Latest Updates
-
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.!
బట్టలపై వివిధరకాలైన మరకలు..పోగొట్టేదెలా...?

1. కొత్త బట్టలు, సిల్కు బట్టలు ఉతికేటప్పుడు ఆ నీటిలో కొంచెం ఉప్పు కలిపితే వాటి మృదుత్వం, రంగు పోకుండా కాపాడుకోవచ్చు.
2. చేతితో ఎంబ్రాయిడరీ చేసేటప్పుడూ దారపు ఉండని చిన్నకప్పులో వేసి కుట్టుకుంటే దారం ఎక్కడికో వెళ్ళటం, వెతుక్కోవటం ఉండదు.
3. జేబు రుమాళ్ళపైన, టవల్స్ మీద పడే లిప్‌స్టిక్ మరకలు పోవాలంటే వాటిపై గ్లిసరిన్ రాసి కొంతసేపు తర్వాత సబ్బుతో ఉతకాలి.
4. దుస్తులమీద సిరా మరకలు పోవాలంటే పుల్లటి పెరుగులో కాసేపు నానబెట్టి తర్వాత ఉతికితే సిరా మరక కనిపించదు.
5. షిఫాన్ చీరలపై నూనె మరకలు పోవాలంటే టాల్కంపౌడర్ చల్లి మడత పెట్టండి. వారం తర్వాత పౌదరు దులిపివేయండి.
6. బట్టలకంటిన గోరింటాకు మరకలు పోవడానికి మరకంటిన ప్రదేశాన్ని అరగంటసేపు పాలలో నానబెట్టి తర్వాత శుభ్రంచేయాలి. లేక నిమ్మకాయ ముక్కతో రుద్దిచూస్తే గోరింటాకు మరకలు పోతాయి.
7. శీకాయపొడితో రుద్దితే జరీమీద పడిన మరకలు పోతాయి. దుస్తుల మీద పడిన టీ మరకలు పోవాలంటే ఓ టమాటా ముక్క ను మరక మీద రుద్ది తర్వాత సబ్బుతో ఉతికితే మరకపోతుంది.
8. దుస్తులు ఒక్కచోట పోగుపడి, ముక్కిపోయిన వాసన వస్తుంటే ఎండలో ఆరేయాలి. వీలుకానప్పుడు యూకలిప్టస్, నిమ్మ, లావెండర్ వంటి ఏదైనా పరిమళంలో ఒక జేబు రుమాలుని ముంచి దానిని దుస్తుల మధ్య ఉంచితే సరిపోతుంది.
9. జడల చమురు జాకెట్ల వెనుక అంటుతుంది. సోపుతో ఉతికితే గుడ్డ కాంతి పోతుంది. కనుక పత్తిలో కాని గుడ్డ ముక్కలో కాని పెట్రోలు అద్ది చమురున్న భాగాన రాస్తే కొత్త జాకెట్లా తయారు అవుతుంది.
10. ఇష్టపడి కొనుక్కున్న జీన్స్ రంగుమారకుండా ఉండాలంటే, అరబక్కెట్ నీటిలో నాలుగు టేబుల్ స్పూన్ల వెనిగర్ వేయాలి. ఈ నీటిలో దుస్తుల్ని కొద్ది సేపు నానబెట్టి ఆ తర్వాత ఉతకాలి. ఊలు, సిల్కు బట్టలు గోరువెచ్చటి నీటిలో పిండిన తరువాత ఒక కాటన్ టవల్లో ఉంచి రోల్ చేస్తే టవల్ వాటి తడిని పీల్చుకుంటుంది. తర్వాత ఆరేయాలి.



Click it and Unblock the Notifications
