Latest Updates
-
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.!
ప్రతి ఇల్లాలు తెలుసుకోవాల్సినవి....!?

1. ముందుగా నిద్ర లేవగానే వంటింట్లోకి వెళ్లే ముందు నోట్లో నీళ్లు పోసుకొని, బ్రెష్ చేసుకొని వెళ్ళాలి.
2. వంటకు ఉపక్రమించే ముందు శుభ్రంగా స్నానం చేయాలి. చాలా మంది వంట పని పూర్తిచేశాక స్నానం చేయవచ్చులే అనుకుంటారు. కానీ వంటింట్లోకి వెళ్ళేటప్పుడు స్నానం చేయాలి.
3. అలాగే ధరించే డ్రస్ శుభ్రంగా వుండాలి. చీరలు కట్టుకునే వారు కాటన్ చీరలు ధరించాలి. పైన ఓ యాప్రాన్ కట్టుకుంటే మరీ మంచిది. ఏవైనా వంటసామాగ్రి, నూనెలు, ఇవీ అవీ పడినా కూడా శుభ్రమైన బట్టలకు అంటుకోకుండా యాప్రాన్ కట్టుకోవాలి. అలా లేనివాళ్లు వంట చేసేటప్పుడు ఏదైనా టవల్ కానీ, లేదా కాటన్ వస్త్రాన్ని కానీ చుట్టుకుని వంటను ప్రారంభించాలి.
4. చెప్పులతో వంటింటిలోకి వెళ్ళకూడదు. ఒక వేళ చెప్పులు వేసుకోవటం తప్పనిసరైతే ప్రత్యేకంగా ఓ జత చెప్పులు ఇంట్లో మాత్రమే వాడుకొనే విధంగా తెచ్చుకోవాలి.
5. ఇంటిలో ఎవరికైనా అనారోగ్యంగా వుంటే ముఖ్యంగా జలుబు, వైరల్ ఫీవర్, టి.బి. కామెర్లు వంటి వాటితో ఎవరైనా బాధ పడుతున్నట్లయితే వారిని వంటింట్లోకి ఎక్కువ సేపు ఉండ నివ్వకపోవడం మంచిది. వారికి కావాల్సినవన్నీ ఇంట్లో మిగతా వారు చూసుకోవాలి. దాంతో ఇన్ఫెక్షన్ కాకుండా, ఇతరులకు సోకకుండా ఉంటుంది.
6. బయటికి వెళ్ళి వచ్చాక కాళ్ళు, చేతులు కడుక్కోకుండా వంటింట్లోకి వెళ్ళ కూడదు. అలాగే ఆహారం వండేముందు తినే ముందు కాళ్ళు,చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.
7. వంటింట్లో వంట చేసే ప్రదేశం, వంట గట్టు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ఇందుకోసం సింకు దగ్గర ఎప్పుడూ ఒక వస్త్రం అందుబాటులో ఉంచుకోవాలి. సింకు పక్కనే చెత్తబుట్ట ఒకటి తప్పనిసరి.
8. కంచాలు, పేపర్ ప్లేట్స్, టవల్స్, నాప్‌కిన్స్ ఇలాంటివన్నీ పొందిగ్గా ఒక షెల్ఫ్‌లో అమర్చుకోవాలి. బేకింగ్ పౌడర్, బేకింగ్ షీట్స్, కేక్, పిజ్జా పాత్రల కోసం ప్రత్యేకంగా ఓ క్యాబినెట్ ఉండాలి.
9. పిల్లల కోసం స్నాక్స్ అవీ తయారుచేసి వాటి కోసం ప్రత్యేకంగా ఓ షెల్ఫ్ పెట్టుకుంటే వారు వాటికోసం అన్నీ వెతికి ఇల్లు పీకి పందిరేయకుండా కావలసినప్పుడు తీసుకోవడానికి వీలుంటుంది.
10. ఫ్రిజ్‌లో కూడా ప్రతి వస్తువు ఓ పద్ధతి ప్రకారం ఉండేలా చూసుకోవాలి. అంతేకానీ డోర్ తెరచి ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ ఏది పడితే అది సర్దేయకూడదు. ఏ రోజుకారోజు ఎంత శుభ్రం చేసుకుంటున్నా... వారానికోరోజు కిచెన్ మొత్తం శుభ్రం చేసుకోవడానికి కాస్త సమయం కేటాయించాలి. ఫ్రిజ్ కోసం కూడా అందులో కాస్త సమయం ఉండేలా చూసుకోండి.



Click it and Unblock the Notifications
