Latest Updates
-
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.! -
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.! -
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.! -
బుధ గోచారంతో శని ప్రభావం.. ఈ రాశుల వారికి ఈ పది రోజులూ కష్టాలు తప్పవు.! -
బీరకాయ గారెలు..సూపర్ టేస్ట్ తో పాటు హెల్తీ కూడా..చేయడం చాలా ఈజీ! -
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.!
వెలుతురులేని ఇంటికి వెలుగులు నింపడి ఇలా.!
సూర్యరశ్మి ప్రవేశించని ఇంట్లో నివసించడం చాలా కష్టం. అలాంటి ఇంట్లో నివసించాల్సి వస్తే కాంతివంతంగా తీర్చిదిద్దేందుకు కొన్ని పద్ధతులుంటాయి. అవి తెలుసుకుందాం. చలికాలంలో నులివెచ్చని సూర్యకిరణాలు ఇంటి ముంగిట్లో కురుస్తుంటే ఇంటిల్లిపాదీ అక్కడ కూర్చొని వెచ్చదనాన్ని ఆస్వాదించడం ఎంత బాగుంటుందో! ఉదయభానుని లేలేత కిరణాల స్పర్శలో శుభోదయానికి స్వాగతం పలకాలని.
అలాంటి వాతావరణం ఉండే ఇల్లు ఉంటే బాగుంటుందని అందరికీ అనిపిస్తుంది. చిన్న పట్టణాల్లో అయితే ఇది కుదురుతుంది. కానీ మహానగరాల్లో సాధ్యమేనా? విస్తరిస్తున్న నగరం పెరిగే జనాభా రోజురోజుకూ చిన్నదిగా మారిపోతుంది. అసలు నివాసం దొరకడమే గగనమవుతున్న ఈ రోజుల్లో నచ్చిన రీతిలో నివాసం కావాలనుకుంటే సాధ్యమయ్యే పనికాదు.
అలాగని వెలుతురు లేని ఇంట్లో నెట్టుకు రావచ్చనుకోవడమూ కుదిరేది కాదు. పట్టపగలు ఇంట్లో అంధకారం నివసించేవారికి నిరుత్సాహం, అనారోగ్యం తప్పకుండా కలుగుతాయి. అయినా ఇలాంటి ఇళ్లలో ఉండాల్సిన పరిస్థితి వస్తే ఏం చేయాలి? ఆ ఇంటిని ప్రకాశవంతంగా తీర్చిదిద్దుకోవటం ఎలా? ఆ విషయాలు ఇప్పుడు చూద్దాం.

గోడలకు వేసే పెయింట్ ఇంటికి ఒక ప్రత్యేకమైన లుక్‌నిస్తుంది. సూర్యరశ్మి తక్కువగా చేరే ఇళ్లలో లైట్ కలర్, గ్లాసీ పెయింట్స్ వాడితే అవి వెలుతురును ప్రతిబింబించి చీకటిని తగ్గిస్తాయి. ఇలాంటి ఇళ్లకు తెలుపు, క్రీమ్, లేత నీలం, గులాబీ, ఆకుపచ్చ రంగులు సరిగ్గా నప్పుతాయి. ఈ రంగులు కిటికీల్లోంచి వచ్చే వెలుతురును గది నిండా వ్యాపించేలా చేస్తాయి. దీంతో ఇల్లు, కాంతివంతంగా ఉన్నట్లు ఫీలింగ్ కలుగుతుంది.

మందంగా ఉండే బట్టలు, ముదురు రంగుల తెరలు కిటికీ నుంచి వచ్చే వెలుతురును అడ్డుకుంటాయి. కాబట్టి కర్టెన్లు పల్చని ఫ్యాబ్రిక్‌తో తయారైన పసుపు, బంగారు , క్రీమ్ రంగుల్లో ఉంటే వెలుతురు గదిలోకి చేరే అవకాశం ఉంటుంది.

ఇంట్లో వెలుతురు ప్రసరించినప్పుడు గదిలో ఒకటే లైటు ఉంటే సరిపోదు. గోడకు ట్యూబ్ లైట్‌తోపాటు ఫ్లోర్ ల్యాంప్స్ కూడా అమర్చుకోవాలి. దీంతో గదిలో మూలలు కూడా ప్రకాశవంతమవుతాయి. ర్యాంపులు ముదురు రంగు కాకుండా లేద రంగు షేడ్స్ ఉండాలి. కోన్ ఆకారపు ల్యాంప్ షేడ్స్ చదువుకునేందుకు అనువుగా ఉంటాయి. కానీ గతి అంతటా వెలుతురు వ్యాపింపజేయవు. బల్బు మొత్తా న్ని కప్పి ఉంచేవి మరింత వెలుతురు పంచుతాయి. గదిలో ఇవే ఎక్కువగా వాడాలి.

