Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
సహజ పరిమళాలతో గదులన్నీ గుభాళించేనూ....!

మనం సృష్టించుకున్న ల్యామినేట్స్ కాక సహజమైన సామగ్రి వాడితే మరింతగా విశ్రాంతినిచ్చే, తక్కువ మానసిక ఒత్తిడిని కలిగించే పరిస రాలు ఇంట్లో రూపొందుతాయి. ఎండ,గాలి వంటి సహజ వనరులను అత్యధికస్థాయిలో వాడడం, రంగులు ఫర్నిషింగ్ ఉపకరణాలు, లైటింగ్ పద్ధతులు. యాంత్రిక , ఎలెక్ట్రానిక్ పరికరాలను నియమానుసారం ఉపయో గించ డం- ఆరోగ్యకరమైన ఇంటిని రూపొందిస్తాయి. సరిగా జాగ్రత్త తీసుకోని యంత్రాలు, వాడేసిన ఇంట్లో పలి, వెలుపలి సామగ్రి ఇంట్లో రసాయనిక కాలుష్యాన్ని పెంచు తాయి. ఇంట్లో గాలిపై చెడుప్రభావం వేస్తాయి. చివరికి మన ఆరోగ్యంపై చెడుప్రభావం ప్రసరిస్తాయి. రసాయన రూం ఫ్రెషనర్లతో అలెర్జీ సమస్య తతెత్తడమే కాకుండా ఉబ్బసంతో బాధపడేవారికి ఇవి మరింత ప్రభావాన్ని చూపిస్తాయి. కొన్ని రకాలైనటువంటి హెయిర్ ఫ్రెషనర్లు పిల్లల్లో నిరుత్సాహాన్ని, తలనొప్పులను కలిగించే ప్రమాదం ఉంది.
సహజమైన తాజా గాలి: రసాయనిక ఏయిర్ ఫ్రెషనర్లను వాడకండి- వాటికి బదులు బేకింగ్ సోడా లేక ఏ ఇతర సహ జమైన ఫ్రెషెనర్లను వాడండి. లేక కిటికీలను కాసేపు తెరిచి వుంచడండి. బ్రోమినేటెడ్ ఫ్లేమ్ రిటార్డెంట్లు, స్టేయి న్‌రిపె ల్లెంట్లు, రింకిల్ రెసిస్టెంట్ ట్రీట్‌మెంట్లులేని ఫర్నిచర్, కార్పెట్లు, కర్టన్లు ఎంపిక చేసుకోండి. ఇంట్లో విరివిగా మొక్కలు పెంచుకుంటే విషకాలుష్యాన్ని అరికట్ట వచ్చు. ఇంట్లో పెరిగే మొక్కలు కెమికల్స్‌ను పీల్చుకుని వాటిని ఆహారంగా , శక్తిగా మారుస్తాయి. గాలిని శుభ్రపరు స్తాయి. ఇంట్లో ప్రతిగదిలో 100 చదరపుటడుగులకు 3 మొక్క లుండాలని సిఫార్సు చేస్తున్నారు. సహజసిద్ధమైన మొక్కల్నే పెంచండి. తలు పులు బార్ల తెరిచివుంచి ఇంట్లో వేడిని సహజంగానే బయటికి పోయేలా జాగ్రత్త తీసుకోండి. వీటితో పాటు మరికొన్ని సహజసిద్దమైన రూం ఫ్రెషనర్లు మీకోసం..
సహజమైనటు వంటి నూనెలు: మీరుంటున్న గది సహజ సువాసనలతో నిండిపోవాలంటే సెంట్ వాసనలు కలిగినటువంటి నూనెలు ఉపయోగించవచ్చు. నూనెల్లో కూడా ఫ్లేవర్స్ చాలానే ఉన్నాయి. మీకు నచ్చిన ప్లేవర్ ఆయిల్ ను ఎంపిక చేసుకొని రూమ్ ఫ్రెష్ నర్ గా వినియోగించవచ్చు. మీకు నచ్చిన ఏ ప్లేవర్ నూనైనా తీసుకొని అందులో అరకప్పు వెనిగర్ రెండు కప్పుల నీళ్లు పోసి బాగా షేక్ చేసి దాన్ని స్ర్పే బాటిల్ లో నింపి రూం ఫ్రెష్ నర్ గా వినియోగించుకోవచ్చు. అందుకు ద్రాక్షరసంతో తయారు చేసిన నూనె, ఆలివ్, లెమన్ ఆయిల్ వంటి సహజ నూనెలు వాడడం వల్ల గదులు తాజా సువాసనలతో నిండిపోతుంది.
ఫ్లవర్ ఎక్స్ ట్రాక్ట్స్: మీకు నచ్చిన పువ్వుల డియోడరెంట్ తో ఇంట్లో గదులను గుబాళింపు చేయవచ్చు. మల్లెపువ్వులు, గులాబి, లావెండర్. ఫ్లేవర్ కలిగిన పువ్వుల స్ర్పేను వాడటం వల్ల మనస్సు ఉత్తేజపరుస్తుంది. మీకు నచ్చిన ఏదో ఒకరకమైనటువంటి పువ్వు తీసుకొని దాని రేకులను వేరు చేసి కొన్ని నీళ్లలో వేసి అరగంట పాటు బాయిల్ చేయాలి. ఈ నీళ్లను చల్లార్చి, వడగట్టి స్ర్పే బాటిళ్లో పోసి గదుల్లో స్ర్పే చేయవచ్చు. సహజ పరిమళాలతో గదులన్నీ ఫ్రెష్ గా కనబడుతాయి.
సుగంధ ద్రవ్యాలు: మీకు ఇష్టమైన సుగంధ ద్రవ్యాలు (లవంగాలు, చెక్కా, యాలకలు మొ..వంటివి తీసుకొని నీళ్ళలో వేసి అరగంట పాటు బాగా ఉడికించాలి. తర్వాత ఆ నీళ్లను వడగట్టి చల్లార్చి, స్ప్రే బాటిల్ లో పోసి, మీ ఇంటి గదులన్నింటినీ సుగంధ ద్రవ్వాలతో నింపేయ్యేచ్చు.



Click it and Unblock the Notifications