Latest Updates
-
మధ్యాహ్నం వంట చేసే టైం లేదా.. ఎనర్జీనిచ్చే కాలీఫ్లవర్ రైస్.. సులభంగా, టేస్టీగా ఇలా చేయండి.! -
వినాయక చవితి రోజు ఎలుక మీ కంట పడిందా.. మీ జీవితంలో జరిగే కీలక మార్పులివే.! -
శాస్త్రం ప్రకారం ఇంట్లో గణపతిని ఏ మూల ప్రతిష్ఠించాలో తెలుసా.. ఈ దిశలో ఉంచడం చాలా ఉత్తమం.! -
వినాయక చవితి స్పెషల్: పండుగ పూట త్వరగా, రుచికరంగా రవ్వ మోదకాలు.. చేయండిలా.! -
గణనాథుడికి పూజలో శనగల ప్రసాదం.. ఈ టిప్స్‌తో పదే నిమిషాల్లో ఈజీగా చేసుకోండి.! -
వినాయక చవితి స్పెషల్..బొజ్జ గణపయ్యకు ఇష్టమైన శనగపిండి లడ్డూలు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
గణపతి బప్పా మోరియా.. మీ ప్రియమైన వారికి వినాయక చవితి శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి.! -
ఏకదంతుడి నుంచి ధూమ్రవర్ణుడి వరకు.. గౌరీ తనయుడి అవతారాల వెనుక పరమార్థం ఇదే.! -
గణేశ్ చతుర్థి స్పెషల్: మీ ఇంటి గణపతికి శనగపప్పు మోదకాలు. ఇలా చేస్తే వారం రోజుల పాటు నిల్వ.! -
ఆంధ్రా విలేజ్ స్టైల్ పప్పు రొయ్యల వంకాయ కర్రీ.. ఇలా చేశారంటే ఇల్లంతా ఘుమఘుమలే.!
ఒక వేడుక తర్వాత ఇంటి శుభ్రత!
మన దేశంలో పండుగలు, ఇతర వేడుకలు అధికంగా వుంటాయి. బంధువులు ఇంటికి వస్తారు. పండుగలు, వేడుకలు అయి బంధువులు వెళ్ళిన తర్వాత ఇల్లంతా అపరిశుభ్రంగా వుంటుంది. ఇక ఇంట్లోని వారు ఇద్దరూ ఉద్యోగస్తులైతే ఒక పనిమనిషిని పెట్టి ఆమెతో శుభ్రం చేయించటం మరింత కష్టమే కాదు. సురక్షితం కూడా కాదు. కనుక ఇంటిలో జరిగిన ఒక వేడుక తర్వాత ఇంటిని ఎట్లా శుభ్రం చేసుకోవాలనేది చూద్దాం!
సాధారణంగా పండుగ రోజులలో వచ్చే చుట్టాలతో, స్నేహితులతో ఇల్లు చాలా చిందరవందరగా తయారవుతుంది. వీటితర్వాత ఇల్లు శుభ్రపరచాలంటే, ముందుగా ఎండిన పూలు, పత్రి మొదలైన పూజ సామాగ్రిని ఇతర పారవేయవలసిన వాటిని ఒక కవరులో వుంచండి. అలంకరణ లైట్లు జాగ్రత్తగా తీసి దాచి పెట్టండి. మిగిలిన తిండి పదార్ధాలను పారవేయటానికిగాను ప్రత్యేకించి ఒకచోట పెట్టి దుర్వాసన లేకుండా చూడండి. గిన్నెలను సబ్బు కలిపిన వేడినీటిలో నానపెట్టండి. తర్వాత శుభ్రం చేయటం తేలిక అవుతుంది.

లివింగ్ రూమ్, పూజా రూమ్ పరిశుభ్రత - పూజకు ఉపయోగించిన పూలను ఇతర అలంకరణలు తీసివేయండి. దీపాలలో వున్న ఆయిల్ ను పేపర్ టవల్ తో శుభ్రం చేసి అపుడు కడగండి. దేముడి ఫొటోలను మెత్తటి గుడ్డతో శుభ్రం చేయండి. తడిగుడ్డతో మంటపాన్ని లేదా పూజాగదిని తుడవండి.
డైనింగ్ గది శుభ్రత -
డైనింగ్ టేబుల్ గుడ్డ, నేప్ కిన్స్, ఫుట్ రగ్గులు మెషీన్ లో శుభ్రం చేయండి. కట్లరీ సింక్ లో వేయండి. మిగిలిన ఆహారాన్ని చెత్తబుట్టలో వేయండి. టేబుల్ క్లాత్ కు మరకలైతే టాల్కం పౌడర్ వేయండి. తర్వాత నీటితో కడగండి. సింక్ లో పడవేసిన వస్తువులు నానితే తొందరగా శుభ్రమవుతాయి. అన్ని కడిగి శుభ్రం చేసి ఒకచోట బోర్లించండి.
కిచెన్ పరిశుభ్రం ఎలా చేయాలి-
మిగిలిపోయి మరల తినదగిన ఐటమ్ లు రిఫ్రిజిరేటర్ లో నిలువ వుంచండి. కూరల తొక్కలు, ఇతర ముక్కలు మొక్కలకు ఎరువుగా వేయండి. మిగిలిన బ్రెడ్ ముక్కలు వేయించి మళ్ళీ తినేందుకు సిద్ధం చేయవచ్చు. తరిగిన కూరలు మిగిలితే ఉడికించి గాలి చొరని డబ్బాలో వుంచండి. చెత్తనంతా ఒకచోట చేర్చి ఒక పెద్ద సంచిలో పడవేసి చెత్తకుప్ప వద్ద పెట్టండి. లేదా దానిని సేకరించటానికి వచ్చే వారికి అనువుగా ఒక ప్రదేశంలో వుంచండి.
ఇంటిలో ఏదైనా ఒక పండుగ లేదా వేడుక అయిన తర్వాత ఇంటి పరిశుభ్రతకై చేయవలసిన చర్యలలో పైన చెప్పబడినవి ప్రధానమైనవి. ఆచరించి ఆనందించండి.



Click it and Unblock the Notifications
