కిరణాషాపుకు వెళ్ళేముందు గుర్తుంచుకోవల్సినవి

By Super

ప్రస్తుత రోజుల్లో పెద్ద పెద్ద పట్టణాలు, నగరాలలో కూడా ఫుడ్ మార్కెట్స్, ఫుడ్ బజార్ వంటివి వెలిశాయి. ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా అన్నిరకాల నిత్యవసర వస్తువులను అందులో దొరుకుతాయి. ఒకే ప్రదేశంలో నిత్యవసర వస్తువులతో పాటు, పండ్లు, కూరగాయలకు కూడా అందుబాటులో ఉంచడంతో ఇటువంటి ఫుడ్స్ మార్కెట్స్ బాగా పాపులర్ అయ్యాయి.

ఈ ఫుడ్ మార్కెట్స్ లో ఉంచే ఆహారాల్లో కొన్ని రుచికరమైనటువంటివి ఉన్నాకూడా అవిన్నియు తప్పనిసరిగా ఆరోగ్యకరంగా ఉండవు. మరి మీరు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకొనేట్లు అయితే, ఆరోగ్యకరమై ఆహారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే వారైతే, మీరు కిరణా షాపు లేదా ఫుడ్ బజార్ లేదా ఫుడ్ మార్ట్ లకు వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా గుర్తుంచుకోవల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. వాటిని పరిశీలించండి.

పండ్లు:

పండ్లు:

పండ్లు మన డైట్ లో ఎంత ముఖ్యమో మనందరికీ తెలిసిన విషయమే. అయితే ముఖ్యంగా పండ్లను ఎంపిక చేసుకోవాలి. వ్యాయామం మరియు జిమ్ వంటి చేయడానికి ముందు ఇంటి నుండి బయటకు వెళ్ళడానికి ముందు తక్షణ శక్తి పొందడానికి అరటి పండ్లు మరియు ద్రాక్ష వంటివి తినవచ్చు. ముందే ప్యాక్ చేసి పెట్టిన పండ్ల కంటే తాజాగా విడిగా బయట ఉన్నతాజా పండ్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. తాజా పండ్లను కొనేందుకు ఏ మాత్రం వెనకాడవద్దు.

వెజిటేబుల్స్(కూరగాయలు) :

వెజిటేబుల్స్(కూరగాయలు) :

మీరు చాలా వరకూ అన్ని రకాల కూరగాయలను వివిధ రకాలుగా ఉపయోగిస్తుంటారు. వివిధ రకాలుగా వండుతుంటారు. ఆవిరి పట్టించడం లేదా ఉడికించడం లేదా వేయించడం వంటి సాధారణ మనం వండే విధానాలు. అయితే సరైన కాంబినేషన్ లో కూరగాయలను మిక్స్ చేయడం చాలా ముఖ్యం. భోజనం, డిన్నర్ సైడ్ డిష్ లేదా స్నాక్ గా గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ తో తయారు చేసే సలాడ్స్ చాలా ఫర్ ఫెక్ట్ కాంబినేషన్. ఆరోగ్యకరమైన ఆహారాలు గ్రీన్ లీఫ్ మరియు బీట్ రూట్ వంటి వాటిని మిస్ చేయకూడదు.

ప్రోటీన్స్:

ప్రోటీన్స్:

మాంసం, పౌల్ట్రీ, మరియు చేపలలో ప్రోటీను పుష్కలంగా ఉన్నటువంటి ఆహారాలు. మీరు శాఖాహారస్తులైతే, ఉప్పు లేని నట్స్ మరియు బీన్స్ వంటివి ఆహారపట్టికలో తప్పనిసరిగా చేర్చుకోవల్సిన ఆహార పదార్థాలు.

పాల ఉత్పత్తులు:

పాల ఉత్పత్తులు:

డైరీ ప్రొడక్ట్స్ ను తప్పనిసరిగా తీసుకోవాలి. ముఖ్యంగా లోఫ్యాటీ చీజ్ మరియు పాలు వంటి వాటిని మీ బ్రేక్ ఫాస్ట్ లో తప్పని సరిగా ప్రతి రోజూ తీసుకోవల్సిన ఆహారాలు.

