Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
ఇంట్లో చిన్ని చిన్న ప్రమాదాలను అరికట్టడం ఎలా...?

బాత్ రూమ్‌లో: బాత్ టబ్‌లో చిన్నపిల్లలను ఒంటరిగా వదలి పోకూడదు. పిల్లలు ఆ నీటిలో ఆడటంతో పాటు, ఆళ్ళను తాగడం, లేదా నీళ్ళలో మునగడం వట్టి పనులు చేస్తారు. కొన్ని సందర్భాల్లో పాణం మీదకూ తెచ్చుకుంటారు. ముఖ్యంగా స్నానాల గదిలో షాంపూలు, లోషన్లు, సోప్ లను పిల్లలకు అందుబాటులో ఉంచవద్దు. బాత్ టబ్ నుంచి ఈజీగా బయటకు వచ్చేందుకు టబ్ సమీపంలో గ్రిబ్ బార్స్ అవసరం. కరెంటు ఖర్చు తగ్గుతుంది కదా అని రాత్రి వేళల్లో లైటు వేయకుండా బాత్‌రూమ్‌లోకి వెళ్లే సాహసం చేయవద్దు. నాన్-స్కిడ్ (జారని) మ్యాట్‌లను బాత్‌రూమ్ లో వేసుకోవడం చాలా మంచిది. వాటర్ హీటర్లు, ఇతర విద్యుత్ పరికరాలను బాత్ టబ్, షవర్ ప్లేస్, సింక్ లకు దూరంగా ఏర్పాటు చేయాలి.
వంట గదిలో: అత్యంత ముఖ్యమైన ప్రదేశం వంటగది. ముఖ్యంగా మహిళలు ఎక్కువ సమయం గడిపే ప్రదేశం మూడా వంటగదే. కాబట్టి తప్పకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అగ్గిపెట్టెలు, లైటర్లను లాక్డ్ క్యాబినెట్ లోనే ఉంచాలి. కిచెన్ నైఫ్ లను సింక్‌లో పడేస్తే, పాత్రలు తోమేటపుడు చేతికి తగిలి కోసుకునే ప్రమాదం ఉంది. కనుక వాటిని అన్నివేళలా నైఫ్ గార్డుల్లోనే ఉంచాలి. వంటి పూర్తి అవ్వగానే గ్యాస్ సిలిండర్ రెగ్యులేటర్ ను కట్టేయాలి. అదనంగా మరో సిలిండర్ కనుక ఇంట్లో ఉంటే దాన్ని వంట గదిలో కాకుండా మరే గదిలోనైనా ఉంచుకోవాలి. గదులను శుభ్రపర్చడానికి ఉపయోగించే రసాయన ద్రవాలను లాక్డ్ కేబినెట్ లో భద్రపర్చాలి. వీటిని పిల్లలకు అందుబాటులో ఉంచకూడదు. మంటలను ఆర్పే ఫైర్ ఎక్స్‌టింగ్విషర్‌ను కిచెన్ లో ఉంచాలి. ఫ్రిజ్ ను మరీ గోడకు ఆనించి పెట్టవద్దు. కంప్రెషర్ నుంచి వచ్చే వేడిగాలి పోవడానికి కాస్త ఖాళీ వదలాలి.
పడక గదిలో: పడగ్గదిలో ఎప్పుడూ ధూమపానం చేయవద్దు. స్మోక్ అలారమ్ ఏర్పాటు చేయాలి. కార్పెట్లు, రగ్గుల కిందనుంచి కరెంటు వైర్లు ఏర్పాటు చేయవద్దు. ఫర్నిచర్ అంచులు కోణాకారంలో కాకుండా గుండ్రంగా ఉండాలి. రూమ్ హీటర్ ఉన్నట్లయితే దుప్పట్లు, కర్టెన్లు, ఇతర వస్ర్తాలను హీటర్ కు కనీసం మూడు అడుగుల దూరంలో ఉంచాలి. క్యాండిల్స్ అగ్గిపెట్టెలు పిల్లలకు అందేట్లు కాకుండా కొంచెం ఎత్తులో ఉంచుకోవాలి.
పిల్లల గదిలో: కిటికీల దగ్గర ఫర్నిచర్ ఉండకూడదు. ఫర్నిచర్ అంచులు మొనదేలి ఉండరాదు. పొరబాటున తగిలినా గాయపడకుండా ఉండేందుకు అంచులు గుండ్రంగా ఉండాలి. కర్టెన్లు, వస్ర్తాలను కరెంటు లైటుకు సాధ్యమైనంత ఎక్కువ దూరంలో ఉంచాలి. బాగా బరువైన లేదా తేలికైన వస్తువులు, పగిలిపోయే వస్తువులను పిల్లల గదిలో ఉంచవద్దు. షాక్ ప్రూఫ్ స్విచ్‌లనే ఏర్పాటు చేయించుకోవాలి.
మెట్ల క్రింద: మెట్లు అన్నివేళలా పొడిగా ఉండేట్లు చూడండి. ఒకవేళ తడిస్తే వెంటనే తుడిచేయాలి. మెట్లు స్పష్టంగా కన్పించేలా లైటింగ్ ఉండాలి. మెట్ల మొదట్లో గానీ, చివర్లో గానీ గేటు ఉండడం శ్రేయస్కరం. మెట్లకు ఇరువైపులా హ్యాండ్ రెయిలింగ్ ఉంటే మంచిది.



Click it and Unblock the Notifications