Latest Updates
-
బంగాళదుంపలు ఉడకబెట్టేటప్పుడు ఈ చిన్న ట్రిక్స్ పాటిస్తే.. రుచి అదుర్స్! -
Wolrd Blood Donor Day 2026: రక్తదానం చేస్తే ఇన్ని ప్రయోజనాలుంటాయా? -
అమృత సిద్ధి యోగం: ఈ 3 రాశుల వారికి రాత్రికి రాత్రే అదృష్టం, తలరాత మారబోతోంది! -
పెసరపప్పుతో దూది లాంటి ఇడ్లీలు..పొట్టకు తేలికగా,ప్రయోజనాలు మెండుగా ఉండే హెల్తీ బ్రేక్ ఫాస్ట్ -
ఈరోజు రాత్రి అరుదైన యోగం.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, అదృష్టం మీదే! -
శని దోషం ఉందా? ఈ 7 పరిహారాలు వెంటనే మొదలుపెట్టండి -
ఆదివారం స్పెషల్: నోరూరించే కర్ణాటక స్టైల్ నాటు కోడి కూర రెసిపీ ఇదే! -
సోమవతి అమావాస్య: ఈ చిన్న పరిహారాలతో మీ జీవితంలో అద్భుతమైన మార్పులు! -
మిథున, సింహ, తుల రాశుల వారికి భారీ అదృష్టం.. మీ రాశి ఉందా? - ఆదివారం, 14 జూన్ 2026 -
మిథున, సింహ, ధనుస్సు రాశుల వారికి ఈ వారం రాజయోగం.. మీ జాతకం ఎలా ఉంది? - 14 నుండి 20 జూన్ 2026 వరకు
ఉప్పు వంటకు మాత్రమే కాదు.. క్లీనింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది..!
ఒక్క సారి మన వంటగదిని పరిశీలించినట్లైతే అందులో మనకు తెలియనివి చాలా వస్తువులు మనం రెగ్యులర్ గా ఉపయోగించే వస్తువులు క్లీనింగ్ ఏజెంట్లుగా పనిచేస్తాయి. ఉదా: వెనిగర్, బేకింగ్ సోడా, నిమ్మకాయ, ఉప్పు మరియు మరికొన్ని ఇతర వస్తువులు కొన్ని వస్తువులను లేదా దుస్తులను లేదా ఫోర్, టాయిలెట్స్ ను శుభ్రం చేయడానికి ఉపయోగిస్తుంటాం. వీటిలో ఏ ఒక్క వస్తువు తీసుకొన్నా వివిధ రకాలుగా ఉపయోగించవచ్చు చాలా వస్తువులను శుభ్రపరచవచ్చు. ఉదాహరణకు ఉప్పు వల్ల శుభ్రం చేసేవి చాలానే ఉన్నాయి. మనం తినే ఆహారాలు రుచిగా ఉండటం కోసం ఉప్పును వివిధ రకాల వంటకాల్లో వాడుతుంటాం. వంటకాలకు మాత్రమే కాకుండా ఈ ఉప్పు క్లీనింగ్ ఏజెంట్ ఉపయోగపడుతుంది మరియు చర్మాన్ని శుభ్రం చేసి చర్మాన్ని పొడిబారనియ్యకుండా చేస్తుంది.
ఉప్పును వివిధ రకాలుగా క్లీనింగ్ ఏజెంట్ గా ఉపయోగిస్తాం. ఉదా: దుస్తులు శుభ్రపరచడానికి, ఇంట్లో కొన్ని వస్తువులు ఐరన్, ఇత్తడి, రాగి వంటి డేకరేటివ్ వస్తువులను శుభ్రపరచడానికి ఉప్పు బాగా సహాయపడుతుంది. పాతబడ్డ వస్తువులను తిరిగి కొత్తవాటిలా మెరిపించే గుణాలు ఉప్పులో మెండుగా ఉన్నాయి. అంతే కాదు ఇంట్లో ఏదైనా శుభకార్యాలు, పార్టీలు జరిగినప్పుడు కార్పెట్స్ మీద దుస్తుల మీదు మరకలు ఏర్పడ్డ, కర్రీలు, డ్రింక్స్ పడి మరకలైన చోట కొంచెం ఉప్పు వెనిగర్ వేసి బాగా రుద్దితే మరకలు మాయం అవుతాయి. ఇంకా దుస్తుల నుండి చెమట వాసన వస్తున్నట్లైతే కొద్దిగా ఉప్పును చిలకరించి రుద్దడం వల్ల దుర్వాసనేది తిరిగి ఉండదు. ఇది ఒక డిటర్జెంట్ పరిష్కారం. మరి ఉప్పు వల్ల మరికొన్ని ఉపయోగాలు తెలుసుకుందామా...