ధాన్యం:

ధాన్యం:

మీరు రెగ్యులర్ గా మీరు బ్రెడ్ మరియు రైస్ తినడం మర్చిపోరు. కానీ, ఇవి ఆరోగ్యానికి ఉపయోగపడే ధాన్యంతో తయారు చేసినవై ఉండేవాటిని ఎంపిక చేసుకోవాలి. ముఖ్యంగా బ్రెడ్ గోధుమలతో తయారు చేసిన వాటికి ప్రాధాన్యం ఇవ్వాలి. అలాగే అన్నంకు ఎక్కువగా బ్రౌన్ రైస్ ను ఎంపిక చేసుకోవాలి. బ్రెడ్ ను కొనే ముందు లేబుల్స్ ను తప్పనిసరిగా చదవాలి. లేదంటే అవి ముగ్గినవై ఉండిఉండవచ్చు. అటువంటి ఆహారాలు ఆరోగ్యానికి మంచిది కాదు.

మానుకోవల్సినవి:

మానుకోవల్సినవి:

అనారోగ్యకరమైన, డబ్బాలలో స్టోర్ చేసిన మరియు ప్రాసెస్ చేసిన ఆహారాలను ఖచ్చితంగా నివారించండి. సోడా, చిప్స్, కేక్స్ మరియు ఫ్రైడ్ స్నాక్ వంటివి మీ శరీరానికి పోషకాలను అంధించవు. మరియు అదనపు క్యాలరీలను మీ శరీరానికి చేర్చుతాయి. మీరు స్నాక్స్ తినడానికి చాలా ఆసక్తిగా ఉన్నప్పుడు కాల్చిన వాటికి ప్రాధాన్యం ఇవ్వండి. కానీ విటిని ఏదో ఒక సమయంలో తీసుకోవడం వరకూ మంచిదే, కానీ అదే పనిగా క్రమం తప్పకుండా తీసుకోకూడదు.

ముందుగా ప్లాన్ చేసుకోండి:

ముందుగా ప్లాన్ చేసుకోండి:

ఒక వారంకు సరిపడే ఆహారాలను కొనే ముందు, మీ షెడ్యూల్ గురించి ఆలోచించండి. షాంప్ కు వెళ్ళడానికి ముందు భోజనంను ప్లాన్ చేయండి. ఇలా చేయడం వల్ల మీకు నచ్చిన ఆహారాలను కొనడానికి కొంత ఓపిక ఉంటుంది. మీరు కొనే వస్తువులు ఆరోగ్యానికి మంచివా లేదా తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే ముందుగానే మీకు ఏవి అవసరం అవుతాయో వాటిని ముందుగా పట్టిక తయారు చేసుకోండి. దాన్ని మీ వెంట తప్పనిసరిగా తీసుకెళ్ళడానికి గుర్తుంచుకోండి. లేదంటే అవసరం అయినవి వదిలేసి, అనవసరమైనవి కొనే అవకాశం ఉంటుంది.

ఫుడ్ లేబుల్స్ ఎలా చదవాలో తెలుసుకోండి:

ఫుడ్ లేబుల్స్ ఎలా చదవాలో తెలుసుకోండి:

ఆహారాలను ప్యాక్ చేసి, కవర్స్ మీద న్యూట్రీషియన్ విలువలు చదవడాన్ని తెలుసుకోండి. వాటి ప్రయోజనం మరియు ఎంత శాతం క్యాలరీలున్నవి, ఫ్యాట్, ప్రోటీన్స్ మరియు కార్బోహైడ్రేట్స్ ఎంత మేరకు సర్వ్ చేస్తాయో తెలుసుకోవడం చాలా అవసరం. రసాయానికి పదార్థలకు సహజంగా పండించిన సేంద్రియ పదార్థాలకు వ్యత్యాసాన్ని తప్పనిసరిగా తెలుసుకోవాలి. ముఖ్యంగా ఫుడ్ లేబుల్స్ మీద ‘నేచురల్' మరియు ‘స్వచ్ఛమైన'అనే రెండు పదాలు మిమ్మల్ని తప్పుదారి పట్టించవచ్చు.

Desktop Bottom Promotion