Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
పిల్లల్లున్న ఇంట్లో..ఇవి తప్పనిసరి...!?

వంటగదిలో వెలుతురు కోసం లేదా డెకరేషన్ కోసం వ్యాక్స్ క్యాండిల్ వెలిగిస్తుంటాం. వాటిని పూర్తిగా ఆర్పేసి బాక్స్‌లో ఉంచి సురక్షితమైన ప్రదేశంలో నిల్వ చేయాలి.
స్టవ్ మీద పదార్థాలు ఉడుకుతున్న పాత్రల హ్యాండిల్స్ బయటకు లేకుండా చూడాలి. పిల్లలు వాటిలో ఏముందో చూడాలన్న ఆసక్తితో హ్యాండిల్ పట్టుకుని పైకి వంపుకుంటారు.
మిక్సీ వేసిన తర్వాత ప్లగ్ నుంచి వైరుని తీసేయాలి లేదా స్విచ్ ఆపేయాలి. లేకపోతే పెద్దవాళ్లు వెళ్లగానే పిల్లలు వచ్చి మిక్సీ ఆపరేట్ చేసేస్తారు. శబ్దానికి కంగారు పడి ఏడ్చేస్తారు కూడ. అంతటితో ఆగకుండా జార్ పాయింట్ దగ్గర చేతిని ఉంచారంటే జరిగే ప్రమాదాన్ని ఊహించవచ్చు.
గారెలు, పూరీల వంటివి చేసిన తర్వాత బాణలిని నూనెతో సహా పక్కన పెడుతుంటాం. నూనె చల్లారిన తర్వాత టిన్‌లోకి వంపుకోవచ్చన్న ఆలోచనతో. ఆ నూనెలో పిల్లలు చేతిని ముంచినా, బాణలిని మీదకు వంపుకున్నా మరీ ప్రమాదకరం.
స్విచ్‌లు పాడయ్యి వైర్లు బయటకు వచ్చి ఉంటే ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. ప్లగ్‌లు పిల్లలకు అందుబాటులో ఉంటే ప్లగ్ గార్డ్‌తో కవర్ చేయాలి. వంట పూర్తయిన వెంటనే గ్యాస్ సిలిండర్ రెగ్యులేటర్‌ను కట్టేయాలి.
కూరగాయలను తరిగిన తర్వాత కటింగ్ బోర్డు, చాకును హోల్డర్‌లో ఉంచాలి. అగ్గిపెట్టెలకు బదులు లైటర్‌ను వాడాలి. కారం పొడుల వంటి వాటిని వాడిన వెంటనే మూతపెట్టి పిల్లలకు అందకుండా పెట్టాలి.
గ్లాసు ఐటమ్స్, ఎక్కువ షార్ప్ గా ఉన్న వస్తువులు, త్వరగా పగిలిపోయేటటువంటి సున్నితమైన వస్తువులను పిల్లలకు అందకుండా కొంచెం ఎత్తులో పెట్టుకోవాలి.
హ్యాండ్ టవల్స్‌ను స్టవ్ దగ్గర వదలకూడదు. వీటన్నిటితోపాటు కిచెన్‌లో నీరు ఒలికితే వెంటనే తుడిచేయాలి.



Click it and Unblock the Notifications