జీన్స్ దుస్తులను శుభ్రం చేస్తుంది: జీన్స్ దుస్తులు బాగా మరకలు పట్టి ఉన్నప్పుడు ఉప్పు చిలకరించి బాగా రుద్ది శుభ్రం చేయవచ్చు. ఇలా ఉప్పుతో దుస్తులు శుభ్రపడటమే కాదు, దుస్తులు సాగే గుణం లేకుండా కలర్ పోకుండా స్థిరంగా ఉంటాయి. అరబక్కెట్ లో 1 లేదా 2 చెంచా ఉప్పు వేసి 10నిముషాల పాటు జీన్స్ దుస్తులను నానబెట్టి తర్వాత సాధారణ డిటర్జెంట్ సోపుతో ఉతకడం వల్ల శుభ్రపడుతాయి.

ఇత్తడి మరియు రాగి వస్తువులను మెరిపిస్తుంది: సాధారణంగా మన ఇంట్లో అలంకరణ కోసం ఇత్తడి లేదా రాగి వస్తువులును అలంకరణలుగా ఉపయోగిస్తుంటాం లేదా మన పెద్దలకాలం నాటి వస్తువులను అలాగే దాచిపెట్టుకొని ఉంటాం. వాటిని ఉపయోగించకపోవడం వల్ల వాటి మీద త్రుప్పు, మరకలు, దుమ్ము అంటిపెట్టుకొని ఉంటాయి. అటువంటి వాటిని తిరిగి కొత్తవాటిలా మెరిపించాలంటే కొద్దిగా ఉప్పు మరియు వెనిగర్ వేసి రుద్ది శుభ్రం చేసుకోవాలి.

చిమ్నీ: వంటగదిలో ఉన్న చిమ్మీ ఎక్కువగా ఆయిల్ తో కూడిన జిడ్డు దుమ్మ దూళితో నిండి ఉంటుంది. వంటగది చిమ్నీ శుభ్రం చేయాలంటే చాలా కష్టం. కాబట్టి కొద్దిగా ఉప్పు, వెనిగర్, మరియు బేకింగ్ సోడా వేసి రుద్ది శుభ్రం చేసుకోవచ్చు.

కార్పెట్: కార్పెట్స్ మీద దుమ్మ, ధూళి మరియు ఆహారపు మరకలు, కర్రీ, వైన్ వంటివి ఒలికిపోవడం వల్ల మరకలు ఏర్పడుతాయి. ఇటువంటి మొండి మరకలను తొలగించాలంటే మరకలైన ప్రదేశంలో ఉప్పు చల్లి నీటిలో ముంచిన స్పాంజ్ తో బాగా రుద్ది శుభ్రం చేసుకోవాలి.

దుస్తులు: ఉతికిన దుస్తులు మంచి సువాసనగా ఉండాలంటే, ఉతికిన వెంటనే 5నుండి 10 నిముషాల పాటు ఉప్పు నీటిలో నానబెట్టాలి. దాంతో కలర్ కూడా పోవు.

ఐరన్ వంటపాత్రలు: ఐరన్ తో తయారు చేసినటువంటిం వంటపాత్రలు కొన్ని సందర్భాల్లో శుభ్రం చేయడానికి కష్టం కలిగిస్తుంటాయి. వీటిమీద పడ్డ ఆయిల్ మరకలు, పసుపు పచ్చని మరకలు తొలగించడానికి వేడినీళ్ళతో ఉప్పును మిక్స్ చేసి స్ర్కబ్ చేసి శుభ్రం చేయవచ్చు.

గ్లాస్ జార్స్: గ్లాస్ తో తయారు చేసినటువంటి జగ్ మరియు జార్స్ వంటివి కొన్ని రోజుల తర్వాత పసుపుపచ్చ వర్ణంలోనికి మారుతుంటాయి. వీటిని ఉప్పు వేనిగర్ వేసి రుద్ది శుభ్రంగా మంచినీళ్ళతో కడగడం వల్ల శుభ్రపడటంతో పాటు బ్యాక్టీరియాను తొలగిస్తుంది.

రిఫ్రిజరేటర్: ఫ్రిజ్ ను శుభ్రంగా మరియు ఎటువంటి దుర్వాసనా లేకుండా ఉంచాలంటే. ఉప్పు, వెనిగర్ రెండు ఒక కప్పునీళ్ళలో వేసి అందులో ఒక చిన్న కర్చీఫ్ ను నానబెట్టి తర్వాత ఫ్రిజ్ ను తుడవడం వల్ల దుర్వాస తొలగిపోవడంతో పాటు, శుభ్రపడుతుంది.

సామానుల మీద వాసన తొలగిస్తుంది: రెగ్యులర్ గా ఉపయోగించే సామానుల మీద వెల్లుల్లి, గుడ్డు, మాంసం, ఉల్లిపాయ మరియు నూనె వాసలు తొలగిపోవాలంటే ఉప్పును నిమ్మరసంలో లేసి స్ర్కబ్బర్ తో రుద్ది, మంచి నీటితో కడిగి శుభ్రం చేసుకోవచ్చు.

సిల్వర్ వస్తువులను శుభ్రం చేస్తుంది: సిల్వర్ స్పూన్స్ మరియు ఇతర సిల్వర్ వస్తువులను ఉప్పుతో శుభ్రం చేయవచ్చు.



Click it and Unblock the Notifications