Latest Updates
-
చాలా ఏళ్ల తర్వాత ఒకే రాశిలో సూర్య కేతులు.. రాజయోగం పట్టనున్న రాశులివే.! -
చికెన్ లివర్ vs మటన్ లివర్..రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిది? -
పెళ్లిళ్లలో వడ్డించే పూరీ మసాలా.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా ఇలా ఈజీగా చేసుకోండి..వేళ్లు నాకుతూ తినేస్తారు! -
కలియుగం ముగిసేది ఎప్పుడు? మనిషి ఆయుష్షు కేవలం 20 ఏళ్లేనా? -
పెళ్లిళ్లలో వడ్డించే కరకరలాడే చిల్లీ గోబీ.. అచ్చం అదే రుచితో ఇంట్లోనే ఈజీగా చేసేయండిలా.. -
కొల్హాపురి స్టైల్ కోడిగుడ్డు పులుసు..అన్నం, జొన్న రొట్టెలోకి అదిరిపోతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
వర్షాకాలంలో పాము కాటుకి గురైతే ఏం చేయాలి? ఏం చేయకూడదు? -
ఈ వీకెండ్ కి నాన్వెజ్ వద్దా? నాన్ వెజ్ ను మించే రుచితో కాజు మసాలా ఈజీగా చేసుకోండిలా.. -
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.! -
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.!
దీపావళి తర్వాత ఇంటిని శుభ్రం చేసే సులభ చిట్కాలు
దీపావళి అంటేనే దీపాలు, లైట్లు వేలిగించడం మరియు క్రాకర్లు కాల్చడం. ఈ పండుగ ‘Dhanteras'రోజున ‘లక్ష్మీ పూజతో' ప్రారంభం అవుతుంది. మరియు ఈ పండుగ హిందూ న్యూ ఇయర్ ‘పాడ్వ' తో ముగుస్తుంది. ఈ పండుగ సందర్భంగా ఇంట్లో కానీ, ఇంటి ముంగిట కానీ వివిధ రంగులతో రంగవళ్లులు ప్రతి రోజూ అలంకరిస్తాము. ముగ్గులు గీస్తాము. మరియూ ఫైర్ క్రాకర్స్, దీపాలు ప్రతి లాండ్ లోనూ వెలగాల్సిందే. ఇంట్లో, ఇంటి బయట లైట్లతో దీపాలతో, పువ్వులతో అలంకరించాల్సిందే. ప్రతి ఒక్కటి చాలా ప్రకాశవంతమైన, పండుగ వాతవరణం నెలకొనాల్సిందే.
అయితే గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకొన్న దీపావళి పండుగ ముగయగానే ఏమవుతుంది? ఉత్సాహంగా కనిపించిన ఇల్లు కాస్తా మొత్తం పీకి పందిలివేసినట్లు, రంగోలి మొత్తం గందరగోళంగా ఉంటుంది. వేస్ట్ పేపర్, ప్లాస్టిక్ మరియు కాల్చిన క్రాకర్స్ యొక్క ఫ్లాష్ పౌడర్ ప్రతి చోటా వ్యాప్తి చెంది ఉంటుంది. మరియు ఇంటి అలంకరణకు, పూజకు ఉపయోగించిన పువ్వులు, ఆకులు వంటివి ఎండిపోయి ఇంట్లో మొత్తం అక్కడ పడి ఉంటాయి. ఇవి ఈ జోడించడానికి , ఇంట్లో దుమ్ము మరియు పొగ చేరడం. అలాగే వంటగదిలో గందరగోళం మరియు ప్రతిదీ క్రమం తప్పి, ప్లోర్ మీద ఉండటం.
దీపావళికి ముందు ఇంటిని శుభ్రం చేయడం ఎంత ముఖ్యమో, దీపావళి తర్వాత కూడా అంతే శుచి, శుభ్రత పాటించడం చాలా ముఖ్యం. కాబట్టి, దీపావళి తర్వాత ఇంటి శుభ్రత కోసం ఇక్కడ కొన్ని చిట్కాలు ఇవ్వబడుతున్నాయి . నమ్మండి, ఈ చిట్కాలు చాలా అద్భుతంగా ఉపయోగపడుతాయి.