వెలుతురు కోసం సరైన బల్బులనే ఎంచుకోండి. జిగేల్‌మంటూ మెరిసిపోయేట్లుండేవి కాకుండా మార్కెట్లో లభించే సీఎఫ్‌ఎల్ బల్బులను వాడితే కరెంటు ఆదాతోపాటు ఇంటికి సహజకాంతిని కూడా అందిస్తాయి. నియోడైమియమ్ అనే రసాయనంతో పెయింట్ చేసిన ఈ బల్బులు అచ్చం సూర్యకాంతిలాగే ప్రకాశిస్తాయి.

గోడలను అలంకరించటానికి పెయింటింగ్స్‌తో పాటు ఈ రోజుల్లో పెద్దపెద్ద అద్దాలనూ వాడుతున్నారు. అయితే పెయింటిగ్స్ మాదిరి అద్దాలు మరీ ఎక్కువ అమర్చ లేము. అయినా గదిలో అలంకరణతోపాటు ఒక అద్దాన్ని ఉంచితే వెలుతురు బాగా పెరుగుతుంది. దీని కోసం కిటికీ ఎదురుగా ఉన్న గోడకు ఒక పెద్ద అద్దాన్ని అమర్చండి. ఇది కిటికీ నుంచి వచ్చే వెలుతురును ప్రతిబింబించి గది అంతా వెలుగు నింపుతుంది.

ముదురు రంగు ఫర్నీచర్ గదిలో వెలుతురు తగ్గిన ఫీలింగ్ కల్గి స్తాయి. కాబట్టి ముదురు రంగు ఉడ్‌కు బదులు లేత రంగు ఉడ్‌తో తాయరైన ఫర్నీచర్ తీసు కోవాలి. ఇంటిని కాంతివంతంగా మార్చేందుకు మరికొన్ని చిట్కాలు అల్మారాల్లో కూడా బల్బులు అమర్చుకుని, తెరవగానే వెలిగేలా చేసుకోవాలి. దీంతో అందులోని సామాన్లు తీసుకోవటం సులభతరమౌతుంది. కిచెన్ కౌంటర్, ఫ్లోర్‌లకు తెలుపు లేదా క్రీమ్ కలర్ మార్బుల్ వాడితే వెలుగు ప్రతిబింబిస్తుంది. డైనింగ్, సెంటర్ టేబుళ్ళు గ్లాస్‌వి అముర్చుకుంటే వెలుతురును మరింత ప్రతిబింబిస్తాయి. గది కిటికీలకు బదులు గాజు స్లైడింగ్ డోర్స్ అమర్చుకుంటే వీలైనంత ఎక్కువ వెలుతురు ఇంట్లోకి ప్రవేశిస్తుంది.

ఉదయాన్నే బల్బు కాంతిలో నిద్ర లేవాలనుకుంటే ఈ రోజుల్లో టైమర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ బల్బులకు మీరు ఉదయం నిద్రలేచే టైమ్ సెట్ చేస్తే అదే సమయానికి వెలుగుతాయి.

కొన్ని అలంకరణ వస్తువులు కూడా కాంతిని ప్రతిబింబిస్తాయి. గ్లాజు లేదా క్రిస్టళ్ళతో తయారైన ఫ్లవర్ వాజులు, షోపీస్‌లు ఈ కోవలోకే వస్తాయి.

బెడ్‌షీట్లు లేదా సోఫా కవర్లు తెలుపు, లేత రంగుల్లో ఉంటే గదిలో వెలుతురు నిండుగా ఉంటుంది. మీ ఇంటిలో లోపలికి సూర్యుని వెలుగు ప్రసరించ కపోయినా విచారించనక్కర్లేదు. కాస్త సృజనాత్మకత, ఊహాశక్తిని ఉపయోగించి ఇంటిని అందంగా తీర్చిదిద్దవచ్చు. మీ వంతు ప్రయత్నమే దీనికి ఆధారం.

టెక్నాలజీ వేగంగా పెరుగుతున్న ఈ రోజుల్లో సూర్యరశ్మియే వెలుతురు నివ్వాలన్నదేం లేదు. దానికి సరిసమానమైన కృత్రిమ వెలుతురును మీ ఇంటికి తెచ్చుకోవచ్చు. ఆ వెలుతురులో మీ జీవితంలోని అంధకారాన్ని తొలగించి ప్రకాశాన్ని నింపుతుంది.



Click it and Unblock the Notifications