లాన్ చెయ్యండి. ఫోటో గిఫ్ట్స్, వ్యక్తీగతీకరించిన ప్లేయింగ్ కార్డ్స్మ,మరెన్నో ఫోటో గిఫ్ట్స్, వారి ఇంటిని సూచించే ప్లాస్టిక్ చిహ్నాలు, ఆ జంట ఫోటో కలిగిన గడియారం లేదా ఏవైనా ఇతర స్టేషనరీ వంటివి ప్రత్యేకించి వారి కోసమే సృష్టించినవి వారి మొదటి వార్షికోత్సవ కానుకగా ఇవ్వడానికి తగినవి.

5. కానుకలని కలిపి ప్యాక్ చెయ్యండి. ఉదాహరణకి, బేస్ బాల్ గేమ్ టికెట్స్ ని సన్ గ్లాస్సెస్ తో కలిపి ప్యాక్ చేసి కానుకగా ఇవ్వవచ్చు. పిక్నిక్ కి వెళ్ళే వారికీ ఒక మ్యాప్ ని పిక్నిక్ బాస్కెట్ మరియు కప్స్ తో కలిపి ఇవ్వవచ్చు. ఎన్నో కొత్త కొత్త ఆలోచనల కోసం మీలో ఉన్న సృజనాత్మకతను వెలికితీయండి. వార్షికోత్సవం జరుపుకునే జంటల అభిరుచులకనుగుణంగా కానుకను అందచేయండి. కలకాలం గుర్తుండిపోయేలా ఉండే కానుకని వారికి అందించండి.

English summary

How to Select a Proper Gift for a One Year | ఫస్ట్‘మ్యారేజ్ డే’గిఫ్ట్ ఎలా ఎంపిక చేసుకోవాలి?

A one-year anniversary is a significant milestone for any couple. Getting past that first year proves that they've succeeded in melding two lives into one.
Story first published: Monday, January 21, 2013, 11:49 [IST]
Desktop Bottom Promotion