అవసరం లేనివి తొలగించండి:
దీపావళి సమయంలో అలంకరణలకోసం ఉపయోగించన ఆకులు, పువ్వులు, పేపర్లు వంటివి వీలైనంత త్వరగా తొలగించాలి. దీపావళి తర్వాత ఇంటిని శుభ్రపరచడానికి, మొదట పొడిగా ఉన్న వ్యర్థాలన్నీంటినీ (ఎండిన పువ్వులు, డోర్, విండ్ డెకొరేషన్ కు ఉపయోగించిన పువ్వులను)తొలగించాలి. తర్వాత అలాగే ముందుగా రంగోలి పౌడర్ ను ఒక్కచోటకు తోసి, పౌడర్ మొత్తం తొలగించిన తర్వాత తుడవాలి.

వంటగది:
ఇంట్లో శుభ్రం చేయాల్సిన మరో ప్రధానమైన ప్రదేశం కిచెన్. దీపావళి పండుగ రోజు వివిధ రకాల వంటలను తయారు చేయడం వల్ల వంటగదిలో ప్రతిదీ కలగలిసిపోయి ఉంటాయి. దీపావళి తర్వాత, ఇంటి శుభ్రతకు కొంత సమయం పడుతుంది. మరియు వంటగదిని తిరిగి సరిగా సర్ధాలి. వంటగదిని తిరిగి కొత్తగా తయారుచేయాలి.

కప్ బోర్డ్ శుభ్రత:
దీపావళి పండుగ సందర్భంగా కొత్త దుస్తులు, ఆభరణాలు, మేకప్ వస్తువలు అన్నీ కూడా చిందరవందరగా పీకిపడేసుంటారు . ఇవన్నీ చేయునప్పుడు, మీ కప్ బోర్డ్ మరియు డ్రెస్సింగ్ టేబుల్ పూర్తింగా గందరగోళంగా మారిఉంటాయి. దీపావళి తర్వాత మీ ఇంటిని శుభ్రపరచడం మొదలుపెట్టాలి మరియు మీ ఆభరణాలు, మేకప్ వస్తువులు తిరిగి వాటిప్లేస్ లో తిరిగి సర్ధడం చేయాలి. కొత్త బడట్టలన్నింటినీ డ్రై క్లీన్ చేయడం, ఆరబెట్టడం చేయాలి.

దుమ్ముతొలగించడానికి వాక్యూమ్ చేయాలి:
దీపావళి సందర్భంగా దుమ్ము, దూళితో ఫర్నీచర్ మీద మరియు ఇతర వస్తువుల మీద నిండి ఉంటుంది. దీపావళి తర్వాత ఇంటి శుభ్రతలో ఒక ఉత్తమ చిట్కా వాక్యూమ్ క్లీనినర్ లేదా కాటన్ వస్త్రంతో ఫర్నీఛర్ , టేబుల్, ఫ్యాన్స్ మరియు ఇతర వస్తువులను శుభ్రం చేసుకోవాలి . దీపావళి తర్వాత ఇంటిని శుభ్రం చేసుకోవడంలో ఇది ఒక ఉత్తమ మార్గం.

అన్నింటినీ మార్చేయాలి:
దీపావళి తర్వాత ఒక మంచి చిట్కా, బెడ్ షీట్స్ , బెడ్ కవర్స్, కర్టెన్స్ మరియు సోఫా కవర్స్ మొత్తం మార్చుకోవాలి . దాంతో మీ ఇల్లు తిరిగి కొత్తగా , తాజాగా మరియు క్లీన్ గా కనిపిస్తుంది.మీ ఇల్లు అందంగా, ఉత్సాహంగా కనిపిస్తుంది.

ఇల్లు తుడవడం:
ఇవన్నీ చేసిన తర్వాత చివరగా మెత్తటి కాటన్ వస్త్రాన్ని ఫినాయిల్ నీళ్ళలో ముంచి, ఇంట్లో అన్ని గదుల్లోనూ ఫ్లోర్ ను శుభ్రం చేయాలి.
దీపావళి తర్వాత ఈ క్లీనింగ్ చిట్కాలు మీకు ఉపయోగపడుతాయని నమ్మతున్నాను. కాబట్టి, దీపావళిని ఎంజాయ్ చేసిన వారు, ఇంటి శుభ్రతతో ఆరోగ్యంగా, ఆనందంగా, కొత్త ఉత్సాహంగా ఉండాలంటే ఈ చిట్కాలను పాటించాల్సిందే. ఇంట్లో తిరిగి తాజా వాతావరణాన్ని నెలకొల్పాల్సిందే...



Click it and Unblock the Notifications